Love Failure: వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. మహేష్(21) అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం తండాకు చెందిన యువతి, మహేష్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు.
ఈ విషయం తెలుసుకున్న మహేష్ తాను లవ్ చేసిన అమ్మాయి దక్కడం లేదని.. తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 23న రాత్రి తన నివాసంలో పురుగులు మందు తాగాడు. ఇది గమనించిన పేరెంట్స్ అతనిని నర్శంపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్చారు. పరిస్తితి విషమించండంతో వేరే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పురుగులు మందు తాగుతూ మహేష్ తీసుకువ్నసెల్పీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద కారు బీభత్సం.. డివైడర్, బైక్‌ని ఢీ కొట్టి, కారులో ముగ్గురు
పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేష్ ఫోన్‌లోని వీడియోను స్వాధీనం చేసుకుని, ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.