E-Paper
Advertisement

మంచు కరిగినా తగ్గని క్రేజ్.. ఒక్కరోజే 24 వేల మంది! అమర్‌నాథ్‌లో ఏం జరుగుతోంది?

మంచు కరిగినా తగ్గని క్రేజ్.. ఒక్కరోజే 24 వేల మంది! అమర్‌నాథ్‌లో ఏం జరుగుతోంది?
Advertisement

Amarnath Yatra: మంచు లింగం కరిగిపోయినా భక్తుల మనసుల్లోని భక్తి ఏ మాత్రం కరగలేదని నిరూపిస్తున్నారు అమర్‌నాథ్ యాత్రికులు. కేవలం ఐదు రోజుల్లోనే మంచు లింగం కరిగిపోయిందనే వార్త వినగానే, ‘మరి అక్కడ భక్తులు ఏం చూస్తున్నారు?’ అనే సందేహం చాలా మందికి రావచ్చు. కానీ, అమర్‌నాథ్ యాత్ర అనేది కేవలం ఒక మంచు ఆకారాన్ని చూడటం మాత్రమే కాదు.. అదొక అలౌకిక అనుభూతి, గుహలో దాగున్న పవిత్ర వైబ్రేషన్స్.

కరిగిన మంచు.. కరగని విశ్వాసం

Advertisement

ప్రకృతి మార్పుల వల్ల యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే మంచు లింగం సైజు తగ్గి పూర్తిగా కరిగిపోయినప్పటికీ భక్తుల ప్రవాహం అస్సలు తగ్గలేదు. ఆ పవిత్రమైన గుహను తాకితే చాలు తమ జన్మ ధన్యమౌతుందని జనాలు భావిస్తున్నారు. అందుకే మంచు లింగం లేకపోయినా.. ఆ కొండల మధ్య ఉండే ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని అనుభవించడానికి భక్తులు క్యూ కడుతున్నారు. జస్ట్ ఒక్క సోమవారం రోజే దాదాపు 24 వేల మందికి పైగా దర్శనం చేసుకోవడం దీనికి నిదర్శనం. జమ్మూ బేస్ క్యాంప్ నుండి మరో 5,335 మంది భక్తులతో కూడిన కొత్త బ్యాచ్ కూడా పూర్తి ఉత్సాహంతో బయలుదేరింది.

Also Read: నోయిడాలో ఘోర ప్రమాదం.. పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. ఇద్దరు మృతి!

Advertisement

సవాళ్లను ఎదుర్కొంటూ ముందడుగు

ఒకవైపు కొండచరియలు విరిగిపడటం, మంచు తుఫానులు వంటి ప్రకృతి సవాళ్లు.. మరోవైపు సరిహద్దుల్లో ఎప్పుడూ ఉండే భద్రతా ముప్పులు. ఈ రెండూ అమర్‌నాథ్ భక్తుల నమ్మకాన్ని ఇంచ్ కూడా కదల్చలేకపోతున్నాయి. జులై 3న మొదలైన ఈ 57 రోజుల సుదీర్ఘ యాత్ర, ఆగస్టు 28న వచ్చే రక్షాబంధన్ పండుగ వరకు ఇలాగే కొనసాగనుంది.

రక్షక భటుల అలుపెరగని పహారా

ఈ యాత్ర ఇంత సజావుగా సాగుతోందంటే దానికి కారణం వెనుక ఉండి నడిపిస్తున్న భద్రతా బలగాలు. మంచు కరిగినా భక్తుల రక్షణ కోసం సీఆర్పీఎఫ్ (CRPF), భారత సైన్యం, మరియు స్థానిక పోలీసులు రేయింబవళ్లు కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తున్నారు. క్లిష్టమైన కొండ మార్గాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం. ప్రస్తుతం మంచు లింగం స్థితి ఎలా ఉన్నప్పటికీ.. అమర్‌నాథ్ దారి పొడవునా ‘హర హర మహాదేవ్’ అనే శంఖారావం మాత్రం నిరంతరం మార్మోగుతూనే ఉంది.

Also Read: సిరిసిల్ల నేత అద్భుత ప్రతిభ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర.. బరువు తెలిస్తే షాకవుతారు!

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×