BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: పాపం సంజన.. వారం మొత్తం భరిస్తుందా?

Bigg Boss 9 Promo: పాపం సంజన.. వారం మొత్తం భరిస్తుందా?

Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 9 ఏడవ వారం చివరి దశకు చేరుకుంది. ఇక నామినేషన్స్ లో భాగం ఈ వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష ఎలిమినేట్ అయింది. ఇకపోతే వీకెండ్స్ అనగానే హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే హౌస్ లో జరిగిన విషయాలను, కంటెస్టెంట్స్ మధ్య ఏర్పడిన వివాదాల గురించి చర్చిస్తూ తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది? అనే విషయాలపై గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అంతేకాదు హౌస్ లో ఒకరికి సంబంధించిన వీడియోలను ఇంకొకరికి చూపిస్తూ అసలు బండారం బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా వీకెండ్స్ లో భాగంగా మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చిన నాగార్జున.. ఇచ్చిన టాస్క్ కి ఇమ్మానుయేల్ వల్ల సంజన మళ్లీ బలైంది అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..


కొత్త టాస్క్.. లాస్ట్ లో మిస్..

ప్రోమో విషయానికి వస్తే.. హోస్ట్ నాగార్జున ఒక టాస్క్ నిర్వహించారు. అందులో తనూజ, రీతూ చౌదరి, పవన్, సుమన్ నలుగురు పాల్గొన్నారు. సంచాలక్ గా మాధురి వ్యవహరించింది. టాస్క్ విషయానికి వస్తే బీకర్లో ఉన్న బాలును నీటిని నింపుతూ పైకి తీసుకురావాలి.. అలా తీసుకొచ్చిన బాలును ముందు ఉన్న బోర్డులో అతికించి అక్కడ దొరికే కీ సహాయంతో దాని ముందు ఉన్న బాక్స్ ను తెరవాల్సి ఉంటుంది. ఇక ఆ బాక్స్ లో ఉన్న ఫజిల్ ను తీసుకొచ్చి ఎదురుగా ఉన్న బోర్డులో పెట్టి ఫజిల్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఫజిల్ పూర్తయిన వెంటనే.. రోజ్ రూమ్ కి చేరుకొని.. మీకు ఇచ్చిన కలర్ రింగును తీసుకువెళ్లి పెడెస్టల్ మీద ఉన్న ఎల్లో స్టోన్ మీద పడేలా విసరాలి. అంటూ టాస్క్ వివరించింది మాధురి. అయితే ఇందులో తనూజ తన పెర్ఫార్మన్స్ తో చివరి వరకు చేరుకుంది. కానీ ఆ ఎల్లో స్టోన్ పై రింగ్ ను వేయడంలో ఆమె విఫలం అవుతుంది.

పాపం సంజన.. ఇమ్మూ మళ్లీ బలిచేశాడుగా..

ఇక కట్ చేస్తే నాగార్జున ఇన్ విజిబుల్ కేప్ గురించి మాట్లాడుతూ.. మళ్ళీ ఇంటికి కెప్టెన్ అయిన ఇమ్మానుయేల్ తో.. ఈ కేప్ ఓపెన్ చేయించారు. నాగార్జున మాట్లాడుతూ.. ఇది ఇన్ విజిబుల్ కేప్.. వారం మొత్తం ధరించాలి అయితే ఇది ధరించిన వారు ఎవరితో మాట్లాడకూడదు. మిగతా వాళ్ళు ఎవరూ కూడా వీరితో మాట్లాడకూడదు.. ఉన్నా హౌస్ లో లేనట్లే అంటూ అందరికీ షాక్ ఇచ్చారు నాగార్జున. ఈ కేప్ ఎవరికి ఇస్తావు అంటూ ఇమ్మానూయెల్ ను అడిగాడు నాగార్జున. దీంతో డైలమాలో పడిపోయిన ఇమ్మానుయేల్ తో నాగార్జున మాట్లాడుతూ.. “ఎవరికిస్తే నీ కెప్టెన్సీ చక్కగా సాగుతుంది” అని అడగగా దానికి ఇమ్మూ ఇంకెవరికి మా మమ్మీకే ఇస్తాను సార్ అంటూ సంజనకి ఆ కేప్ ఇచ్చేసారు. మొత్తానికి అయితే మళ్లీ మమ్మీ అని పిలుస్తూనే పెద్ద బొక్క పెట్టాడు అంటే నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ALSO READ: Film Chamber: 30 ఏళ్ల ఫిలిం ఛాంబర్ కూల్చివేత.. అసలేం జరుగుతోంది?

 

Related News

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 యాజమాన్యంలో ఎంత మార్పు వచ్చిందో, దెబ్బకు అలా చేయడం ఆపేశారు

Big Stories

×