BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (22/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి ఊహించని సమస్యలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (22/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి ఊహించని సమస్యలు
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. నిరుద్యోగులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  చిన్ననాటి  మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు జీతాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృషభ రాశి:

వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.  ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో సమస్యల నుండి బయటపడతారు. నూతన  కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. రాజకీయ ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.


మిథున రాశి:  

బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

కర్కాటక రాశి:

ప్రయాణాల్లో మార్గ అవరోధాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొందరు ప్రవర్తన వలన మానసిక చికాకులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమతో కానీ పనులు పూర్తి కావు.

సింహరాశి:

ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రులతో విందువినోద ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

కన్యారాశి :

ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార. ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అనుకున్న వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికరాశి:

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలలో రావలసిన అటువంటి అవకాశములు చివరి నిమిషంలో చేజారుతాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు రాశి:

ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారమున  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మకరరాశి:

ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

కుంభరాశి:

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ముఖ్యమైన  పనులు వాయిదా వేస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.  వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

మీనరాశి:

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. బంధుమిత్రులు  కొన్ని విషయాలను మీతో విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని  సమస్యలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో  శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (21/10/2025) ఆ రాశి ఉద్యోగులకు సమస్యలు – ప్రయాణాలు వాయిదా పడతాయి

Diwali 2025 Zodiac: 100 ఏళ్ల తర్వాత దీపావళి నాడు హంస మహాపురుష రాజయోగం.. వీరిపై కాసుల వర్షం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (20/10/2025)  ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు – వారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి

Zodiac sign: దీపావళి తర్వాత ఆ 6 రాశుల వాళ్ళు నక్క తోక తొక్కినట్లే – కోట్లు సంపాదన రాబోతుంది

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 19 – అక్టోబర్‌ 25) ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (19/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు చిక్కులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (18/10/2025) ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వ్యాపారులకు ఊహించని లాభాలు

Big Stories

×