E-Paper
Advertisement

టాటా యూజర్లకు గుడ్ న్యూస్, ఫ్రీగా కార్లను చెక్ చేయించుకోండి!

టాటా యూజర్లకు గుడ్ న్యూస్, ఫ్రీగా కార్లను చెక్ చేయించుకోండి!
Advertisement

Tata Motors Summer Service Camp 2026: దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటార్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్యాసింజర్ వాహనాల యజమానుల కోసం స్పెషల్ సమ్మర్ సర్వీస్ క్యాంప్‌ ను ప్రారంభించినట్లు ప్రకటించింది.  వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు సురక్షితంగా, సమస్యలు లేకుండా నడవాలని లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంప్  ఏప్రిల్ 28 వరకు దేశ వ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్  వర్క్‌ షాప్‌ లలో కొనసాగుతుంది.

30 పాయింట్ల ఫ్రీ చెకింగ్

ఈ సర్వీస్ క్యాంప్‌లో ముఖ్యంగా 30 పాయింట్ల ఫ్రీ చెకింగ్ ఉంటుంది. ఇందులో కారులోని కీలక భాగాలను నిపుణులు జాగ్రత్తగా పరిశీలిస్తారు. ముఖ్యంగా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, బ్యాటరీ స్టేటస్, టైర్ అలైన్‌ మెంట్, ఇంజిన్ ఆయిల్, కూలెంట్ స్థాయిలు, ఎలక్ట్రికల్ భాగాలు, CNG వాహనాల కోసం ప్రత్యేక భాగాలు, ఎలక్ట్రిక్ వాహనాల డయాగ్నోస్టిక్స్ కూడా చెక్ చేస్తారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు వాహనంలోని కూలింగ్ సిస్టమ్, ఫ్లూయిడ్స్ పై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ కారణంగా ముందుగానే సమస్యలను గుర్తించడం చాలా అవసరం. ఈ క్యాంప్ ద్వారా వాహనంలో ఉండే చిన్న చిన్న లోపాలను ముందే గుర్తించి, పెద్ద సమస్యలు రాకుండా నివారిస్తారు. దీనివల్ల ప్రయాణంలో మధ్యలో బ్రేక్‌ డౌన్లను కూడా తగ్గించవచ్చు.

అన్ని రకాల ప్యాసింజర్ వాహనాలు కవర్

Advertisement

ఈ సర్వీస్ క్యాంప్ టాటా యొక్క అన్ని రకాల వాహనాలను కవర్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లు, CNG వేరియంట్లు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలూ ఇందులో ఉంటాయి. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్, హ్యారియర్, సఫారీ లాంటి కార్లల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

టాటా స్పెషల్ స్పెషల్ ఆఫర్స్

ఈ క్యాంప్‌లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నారు. ఎక్స్‌ టెండెడ్ వారెంటీలపై 10 శాతం తగ్గింపు, స్పేర్ పార్ట్స్, లూబ్రికెంట్లు, ఇతర సర్వీసులపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. అలాగే టాటా మోటార్స్ జెన్యూన్ యాక్సెసరీస్ పై 15 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, ఎక్స్‌టెండెడ్ వారెంటీ,  యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కోసం EMI సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వేసవిలో త్వరగా పాడయ్యే బెల్టులు, హోసులు, ఫిల్టర్లు లాంటి భాగాలను సకాలంలో మార్చుకోవడానికి ఈ ఆఫర్లు ఉపయోగపడతాయి. ఈ విధంగా వాహనాన్ని సకాలంలో మెయింటైన్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఖర్చులను తగ్గించుకోవచ్చు.  ఈ క్యాంప్‌కు భారీ స్పందన వచ్చే అవకాశం ఉండటంతో, వాహన యజమానులు ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని కంపెనీ సూచించింది.

Advertisement

Read Also: విన్‌ఫాస్ట్ VF MPV 7 vs మహీంద్రా XEV 9S.. ధర, ఫీచర్లు, రేంజ్‌ లో ఏది టాప్?

Related News

ఓలా సోనా వీకెండ్.. స్కూటీలపై రూ.50 వేల వరకు ఆఫర్!

టైర్ ప్రెషర్‌ తో మైలేజీ పెరుగుతుందా? ఇదీ అసలు మ్యాటర్!

డీజిల్ కంటే బెస్ట్ మైలేజ్ ఇచ్చే 5 హైబ్రిడ్ కార్లు ఇవే!

హోండా లవర్స్ కు క్రేజీ న్యూస్, CBR150R నయా బ్లాక్ ఎడిషన్ విడుదల!

హ్యుండాయ్ To టాటా.. రూ. 25 లక్షల్లోపు టాప్ 5 పవర్ ఫుల్ కార్లు!

టియాగో EV To VF3.. త్వరలో విడుదల కాబోతున్న 7 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

చిన్న మార్పులతో పెద్ద అప్‌డేట్.. కొత్త టయోటా యారిస్ క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×