
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఆచార్య మూవీ తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వాల్తేర్ వీరయ్య సినిమాతో మంచి స్ట్రాంగ్ కం బ్యాక్ నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు అదే జోరు కొనసాగిస్తూ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. గాడ్ ఫాదర్ ,భోళాశంకర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో ఇక రీమేక్ లు జోలికి పోకూడదు అని చిరు ఫిక్స్ అయ్యాడట. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వశిష్ట స్టోరీ కి ఓకే చెప్పేసాడు.
లాస్ట్ మంత్ పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని ఆయుధాల పూజ రోజు విడుదల చేశారు. చుట్టూ తుఫాను.. ప్రకృతి విలయం.. పంచభూతాలు అదుపుతప్పుతున్న వేళ భూమిని చీల్చుకుని ఉద్భవించిన త్రిశూలం.. ఈ భాగంతో మెగా 156 అంటూ పోస్టర్ని విడుదల చేశారు. ఒక్క పోస్టర్ తోటే రాబోయే చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందో డైరెక్టర్ చెప్పగానే చెప్పాడు.
పూజా కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిరు మూవీకి పాటలు రెడీ చేయబోతున్నట్లు అప్పుడే అనౌన్స్ కూడా చేశారు. అన్నట్లుగానే రీసెంట్గా అందిన సమాచారం ప్రకారం మెగాస్టార్ కొత్త మూవీకి సంబంధించిన ఒక పాట కూడా సిద్ధమైందట. ఈనెల 23 నుంచి మెగా 156 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్ అని టాక్. అయితే మొదట షూటింగ్ దశలో చిరు సెట్స్ లో కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే చిరంజీవి షూటింగ్లో డిసెంబర్ నుంచి పాల్గొనబోతున్నారట.
అందుకే చిరు షూటింగ్లో పాల్గొనే లోపు హీరోతో సంబంధం లేకుండా ఉండే సీన్స్ ని షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఏ మూవీని 2024 సమ్మర్ లోగా పూర్తిచేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి విశ్వంభరా అనే డెత్ ఉన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఈసారి చిరు ముగ్గురు హీరోయిన్లతో ఈ మూవీలో స్టెప్పులు వేయబోతున్నాడు. మరి చిత్ర బృందం అఫీషియల్ గా నటీనటులు ఎవరు అన్న విషయం అనౌన్స్ చేస్తేనే మనకు హీరోయిన్ల గురించి కూడా క్లారిటీ వస్తుంది.