BigTV English

BRS Party Future: మాట మార్చిన హరీష్.. మరి కవిత లెక్కలేంటి?

BRS Party Future: మాట మార్చిన హరీష్.. మరి కవిత లెక్కలేంటి?

BRS Party Future: వరుస పరిణామాలతో గులాబీపార్టీకి ఊపిరి సలపడం లేదంటున్నారు. ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత బీఆర్ఎస్‌కు అన్నీ రివర్స్ అవుతుండటంపై పొలిటికల్ సర్కిల్స్‌‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఒకవైపు ఓటమి కుంగుబాటు, మరోవైపు పెరుగుతున్న వలసలతో కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడమే గగనమవుతోంది. అలాగే మాజీ సీఎంకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు గులాబీశ్రేణులో గుబులు రేగుతోంది. ఇవి చాలవన్నట్లు గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత మాటతీరు సొంత పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు కవిత తన తండ్రికి సంధించిన లేఖాస్త్రంతో ఆమె రాజకీయ భవితవ్యంపై రకరకాల చర్చలు స్టార్ట్ అయ్యాయి.


తండ్రికి ఎమ్మెల్సీ కవిత 6 పేజీల లేఖ

బీఆర్ఎస్ వరుస పరిణామాలతో ఉక్కరిబిక్కిరి అవుతోంది. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల అంశమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతుంటే, తాజాగా ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న తీరు కూడా సొంత పార్టీ లో తీవ్ర చర్చనీయాంశంగా గా మారింది.


గత పదేళ్ల కాలంలో సామాజిక న్యాయం జరగలేదన్న కవిత

పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కవిత లెవనెత్తిన అంశాలు ఇప్పుడు పార్టీ నేతల మధ్య హాట్‌ డిబేట్‌గా మారాయంట. గత పదేళ్ల కాలంలో సామాజిక న్యాయం జరగలేదు అంటూ కవిత కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. ఒక రకంగా ఇది తండ్రి పాలనపై కుమార్తె చేసిన విమర్శలే. కవిత లేఖ వెలుగులోకి రాకముందు ఆమె మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌‌చాట్‌లోను తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని పేర్కొని కలకలం రేపారు

బీఆర్ఎస్ సారథ్య బాధ్యతలు కేటీఆర్‌కు అప్పడిస్తారని ప్రచారం

బీఆర్ఎస్ సారథ్య బాధ్యతలను మాజీ మంత్రి, ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. అందుకే కవిత తన స్వరం మార్చారా? అని గులాబీశ్రేణులు సందేహపడుతున్నాంట. మరో వైపు మాజీ మంత్రి, సీనియర్ నేత హరీష్‌రావు కూడా గతానికి భిన్నంగా కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తానని చేసిన ప్రకటన కూడా పార్టీ నాయకుల చర్చల్లో నలుగుతోంది. అప్పటి వరకు కేసిఆర్ ఉన్నంత వరకు ఆయనే తమ నాయకుడని, అసలు నాయకత్వ సమస్య ఎందుకు వస్తుంది అని మాట్లాడిన హరీష్ రావు సడన్‌గా తన స్టాండ్ మార్చటంతో.. మొత్తానికి పార్టీలో ఏదో జరుగుతుందనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో కవిత లేఖ వెలుగులోకి రావటం ఇప్పుడు మరింత వేడి రాజేస్తోంది

పార్టీ లీడర్స్‌కు కేసీఆర్ యాక్సెస్ ఇవ్వడం లేదన్న కవిత

పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఎల్కతుర్తి సభపై లేఖలో కొన్ని కీలక అంశాలను కవిత ప్రస్తావించారు. పార్టీ లీడర్స్‌కి యాక్సెస్‌ ఇవ్వడం లేదని, బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్‌జూబ్లీ సభలో కేసీఆర్ క్లారిటీ ఇవ్వలేదని, బీజేపీ మీద రెండు నిమిషాలే కేసీఆర్ మాట్లాడారని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుంటుదన్న అనే చర్చకు తావు ఇచ్చినట్లైందని, బీజేపీని ఇంకొంచెం టార్గెట్‌ చేయాల్సిందనే భావనను కవిత వ్యక్తపరిచారు. కాంగ్రెస్‌పై గ్రౌండ్ లెవల్‌లో నమ్మకం పోయిందని, బీజేపీనే ఆల్టర్‌నేటివ్‌ అనే భావనను తమ పార్టీ క్యాడర్ వ్యక్తపరుస్తోందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, బీజేపీకి హెల్ప్‌ చేశామనే మెసేజ్‌‌ను కాంగ్రెస్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది, దాంతో పార్టీకి నష్టం జరిగిందని కవిత తన లేఖలో పేర్కొన్నారు.

హాట్ డిబేట్‌కు దారి తీస్తున్న కవిత లేవనెత్తిన అంశాలు

కేసిఆర్ యాక్సెస్‌ దొరకడం లేదని జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారని తండ్రి దృష్టికి కవిత తీసుకొచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ప్రయత్నించండని సూచించారు. వరంగల్ సభలో ఉద్యమనేతలకు సరైన ప్రాధాన్యం దక్కలేదని… 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బావుండేదన్న అభిప్రాయాన్ని వక్తం చేశారు. పాత ఇన్‌చార్జ్‌లకే బాధ్యతలు ఇవ్వడం కూడా కేడర్‌కు నచ్చలేదని పేర్కొన్నారు. కవిత లెవనెత్తిన అంశాలు…గతంలో కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబెట్‌కు దారితీస్తున్నాయి. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గుందనే విషయాన్ని కవిత లేఖ ద్వారా చేప్పకనే చేప్పారానేది విశ్లేషకుల మాట.

హరీశ్ రావు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం

లిక్కర్‌ కేసులో అరెస్టై బయటకు వచ్చిన తర్వాత నుంచి పార్టీలో కవిత రోల్‌ తగ్గిందని పార్టీలో చాలామంది నేతలు చెబుతున్నారు. ఇక మరోవైపు సీనియర్ హరీశ్‌ రావు కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంత అసంతృప్తిగానే ఉన్నారంటున్నారు. ఇలా పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలు, కుటుంబసభ్యులు అసంతృప్తి రాగాన్ని వినిపించడం పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తోందంట. హరీశ్‌ విషయంలో జరిగిన డ్యామేజీని కేసీఆర్ డైరెక్షన్‌లో కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించినా, కవిత విషయంలో కేసీఆర్ ఎలా ముందుకు వెళ్లబోతున్నారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read: రాజధాని ప్లేస్ మార్చాలి? జగన్ యూ టర్న్

వరంగల్ సభలో హరీష్‌లను విస్మరించిన పార్టీ

కవిత అమెరికాలో ఉన్న తరుణంలో ఈ లేఖ ఇప్పుడు వెలుగులోకి రావటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వరంగల్ సభలో వేదిక మీద పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే పెట్టి, హరీష్ రావు, కవితలను విస్మరించారు. దానిపై అప్పటి నుంచి పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే కొంత మంది నాయకులు మాత్రం కవితకు ఇప్పుడే ఈ విషయాలు అన్నీ ఎందుకు గుర్తుకు వస్తున్నాయంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలోనే కేసీఆర్ కనీసం మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే ల సంగతి అయితే సరే సరి. ఇప్పుడు ఆయన కుమార్తె అదే టాపిక్ టచ్ చేయడంతో.. అమె భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×