E-Paper
Advertisement

Azharuddin : నేనే ఎమ్మెల్యే.. జూబ్లీహిల్స్ లో గెలుపుపై అజారుద్దీన్ నమ్మకాన్ని జనం నిలబెడతారా?

Azharuddin : నేనే ఎమ్మెల్యే.. జూబ్లీహిల్స్ లో గెలుపుపై అజారుద్దీన్ నమ్మకాన్ని జనం నిలబెడతారా?
Advertisement
Azharuddin political news

Azharuddin political news(Political news in telangana):

భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే..హైదరాబాద్‌లో పోటీ చేస్తున్నానని బిగ్ టీవీ ఇంటర్య్వూలో తెలిపారు. తాను ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు.. అంత దూరం ఎందుకు వెళ్లావని చాలా మంది అడిగారని వెల్లడించారు. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే అక్కడ పోటీ చేశానని అజారుద్దీన్ వివరించారు.

ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసే అవకాశం వచ్చిందని అజారుద్దీన్ అన్నారు. తాను ఎప్పటికీ తెలంగాణ బిడ్డనేనని స్పష్టం చేశారు. తెలంగాణలో పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గత పదేళ్లుగా జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగలేదన్నారు.ఈ నియోజకవర్గం పరిస్థితి పేరు గొప్ప, ఊరు దిబ్బలా ఉందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఇక్కడి ఓటర్లు.. తనను ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం ఎక్కువగా ఉందని అజారుద్దీన్ ఆరోపించారు. అరాచక శక్తులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఇక్కడ జనం భయంతో బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్నారు. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నాయని చెప్పారు.

తనను గెలిపిస్తే జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం లేకుండా చేస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు కల్పిస్తానన్నారు. 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందలేదన్నారు.ఎంఐఎం ముస్లింల కోసం ఏమీ చేయడం లేదన్నారు. అసదుద్దీన్‌ మాటలే తప్ప చేతల్లో చూపడం లేదని విమర్శించారు. తన గెలుపై ధీమ వ్యక్తం చేశారు.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×