E-Paper
Advertisement

చిన్న మార్పులతో పెద్ద అప్‌డేట్.. కొత్త టయోటా యారిస్ క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది!

చిన్న మార్పులతో పెద్ద అప్‌డేట్.. కొత్త టయోటా యారిస్ క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది!
Advertisement

2026 Toyota Yaris Cross Facelift Revealed: దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ టయోటా.. తన ప్రముఖ కాంపాక్ట్ SUV అయిన యారిస్ క్రాస్ కు ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ ను లాంచ్ చేసింది. ఈ మోడల్ విడుదలైన దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ఈ అప్‌ డేట్ వచ్చింది. 2024లో పెద్ద మార్పులు చేసిన తర్వాత, ఈసారి ఫేస్‌ లిఫ్ట్‌ లో చిన్న డిజైన్ మార్పులు, కొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ముఖ్యంగా యూరోప్ మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్ తయారైంది. ఈ కారు TNGA-B ప్లాట్‌ ఫారమ్‌ పై తయారైంది.

సరికొత్త డిజైన్ తో..

బయటి డిజైన్‌ లో ఛేంజెస్ ముందుభాగంలో కనిపిస్తాయి. పాత మోడల్‌ లో ఉన్న చిన్న గ్రిల్ స్థానంలో కొత్త హనీకోంబ్ స్టైల్ గ్రిల్ ఇచ్చారు. ఇది బాడీతో బాగా కలిసిపోయేలా డిజైన్ చేశారు. హెడ్‌ లైట్లు కూడా కొంత మార్పులతో మరింత షార్ప్‌ గా కనిపిస్తాయి. ఫ్రంట్ బంపర్‌ లో బ్లాక్ క్లాడింగ్ ఉండటం వల్ల SUVకి మంచి లుక్ వచ్చింది. టయోటా లోగోను కూడా కొంచెం పై భాగంలో అమర్చారు.

రెండు కొత్త కలర్ ఆప్షన్స్ లో..

Advertisement

ఈ ఫేస్‌ లిఫ్ట్‌ లో రెండు కొత్త రంగులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటి పెర్షియన్ సాల్ట్ కాగా, మరొకటి  ప్రెషియస్ బ్రాంజ్. వీటిలో ప్రెషియస్ బ్రాంజ్ టూ టోన్ ఆప్షన్‌ తో వస్తుంది. కొత్త అల్లాయ్ వీల్ డిజైన్లు కూడా యాడ్ చేశారు.  టాప్ వేరియంట్‌ లో 18 అంగుళాలు, మిడ్ వేరియంట్‌ లో 17 అంగుళాల వీల్స్ ఉంటాయి. సైడ్‌ లో యారిస్ క్రాస్ అనే పేరు  స్పష్టంగా కనిపించేలా చేశారు. GR స్పోర్ట్ వేరియంట్‌ లో స్పోర్టీ డిజైన్‌ తో పాటు ప్రత్యేక లోగోలు ఉంటాయి.

ఇంటీరియర్ లో చిన్న మార్పులు

ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు లేకపోయినా, కొన్ని అప్ డేట్స్ కనిపిస్తాయి. డాష్‌బోర్డ్, డోర్లు, స్టార్ట్ బటన్ చుట్టూ కొత్త ప్లాటినం ఫినిష్ ఇన్సర్ట్‌ లు ఉన్నాయి. మిడ్ వేరియంట్‌ లో ఇప్పుడు స్పోర్ట్స్ సీట్లు అందిస్తున్నారు. టాప్ వేరియంట్‌ లో లెదరెట్ సీట్లు, మంచి ఫినిష్‌తో క్యాబిన్ ప్రీమియంగా ఉంటుంది. GR స్పోర్ట్ వేరియంట్‌ లో డార్క్ థీమ్, రెడ్ స్టిచింగ్‌తో స్పోర్టీ ఫీల్ ఉంటుంది.

సరికొత్త ఫీచర్లతో

Advertisement

ఫీచర్ల పరంగా కూడా కొన్ని అప్‌ డేట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్‌ లో పవర్ టెయిల్‌ గేట్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, JBL సౌండ్ సిస్టమ్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే లాంటి ఫీచర్లను కలిగి ఉంది. వైర్‌ లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ కూడా ఉంది. అన్ని వేరియంట్లలో భద్రత కోసం టయోటా సేఫ్టీ సెన్స్ ఫీచర్లు ఉంటాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఈసారి ఒక్క హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మాత్రమే అందిస్తున్నారు. 1.5 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ e-CVT గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. గరిష్ట వేగం సుమారు గంటకు 175 కిమీ.

Read Also: విన్‌ఫాస్ట్ VF MPV 7 vs మహీంద్రా XEV 9S.. ధర, ఫీచర్లు, రేంజ్‌ లో ఏది టాప్?

Related News

టాటా ఆల్ట్రోజ్ To హోండా అమేజ్.. గుంతల రోడ్లపైనా సూపర్ కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!

బ్రెజ్జా టర్బో To గ్రాండ్ విటారా.. మారుతి నుంచి 4 క్రేజీ SUVలు వచ్చేస్తున్నాయ్!

ఇండియన్ రోడ్లపై ఈవీల జోరు.. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎందుకు బెస్ట్?

పెట్రోల్ బైకులకు కాలం చెల్లినట్లే.. రూ. 99,999 కే 180 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే క్రేజీ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్.. అన్ని మోడళ్ల ధరల పెంపు!

ఏడాదిలో 6 కొత్త కార్లు లాంచ్, హోండా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

వేసవిలో కారు, బైక్ టైర్లు పగలకుండా ఉండాలంటే.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి!

రివర్స్ పార్కింగ్‌ లో జాగ్రత్త.. కారుకు గీతలు పడకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Big Stories

Advertisement
×