BigTV English

Bigg Boss: హౌస్ లో కుల వివక్షత.. ఇదెక్కడి గోలరా బాబు!

Bigg Boss: హౌస్ లో కుల వివక్షత.. ఇదెక్కడి గోలరా బాబు!
Advertisement

Bigg Boss:తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి కాగా.. 9వ సీజన్ కూడా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా.. ఆరవ వారం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ రోజుతో ఆరవ వారం కూడా పూర్తవుతుంది..ఇలా రసవత్తరంగా సాగుతోంది ఈ సీజన్.. పైగా పాత కంటెస్టెంట్స్ కి తోడు ఇప్పుడు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్నారు. హోస్ట్ నాగార్జున (Nagarjuna) చెప్పినట్లుగానే ఇది చదరంగం కాదు.. రణరంగంలా చూసేవారికి కూడా అనిపిస్తోంది. ఇక ఈ ఆదివారం భరణి శంకర్ ఎలిమినేట్ కానున్న విషయం తెలిసిందే.


బిగ్ బాస్ హౌస్ లో మరో వివాదం..

ఇదిలా ఉండగా ప్రేక్షకులకు ఎంత వినోదాన్నైతే ఈ షో పంచుతోందో.. అంతే వివాదంలో కూడా చిక్కుకుంటోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న తెలుగు బిగ్ బాస్ ను రద్దు చేయాలని కొందరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కన్నడలో కూడా పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు అంటూ ఇటీవల మూసేసి మళ్లీ ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు మరొకసారి బిగ్ బాస్ హౌస్ లో మరో వివాదం మొదలైంది. కిచ్చా సుదీప్(Kiccha Sudeep) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12 మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ కన్నడ బిగ్ బాస్ ఫ్యాన్స్ వీకెండ్ ఎపిసోడ్ ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం కంటెస్టెంట్ల మధ్య వచ్చిన కుల ప్రస్తావన.

ALSO READ:Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!


కుల వివక్షత చూపిస్తూ..

ప్రస్తుతం హౌస్ లో ఉన్న రక్షిత శెట్టి ని.. తోటి కంటెస్టెంట్స్ జాన్వీ , అశ్విని గౌడ నోటికి వచ్చినట్లు దూషించడమే కాకుండా కుల వివక్షత చూపించి.. ఆమెపై విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు రక్షిత శెట్టి కమ్యూనికేషన్ స్టైల్, కన్నడ భాష నైపుణ్యం , డ్రెస్సింగ్ వంటి విషయాల్లో చాలా నీచమైన కామెంట్లు చేయడం చూసేవారికి కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.. రక్షిత శెట్టితో వీరిద్దరూ..” నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసు. నీ డ్రెస్ చూస్తేనే నువ్వు ఎలాంటి దానివో అర్థం అవుతోంది.. నువ్వు ఎస్ కేటగిరి.. నీ డ్రామాలు బాత్రూంలోనే ఉండనివ్వు” అంటూ రక్షితను చాలా దూషిస్తూ అవమానపరిచారు. దీంతో ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి వాళ్లను హౌస్ లో ఉంచకండి అశ్విని, జాన్వి లను వెంటనే ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ ఎపిసోడ్లో సుదీప్ వారికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో అని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కాలంలో కూడా కుల వివక్షత చూపిస్తూ తోటి నటీనటులను అవమానపరచడం అనాగరికతకు దారితీస్తోంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..మొత్తానికైతే రక్షిత శెట్టికి మద్దతు బాగా పెరుగుతోంది.

Related News

Bigg Boss 9: దీపావళి స్పెషల్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ నుంచి భరణి అవుట్.. 6 వారాలకు ఎంత సంపాదించాడంటే?

Bigg Boss 9: మాధురి కోరిందే జరిగింది.. ఫుడ్ మానిటర్ ఛేంజ్, తనూజ కళ్లు తెరిపించిన నాగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Ramya Moksha: వామ్మో రమ్య.. డిమోన్ ని తమ్ముడు అనేసిందేంటి! షాకైన నాగార్జున

Big Stories

×