Water Tank Collapse: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అంతా ఆనందంగా కొత్త హోటల్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తుండగా.. ఒక్క క్షణంలోనే ఆ సంతోషం ఆవిరైపోయింది. శనివారం అర్ధరాత్రి సమయంలో హోటల్ పై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. తల్లి కూమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి.. రేకుల షెడ్డు హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం హోటల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకు ఏర్పాట్లతో బిజీగా ఉన్న కుటుంబం రాత్రి ఆలస్యమవడంతో హోటల్‌లోనే బస చేశారు. రమేశ్ భార్య నాగమణి (32), కుమారుడు వంశీకృష్ణ (6), మరికొందరు బంధువులు రాత్రి అక్కడే నిద్రించారు.
Also Read: ఏంటీ సమాజం.. సాటి మనిషి ఆపదలో ఉంటే..? నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య ఘటనపై వీసీ సజ్జనార్ స్పందన
అయితే రేకులపై బరువు ఎక్కువ కావడంతో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హోటల్ నిర్మాణం ఎలా జరిగిందో, వాటర్ ట్యాంక్ ఏర్పాటు పద్ధతిలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.