Bandla Ganesh:బండ్ల గణేష్ (Bandla Ganesh) .. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతగా.. కమెడియన్ గా.. నటుడిగా… హీరోగా కూడా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భక్తుడిని అని చెప్పుకుంటూ తెగ వార్తల్లో నిలుస్తున్న ఈయన.. అప్పుడప్పుడు పలు సినిమా ఈవెంట్లలో కొంతమంది వ్యక్తులను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ చేసే కామెంట్ల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నిత్యం గురూజీ అంటూ త్రివిక్రమ్ ను టార్గెట్ చేసే బండ్ల గణేష్.. మొన్నామధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Arvind) పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ (Allu Arjun) అతడే అంటూ భారీ హైప్ ఇచ్చేశారు బండ్లన్న. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో బండ్ల గణేష్ టాలీవుడ్ ప్రముఖుల కోసం పెద్ద ఎత్తున దీపావళి వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), తేజ సజ్జా (Teja Sajja), వెంకటేష్ (Venkatesh) లాంటి ప్రముఖులు అతిధులుగా హాజరయ్యారు.. ఈ వేడుకల్లో బండ్ల గణేష్ తేజ సజ్జా గురించి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తదుపరి అల్లు అర్జున్ తేజ” అంటూ కామెంట్లు చేశారు. తేజ పై బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించడంతో ఈవెంట్ కి హాజరైన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ బండ్ల గణేష్ మాటలకు మద్దతు పలకడం విశేషం. మొత్తానికైతే బండ్ల గణేష్ తేజ పై కామెంట్లు చేయగా.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు తేజ సజ్జ దూసుకుపోతాడు. నెక్స్ట్ అల్లు అర్జున్ తేజా సజ్జానే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారండి.
తేజ సజ్జ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈయన దాదాపు చాలా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత లీడ్రోల్ పోషిస్తూ వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తేజ.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. మధ్యలో కొన్ని సినిమాలు చేసి ప్రాంతీయంగా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఇప్పుడు సినిమాతో ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో సూపర్ యోధా పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ALSO READ:Bigg Boss: హౌస్ లో కుల వివక్షత.. ఇదెక్కడి గోలరా బాబు!
ప్రస్తుతం జాంబిరెడ్డి 2 కోసం మరొకసారి దర్శకుడు ప్రశాంత్ వర్మతో జతకట్టనున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడం గమనార్హం. 2027 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.