E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా!

ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా!
Advertisement

Prakash Raj: ఈమధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు స్పృహలో ఉండి మాట్లాడతారో.. లేక మరింత ఫేమ్ తెచ్చుకోవాలని మాట్లాడతారో తెలియదు కానీ.. అస్తమానం ఏదో ఒక విషయంపై స్పందించి వార్తల్లో నిలుస్తున్నారు అంటూ అటు నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రత్యేకించి హిందూ సాంప్రదాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ.. ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.. అలాంటి జాబితాలోకి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు కూడా చేరిపోయారు. ఇటీవల రామాయణం, దేశంలోనే సామాజిక పరిస్థితులపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసాయి. ఈ నేపథ్యంలోనే ఈయనపై క్రిమినల్ కేసు నమోదు అవ్వడమే కాకుండా ఇప్పుడు పరువు నష్టం దావా కూడా వేశారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా..

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ బహిరంగ వ్యాఖ్యలు చేశారని భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మాధ్యమాలలో సంచలనంగా మారింది.

రామాయణం, హిందూ దేవుళ్లపై ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..” రాముడు, లక్ష్మణుడు ఉత్తరభారతం నుంచి వచ్చారు. దక్షిణాదిలో ఒక గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు తిన్నారు. ఈ విషయంపై వివాదం చెలరేగింది” అంటూ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు రామాయణ గాధను వక్రీకరించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే ఒక మీడియా సమావేశంలో కూడా..” శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందిన వారిని, రావణుడు దక్షిణ భారత తెగకు చెందిన వాడని” ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి.. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పురాణ గాధలను తప్పుగా చూపిస్తూ ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని.. మతపరమైన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ సూచిస్తున్నారు. అంతేకాదు మైనారిటీలు, గిరిజనులు, ముస్లింలకు ప్రమాదం ఉందని ఆయన చేసిన ఆరోపణలు కూడా ఆధార రహితం అని కొందరు విమర్శిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు ఫైల్..

Advertisement

ఇలా పలు అంశాలపై వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపథ్యంలోనే పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు అలాగే సమాజంలో విద్వేషాలను ప్రేరేపించినందుకు కొన్ని ప్రాంతాలలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. మొత్తానికైతే ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. మరి ఈ అంశం ఇంకెంత వరకు దారితీస్తుందో చూడాలి.

 

Also read:హీరో విజయ్ కి బిగ్ షాక్.. ఓటెయ్యొద్దు అంటూ ధర్నా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

Related News

విడుదలకు ముందే జైలర్ 2 సరికొత్త రికార్డ్.. భారీ ధరకు నాన్ థియేట్రికల్ హక్కులు!

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

Big Stories

Advertisement
×