BigTV English

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ
Advertisement

OTT Movie : ఈ దెయ్యాల సినిమాల లెక్కే వేరు. హాలీవుడ్ దెయ్యాలకు, ఒక చర్చితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది. ఇవి చేసే ఆరాచకాలను,చర్చ్ ఫాదర్ లు కంట్రోల్ చేస్తుంటారు. అయితే ఈ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో, విచిత్రంగా చర్చ్ నుంచే ఒక సైతాన్ ని రప్పించడానికి ప్రయత్నిస్తారు. ఈ కథ చాలా ఇంట్రెస్టింగా, ఉత్కంఠంగా ఉంటుంది. ఈ కథ ఒక అమెరికన్ నన్, రోమ్‌లోని కాథలిక్ ఆర్ఫనేజ్‌లో పని చేస్తూ, సైతాన్ రాకను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. హారర్ మూవీ లవర్స్ కి ఇదొక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ?ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది ఫస్ట్ ఓమెన్’ (The first omen) 2024లో వచ్చిన అమెరికన్ సూపర్‌ నాచురల్ హారర్ మూవీ. ఆర్కాషా స్టీవెన్సన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో నెల్ టైగర్ ఫ్రీ, రాల్ఫ్ ఇనెసన్, సోనియా బ్రాగా, తావ్ఫీక్ బర్హోమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల అయింది. 2024న మే 30న నెట్‌ఫ్లిక్స్‌, హులులో స్ట్రీమింగ్ అయింది. IMDbలో 6.5/10రేటింగ్ కూడా పొందింది.

కథలోకి వెళ్తే

ఈ కథ1971లో రోమ్‌లో మొదలవుతుంది. మార్గరెట్ అనే అమెరికన్ అమ్మాయి, కాథలిక్ చర్చిలో నన్ (సన్యాసిని) కావడానికి రోమ్‌లోని ఒక ఆర్ఫనేజ్‌కు వస్తుంది. ఆమె అక్కడ ఆర్ఫన్ పిల్లలతో బాగా కలిసిపోతుంది. కానీ ఆమె వచ్చాక ఆర్ఫనేజ్‌లో వింత సంఘటనలు జరుగుతాయి. పిల్లలు కూడా చాలా భయపడతారు రాత్రిళ్లు భయంకర శబ్దాలు వస్తాయి. మార్గరెట్ అక్కడ సిస్టర్ ఇంగ్రిడ్ తో కలిసి పనిచేస్తుంది. ఫాదర్ కార్లో అనే ప్రీస్ట్ ఆమెకు సహాయంగా ఉంటాడు. మార్గరెట్‌కు ఆర్ఫనేజ్‌లో ఒక పిల్ల గర్భిణీ అయినట్టు తెలుస్తుంది. అది అంటీక్రైస్ట్ (డెవిల్ బేబీ) పుట్టుక కోసం చెడు ప్లాన్‌లో భాగమని అనుమానిస్తుంది. దీంతో ఆమె చాలా భయపడుతుంది. కానీ ఆమె నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మార్గరెట్ ఆర్ఫనేజ్‌లో జరిగే విషయాలను విచారిస్తూ, చర్చి లోపల పెద్ద కుట్ర జరుగుతోందని తెలుసుకుంటుంది.


Read Also : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

చర్చిలోని కొంతమంది ఉన్నతాధికారులు అంటీక్రైస్ట్‌ను పుట్టించి, ప్రపంచాన్ని భయపెట్టాలని ప్లాన్ చేస్తుంటారు. మార్గరెట్ ఫాదర్ బ్రేనాన్ సహాయంతో ఈ కుట్రను ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ పెద్దవాళ్ల ప్రమేయం ఉండటంతో ఆమె ఏమీ చేయలేక పోతుంది. మార్గరెట్ చర్చి కుట్రను పూర్తిగా కనుక్కుంటుంది. అంటీక్రైస్ట్ పుట్టుక కోసం చర్చి హై అప్స్ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు మార్గరెట్‌ను కూడా ఈ ప్లాన్‌లో ఉపయోగించాలని చూస్తారు. కానీ ఆమె ధైర్యంగా ఎదుర్కొని, ఈ కుట్రను ఆపడానికి పోరాడుతుంది. కథలో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. అంటీ క్రైస్ట్ పుట్టుక ఆపలేనంత దగ్గరకు వస్తుంది. భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. చివరికి మార్గరెట్ ఈ కుట్రను ఆపుతుందా ? అంటీ క్రైస్ట్ పుడతాడా ? వినాశనం జరుగుతుందా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×