Rohit Sharma: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. రోహిత్ శర్మ తాజాగా ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఆయన నిన్ను అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరినట్లు వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ముంబైలోని కోకిలాబెన్ అనే ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అడ్మిట్ అయినట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే హాస్పిటల్ లోపలికి రోహిత్ శర్మ వెళ్లిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ముంబైలోని ఆసుపత్రికి రోహిత్ శర్మ వెళ్లినట్లు చెబుతున్నారు.
టీం ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన తొడ కండరాలు పట్టేశాయని… దీంతో నొప్పి విపరీతంగా ఉందని రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలోనే…. భారీగా బరువు తగ్గి… ఫిట్ గా మారారు. యో యో అలాగే బ్రాంకో టెస్ట్ నేపథ్యంలో…. రోహిత్ శర్మ దాదాపు 24 కిలోలు తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన తొడ కండరాలు పట్టేసాయట. అయితే ఆ గాయం నుంచి కోలుకునేందుకు తాజాగా ముంబైలోని ప్రముఖ కోకిలబెన్ కు వెళ్లినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియోలో చాలా సింపుల్గా రోహిత్ శర్మ కనిపించారు. తన సెక్యూరిటీ లేదా కుటుంబ సభ్యులు లేకుండానే ఆసుపత్రికి సైలెంట్ గా వచ్చారు రోహిత్ శర్మ. సాధారణ స్లిప్పర్స్ ధరించి… మెల్లిగా నడుచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లారు రోహిత్ శర్మ. దీన్నిబట్టి చూస్తే నిజంగానే రోహిత్ శర్మకు… హెల్త్ ఇష్యూ ఉందని తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా తీసుకువచ్చిన పరీక్షలు నేపథ్యంలో… టీమిండియా వన్డే కెప్టెన్ రో హి త్ శర్మ భారీగా బరువు తగ్గారు. కేవలం 20 రోజుల్లోనే 24 కిలోలు తగ్గారు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు ఈమధ్య కాలంలోనే వైరల్ అయిన సంగతి తెలిసిందే. బ్రాంకో, యోయో టెస్టుల నేపథ్యంలోనే… రోహిత్ శర్మ బరువు తగ్గాల్సి వచ్చింది. ఈ టెస్టులను విజయవంతంగా కూడా ఫినిష్ చేశాడు హిట్ మెన్ రోహిత్ శర్మ. అటు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలోనే… వన్డే సిరీస్ జరుగనుంది. ఆ సమయంలోనే… టీమిండియాలోకి రానున్నారు రోహిత్ శర్మ.
Also Read: Hafthor Bjornsson 510 kg: వీడు మనిషి కాదు..మృగమే…ఏకంగా 510 కేజీలు ఎత్తి సరికొత్త చరిత్ర
ఆస్పత్రిలో చేరిన రోహిత్ శర్మ !
టీమ్ ఇండియా ODI కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆస్పత్రి లోపలికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోహిత్ తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో చెకప్ చేయించుకునేందుకు… pic.twitter.com/kBDyS4bXsi
— ChotaNews App (@ChotaNewsApp) September 9, 2025