Mouli: మౌళి (Mouli) .. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. చిన్న వయసులోనే ఈ రేంజ్ సక్సెస్ చూసి.. పెద్ద హీరోలు కూడా ఈయన సక్సెస్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మౌళిని ఈ రేంజ్ లో నిలబెట్టిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ప్రముఖ సీనియర్ నటుడు శివాజీ (Sivaji) రీ ఎంట్రీలో భాగంగా చేసిన 90’S బయోపిక్ లో శివాజీ కొడుకు పాత్రలో నటించి తన నటనతో అందరిని అబ్బురపరిచారు. ఆ క్రేజ్ తోనే లిటిల్ హార్ట్స్ మూవీలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు మౌళి.
సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి హీరోగా, శివాని నాగారం హీరోయిన్లుగా తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ సినిమాని ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాకి పోటీగా అనుష్క శెట్టి (Anushka Shetty) ‘ఘాటీ’ తోపాటు శివ కార్తికేయన్(Siva Karthikeyan) ‘మదరాసి ‘ చిత్రాలు విడుదలైనా.. ఈ రెండు చిత్రాలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. అలా చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు మౌళి. అలాంటి ఈయన ఇప్పుడు జోరు పెంచారు అని చెప్పవచ్చు.
తాజాగా పోలీస్ గెటప్ లో అదరగొట్టేసారని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వీడియో విషయానికి వస్తే.. ప్రముఖ సీనియర్ నటుడు ఆశీష్ విద్యార్థితో కలిసి హిందీలో ఒక యాడ్ చేశారు మౌళి. ఇందులో ఆశీష్ విద్యార్థి తోపాటు మౌళి కూడా పోలీస్ గెటప్ లో అదరగొట్టేసారు అని చెప్పవచ్చు. యాడ్ విషయానికి వస్తే ఇది థమ్స్ అప్ యాడ్.. ఒక చేత్తో బిర్యానీ తిను.. మరొక చేతితో థమ్స్ అప్ తాగు అనే కాన్సెప్ట్ తో వచ్చిన యాడ్లో చాలా అద్భుతంగా నటించేసారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన యాడ్ వీడియోని పెయిడ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆశిష్ విద్యార్థి తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ALSO READ:Tom – Ana de: అంతరిక్షంలో పెళ్ళన్నారు.. 9 నెలలకే బోర్ కొట్టేసిందా టామ్!
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంత త్వరగా బాలీవుడ్లోకి కూడా జంప్ అయ్యావా.. నువ్వు సూపర్ మౌళి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒక మహేష్ బాబు.. ఒక ఎన్టీఆర్.. ఒక అల్లు అర్జున్.. ఒక రాంచరణ్.. ఒక మౌళి అంటూ స్టార్ హీరోల జాబితాలోకి మౌళిని కూడా చేర్చేస్తున్నారు. నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఎవరికి వారు మౌళి పర్ఫామెన్స్ పై ప్రశంసల కురిపిస్తూ మంచి కథలను ఎంచుకొని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా మౌళి ఇంత వేగంగా అటు సినిమాలలోనే కాకుండా ఇటు ఏకంగా బాలీవుడ్ లోకి వెళ్ళి.. యాడ్స్ లో కూడా నటిస్తూ మరింత బిజీగా మారిపోయారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
?utm_source=ig_web_copy_link