BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (16/10/2025) ఆ రాశి వారు ప్రయాణాలలో జాగ్రత్త – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (16/10/2025) ఆ రాశి వారు ప్రయాణాలలో జాగ్రత్త – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సంతానం కొన్ని విషయాలలో మీమాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు తప్పవు. ప్రారంభించిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తిచేస్తారు.

వృషభ రాశి:

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.


మిథున రాశి:  

పాత బుణాలు కొంత వరకు తీరుస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు పొందుతారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిదికాదు.

కర్కాటక రాశి:

కొన్ని వ్యవహారాలలో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది. ఆదాయం ఆశించిన విధంగా ఉండదు.

సింహరాశి:

స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశములు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.

కన్యారాశి :

ధన వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు.

వృశ్చికరాశి:

ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నతాధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలులో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు రాశి:

వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరరాశి:

ఆర్ధిక ఇబ్బందుల వలన శిరో బాధలు పెరుగుతాయి. అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యడం మంచిది. కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది.

కుంభరాశి:

సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారము నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘ కాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.

మీనరాశి:

సన్నిహితుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమములు ప్రారంభిస్తారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (15/10/2025) ఆ రాశి వారు విలువైన వస్త్రాభరణాలు కొంటారు – వారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (14/10/2025) ఆ రాశి జాతకులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త – ఉద్యోగులకు ఆఫీసులో సమస్యలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (13/10/2025) ఆ రాశి వారికి రియల్‌ ఎస్టేట్‌ లో లాభాలు – వారికి అనారోగ్య సమస్యలు  

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (అక్టోబర్‌ 12 – అక్టోబర్‌ 18) ఆ రాశి వారు స్థిరాస్తులు కొంటారు – ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (12/10/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (11/10/2025) ఆ రాశి వారికి ఆర్థిక నష్టం – అకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (10/10/2025) ఆ రాశి రాజకీయ నాయకులకు అరుదైన ఆహ్వానాలు – ప్రముఖులతో పరిచయాలు

Big Stories

×