Summer Special Trains: సమ్మర్ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను, అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందులో భాగంగానే హైదరాబాద్- కొల్లాం నడుమ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్- కొల్లా ప్రత్యేక రైళ్ల వివరాలు
హైదరాబాద్- కొల్లాం ప్రత్యేక రైలు (రైలు నెం. 07193) మే 24, 31తో పాటు జూన్ 7, 14, 21, 28 (శనివారాలు) తేదీల్లో నడిపించనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఈ రైలు రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మూడవ రోజు ఉదయం 7.10 గంటలకు కొల్లం చేరుకుంటుంది. మొత్తం ఆరు సర్వీసులు నడిపించనున్నట్లు ప్రకటించింది. వేసవి రద్దీని తగ్గించడానికి ఈ రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ఇక కొల్లాం- హైదరాబాద్ ప్రత్యేక రైలు (రైలు నెం. 07194) మే 26, జూన్ 2, 9, 16, 23,30 (సోమవారాలు) తేదీల్లో అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు ఉదయం 10.45 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు కూడా మొత్తం 6 సర్వీసులు నడిపించనున్నట్లు వెల్లడించింది.
Read Also: సమ్మర్ స్పెషల్ సర్వీసులు పొడిగింపు, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!
ప్రత్యేక రైల్లో ఉండే తరగతులు
హైదరాబాద్-కొల్లాం- హైదరాబాద్ మధ్య నడిచే సమ్మర్ స్పెషల్ రైళ్లలో ఉండే తరగతులకు సంబంధించిన వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లలో AC టైర్-II, AC టైర్-III కోచ్ లతో పాటు 18 స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని ప్రకటించింది. ప్రయాణీకులు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లను ఉపయోగించుకోవాని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అవసరం అనుకుంటే మరికొన్ని సర్వీసులను పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సమ్మర్ లో కేరళ పర్యటనకు వెళ్లే టూరిస్టులకు ఈ రైళ్లు మరింతగా ఉపయోగపడనున్నాయి.
Read Also: హైదరాబాదీయులకు గుడ్ న్యూస్, ఇక ఆ ప్రాంతాలకూ మెట్రో వచ్చేస్తోంది!