BigTV English

Albert Einstein : ఐన్‌స్టీన్ విజయసూత్రం.. ఇదే..!

Albert Einstein : ఐన్‌స్టీన్ విజయసూత్రం.. ఇదే..!

Albert Einstein : ఒకే ఏడాదిలో (1905 లో) ఐదు పరిశోధనా పత్రాలను వరుసగా ప్రచురించిన ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (మార్చి 14, 1879 – ఏప్రిల్ 18, 1955) సైన్స్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. సాపేక్ష సిద్ధాంతం ఈ ఐదింటిలోనిదే. వాటిలో ఒక్కోటి ఒక్కో నోబెల్ బహుమతికి అర్హమైనవని నాటి ప్రపంచ పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


ఆయనను ప్రశంసిస్తూ.. ఆయనకు వందలాది మంది లేఖలూ రాస్తుండేవారు. ఈ అభినందనలను వినమ్రంగా స్వీకరిస్తూ.. తనను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో తన ఇంటికొచ్చే అతిథులను పలకరిస్తూ, ఐన్ స్టీన్ సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అయతే.. ఈ సమయంలోనే ఆయన ఇంటికి ఓ యువకుడు వచ్చాడు. ‘ మీరు ఎన్నో చిక్కుముళ్లను విప్పే ఫార్ములాలను రూపొందించారు కదా..!

మరి జీవితంలో సక్సెస్ కోరుకుంటున్నా నాలాంటి వాళ్లకోసం మీ దగ్గర ఏదైనా ఫార్ములా ఉందా?’ అని అడిగాడు.
దీనికి ఐన్‌స్టీన్ చిరునవ్వుతో, ‘A=X+Y+Z’ అనే ఫార్ములాను చెప్పాడు. ఇందులో A అంటే విజయం, X అంటే శ్రమించటం, Y అంటే ఉత్సాహంగా ఉండటం, Z అంటే అతిగా మాట్లాడకపోవటం అని వివరణ కూడా ఇచ్చాడు. ఈ ఫార్ములాను నిజజీవితంలో నిజాయితీగా అమలు చేస్తే.. ప్రపంచంలో ఎవరైనా సక్సెస్ బాట పడతారని ఆయన ధీమాగా చెప్పటంతో ఆ యువకుడు అక్కడి నుంచి సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు.


Related News

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

Big Stories

×