BigTV English

M5 vs M4 MacBook Pro: M5 మ్యాక్ బుక్ ప్రో vs M4 మ్యాక్ బుక్ ప్రో.. ఆపిల్ రెండు ల్యాప్‌టాప్స్‌లో ఏది బెటర్?

M5 vs M4 MacBook Pro: M5 మ్యాక్ బుక్ ప్రో vs M4 మ్యాక్ బుక్ ప్రో.. ఆపిల్ రెండు ల్యాప్‌టాప్స్‌లో ఏది బెటర్?
Advertisement

M5 vs M4 MacBook Pro| ఆపిల్ తాజాగా M5 మ్యాక్‌బుక్ ప్రోను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. AI పెర్ఫార్మెన్స్‌తో ఇది మెరుగైన ల్యాప్‌టాప్. గతేడాది వచ్చిన ఫేమస్ M4 మోడల్ ఇది అప్ గ్రేడ్ వెర్షన్. చాలా మంది ఆపిల్ ఫ్యాన్స్ ఈ రెండింటి మధ్య ప్రధాన తేడాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే రెండు ఆపిల్ ల్యాప్ టాప్స్ ఫీచర్లు పోల్చి కొత్త వెర్షన్ లో ఉన్న మార్పులు ఏందో చూద్దాం.


డిజైన్, బిల్డ్

బయట నుంచి దీని డిజైన్, రూపంలో ఎటువంటి మార్పు లేదు. M5 మోడల్ M4లా ఒకే మెటల్ మెటీరియల్‌తో తయారైంది. పొడవు, వెడల్పు, బరువు అన్నీ ఒకేలా ఉన్నాయి. రెండింటి డిజైన్ స్మార్ట్‌గా ఉంది. మార్పులు లేవు. ఇప్పటికే ఉన్న రెండు కలర్ ఆప్షన్‌లు కొనసాగుతున్నాయి. యూజర్లు.. స్పేస్ బ్లాక్ లేదా సిల్వర్ ఎంచుకోవచ్చు. డిజైన్ మార్చలనే విషయంలో ఆపిల్ రిస్క్ తీసుకోలేదు, అందులోని కాంపోనెంట్‌లను (ముఖ్యమైన భాగాలు) మాత్రమే అప్‌గ్రేడ్ చేసింది.

ఒకే అద్భుతమైన డిస్‌ప్లే

రెండు మ్యాక్‌బుక్‌లలోనూ 14.2-ఇంచ్ లిక్విడ్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. షార్ప్‌నెస్, పిక్సెల్ డెన్సిటీ అన్నీ ఒకేలా ఉన్నాయి. మినీ-LED టెక్నాలజీతో అద్భుతమైన కాన్‌ట్రాస్ట్ లెవెల్స్. HDR కంటెంట్‌కు పీక్ బ్రైట్‌నెస్ 1,600 నిట్స్ వరకు వస్తుంది. ప్రోమోషన్ ఫీచర్‌తో 120Hz రిఫ్రెష్ రేట్. నానో-టెక్స్చర్ గ్లాస్ ఆప్షన్ కూడా ఉంది. బయటి డిస్‌ప్లే సపోర్ట్ కూడా రెండింటిలో ఒకేలా ఉంది.


పెర్ఫామెన్స్ లో పెద్ద మార్పు

పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఆపిల్ పెద్ద మార్పు చేసింది. M5 చిప్‌లో AI పెర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంది. GPU కోర్‌లో కొత్త న్యూరల్ యాక్సిలరేటర్. ఆపిల్ ప్రకారం AI టాస్క్‌లు 3.5 రెట్లు వేగవంతంగా చేస్తుంది. గ్రాఫిక్స్ పెర్ఫామెన్స్ 1.6 రెట్లు ఫాస్టర్. మల్టీ-థ్రెడెడ్ CPU స్పీడ్ 20 శాతం పెరిగింది. మెమరీ బ్యాండ్‌విడ్త్ 120GB/s నుండి 153GB/sకి పెరిగింది. యాప్స్ లాంచింగ్ నుండి AI వర్క్‌ల వరకు అన్నీ వేగంగా పనిచేస్తాయి.

కెమెరా, ఆడియో

రెండింటిలోనూ 12MP సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. వీడియో కాల్స్ 1080p క్వాలిటీతో ఉంటాయి. ఆపిల్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ పవర్ తో పనిచేస్తుంది. సిక్స్-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఒకేలా ఉంది. ఫోర్స్-క్యాన్సిలింగ్ వూఫర్స్, స్పేషల్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. ఇందులోని మైక్రోఫోన్ యారే వాయిస్ క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది. హెడ్‌ఫోన్ జ్యాక్ హై-ఇంపెడెన్స్ హెడ్‌ఫోన్‌లకు సపోర్ట్ చేస్తుంది.

స్టోరేజ్, పోర్ట్స్, బ్యాటరీ లైఫ్

ప్రారంభ కాన్ఫిగరేషన్ 16GB RAM, 512GB స్టోరేజ్. M5లో 4TB స్టోరేజ్ ఆప్షన్ కొత్తగా వచ్చింది. కనెక్షన్, చార్జింగ్ పోర్ట్‌లు మారలేదు. మూడు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, HDMI, మ్యాగ్‌సేఫ్ 3, SDXC కార్డ్ స్లాట్. బ్యాటరీ లైఫ్ మారలేదు. 24 గంటల వీడియో ప్లేబ్యాక్ కూడా సాధ్యమవుతుంది.

ఏది కొనాలి?

M5 మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,69,900. M4 కంటే M5 చౌకగా ఉంది. విద్యార్థులకు రూ. 1,59,999కు లభిస్తుంది. మెరుగైన AI, గ్రాఫిక్స్ కావాలంటే M5 కొనండి. M4తో మీకు సంతృప్తి ఉంటే అప్‌గ్రేడ్ అవసరం లేదు. రెండూ దాదాపు ఒకే లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

Also Read: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Related News

Samsung Support End: గెలాక్సీ పాపులర్ మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ నిలిపివేసిన శామ్‌సంగ్.. మీ ఫోన్ కూడా ఉందా?

Motorola Discount: మోటోరోలా 7000mAh బ్యాటరీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. కేవలం రూ.7200కు లేటెస్ట్ మోడల్

Amazon Offers: 99 రూపాయలకే మొబైల్‌ ఫోన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అదిరే ఆఫర్

Samsung Galaxy Ultra Neo: 6000mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. బడ్జెట్‌లో అల్ట్రా అనుభవంతో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్

VIVO X90 Pro 2025: డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో వివో X90 ప్రో లాంచ్,.. స్టాక్ అయిపోయేలోపే ఫోన్ కొనేయండి

Realme GT 8 Pro: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, 320W ఛార్జింగ్.. ఫ్లాగ్‌షిప్ అనుభవంతో రియల్‌మీ GT 8 ప్రో.. ధర ఎంతంటే?

Realme Gaming Phone: రియల్ మి ఫ్లాగ్‌షిప్ గేమింగ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్.. రూ.60 వేల ఫోన్ ఇప్పుడు రూ.42000కే

Big Stories

×