Womens World Cup 2025 Semis: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సెమీస్ దశ వరకు వచ్చింది. ఇప్పటికే నాలుగు జట్లు సెమీఫైనల్ కు కూడా వెళ్లాయి. పాయింట్లు పట్టిక ప్రకారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ అలాగే టీమ్ ఇండియా వరుసగా సెమీ మఫైనల్ కు చేరిపోయాయి. ఈ నేపథ్యంలోనే సెమీ ఫైనల్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారు చేసింది ఐసీసీ. నిన్న దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించడంతో.. టీమిండియాతో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ జరగనుంది.
ఐసీసీ రూల్స్ ప్రకారం పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్న టీం ఇండియాతో రెండవ సెమీఫైనల్ ఆడాల్సి ఉంటుంది. అలాగే మొదటి సెమీ ఫైనల్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఫైట్ ఉండనుంది. నిన్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే పరిస్థితి వేరే లాగా మారిపోయేది. అక్టోబర్ 29వ తేదీన మొదటి సెమీఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ గౌహతి వేదికగా నిర్వహించనున్నారు.
ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జరగనుంది. అంటే మధ్యాహ్నం రెండున్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. అలాగే రెండో సెమీఫైనల్ లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కూడా జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా తిలకించవచ్చు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( World Cup 2025) భాగంగా ఇవాళ చిట్టచివరి లీగ్ దశ మ్యాచ్ ఆడనుంది మహిళల టీం ఇండియా జట్టు. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మహిళల టీం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ( India Women vs Bangladesh Women, 28th Match ) మధ్య ఫైట్ జరగనుంది. నావి ముంబై స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు వెళ్లగా బంగ్లాదేశ్ ఎలిమినేట్ అయింది. టీమిండియా గెలిచినా కూడా నాలుగో స్థానానికి పరిమితం అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
The #CWC25 semi-final matchups are now set 🥵#ENGvSA #AUSvIND pic.twitter.com/RQ2ZjW10Df
— ICC (@ICC) October 25, 2025