Weekly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (అక్టోబర్ 19 – అక్టోబర్ 25) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. అన్నిరంగాల వారికి అనుకూల సమయం. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. లక్ష్మీ నృసింహ కరావలంభ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయి అవుతుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషానిస్తుంది. విద్యార్థుల ఆశించిన అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో రుణఒత్తిడులు అధికామౌతాయి. బంధువులతో విభేదాలు తప్పవు. హనుమాన్ ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. వారం చివరిలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ప్రముఖుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ఆర్థిక వ్యవహారాలు మందకోడీగా సాగుతాయి. మిత్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు అధిగమవుతాయి. సోదరులను కలుసుకుని వివాహ విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తప్పవు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనాప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
సంఘంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు ఆదిగమిస్తారు. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాదిస్తాయి. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. విలువైన వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపారమున తీసుకునే నిర్ణయాలలో మరింత నిదానంగా వ్యవహారించాలి. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సుబ్రమణ్య అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూల మవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది మధురష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వారం చివరిలో అనుకోని ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబంలో గంధరగోళ పరిస్థితులుంటాయి. మానసిక చికాకులు తప్పవు. గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగమున్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున జీత భత్యముల విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టిన శ్రమ తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఊహించని వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. హనుమాన్ఛాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఆకారణ వివాదాలు చికాకు పరుస్తాయి. స్థిరాస్తి సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు విఫలమవుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. వ్యాపారాలలో అనుకోని మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందవు వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. శ్రీరాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.