BigTV English

Social Media: ముందు వీటి అంతు చూడండి.. చీకటి పనులన్నీ ఈ యాప్స్‌లోనే!

Social Media: ముందు వీటి అంతు చూడండి.. చీకటి పనులన్నీ ఈ యాప్స్‌లోనే!

Big Tv Originals: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్, వారి చుట్టూ నడుస్తున్న పోలీస్ కేసులు.. అనే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ దశలో బెట్టింగ్ యాప్ ల కంటే బలంగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కేంద్ర బిందువుగా మారిందనే విషయం సంచలనంగా మారింది. అదే టెలిగ్రామ్. అవును, బెట్టింగ్ యాప్స్ అన్నీ ఒక ఎత్తు అయితే.. బెట్టింగ్ సహా ఇతర సంఘ విద్రోహకర కార్యక్రమాలకు టెలిగ్రామ్ కేంద్ర బిందువుగా మారడం మరో ఎత్తు.


వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాగే టెలిగ్రామ్ కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. అయితే వీటన్నిటికీ ఫోన్ నెంబర్ తో కచ్చితమైన లింక్ ఉంటుంది. అంటే.. ఒకవేళ ఫోన్ నెంబర్లు మార్చినా, ఉన్నవి నిరుపయోగంగా మారినా, ఫోన్ ఫార్మేట్ అయినా.. ఆయా అకౌంట్లను రిట్రీవ్ చేసుకోవాలంటే కాస్త కష్టం. అంటే ఫోన్ నెంబర్ తో లింక్ ఉండి, ఓటీపీలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ టెలిగ్రామ్ యాప్ ని ఒకసారి డెస్క్ టాప్ పై డౌన్ లోడ్ చేసుకుని పెట్టుకుంటే, ఫోన్ నెంబర్ మార్చినా అకౌంట్ డీయాక్టివేట్ కాదు. ఒకే ఫోన్ లో ఒకటికి మించి ఎక్కువ టెలిగ్రామ్ అకౌంట్లను కూడా మెయింటెన్ చేసుకునే సౌకర్యం ఉంది. అందుకే ఇది ఇల్లీగల్ యాక్టివిటీస్ కి మిగతావాటికంటే ఎక్కువ సులభమైన మీడియంగా మారింది.

ఏం జరుగుతోంది..?
ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న చాలామంది ఇన్ ఫ్లూయెన్సర్లు.. ఫలానా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి అంటూ సలహా ఇస్తున్నారు. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అయితే మిగతా కథ అంతా అక్కడ నడుస్తుంది. ఏయే యాప్స్ లో చేరాలి, ఎక్కడ ఎలా బెట్టింగ్ వేయాలి, ఎలా బెట్టింగ్ చేస్తే విన్నింగ్ ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి.. ఇలాంటి వ్యవహారాలన్నీ అక్కడ ఉచితంగా లభిస్తుంటాయి. అందుకే ఆయా ఛానెళ్లకు ఫాలోవర్స్ ఎక్కువ.


క్రికెట్ బెట్టింగ్ నేరం. కానీ క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించి టెలిగ్రామ్ ఛానెల్స్ లో పెద్ద తతంగమే నడుస్తుంది. ఎప్పుడు ఏ బాల్ కి ఎంత బెట్ వేస్తే మనకు లాభం ఉంటుంది, ఏ మ్యాచ్ లో ఎవరికి గెలిచే అవకాశాలుంటాయి. ఇలా ఇందులో చాలా ఛానెల్స్ బెట్టింగ్ ని ప్రోత్సహిస్తున్నాయి. కొన్ని ఛానెల్స్ లో నేరుగా బెట్టింగే జరుగుతుంటుంది.

కేవలం బెట్టింగే కాదు..
బెట్టింగ్ తో పాటు సినిమా పైరసీకి కూడా టెలిగ్రామ్ యాప్ ప్రధాన కేంద్రంగా మారింది. వాట్సప్ లో అంత పెద్ద పెద్ద వీడియోలు పంపించుకోడానికి కుదరదు. అందుకే సినిమా పైరసీకోసం, పెద్ద పెద్ద పైరసీ వీడియోల కోసం అందరూ టెలిగ్రామ్ ని ఉపయోగించుకుంటున్నారు. పైరసీ వీడియోలతోపాటు, విద్వేష వీడియోలు కూడా ఇక్కడే ఎక్కువగా సర్కులేట్ అవుతుంటాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి కూడా ఇదే సోర్స్ గా ఉంటోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్నిరకాల సైబర్ స్కామ్స్ కోసం కేటుగాళ్లు టెలిగ్రామ్ యాప్ ని ఉపయోగించుకుంటున్నారు. ఫిషింగ్ స్కామ్ లు, నకిలీ పెట్టుబడి పథకాల పేరుతో ఆకర్షించే ప్రకటనలు, క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు.. ఇలాంటివన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి.

వేటు కష్టమేనా..?
వాట్సప్ గ్రూపుల్లో విద్వేషకర కంటెంట్ ప్రసారం అయితే అడ్మిన్ తో సహా గ్రూప్ లో ఉన్న సభ్యులపై కూడా కొన్ని సందర్భాల్లో పోలీసులు చర్యలు తీసుకున్న ఉదాహరణలున్నాయి. కానీ టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ అడ్మిన్ లను, వాటిని నడిపే కింగ్ పిన్ లను పట్టుకోవడం చాలా కష్టం. ఎన్ క్రిప్టెడ్ చాటింగ్ ద్వారా వీటిని నిర్వహించేవారు తెరవెనకే ఉంటారు. వారిని గుర్తించడం కూడా కష్టం. ఫోన్ నెంబర్లు ఉన్నాకూడా వాటి ద్వారా నిర్వాహకుల్ని ట్రేస్ చేయడం కష్టంగా మారుతోంది. అందుకే పోలీసులకు కూడా ఇది కష్టసాధ్యంగా మారింది. గ్రూప్ సభ్యులు కూడా తమ ఐడెంటిటీ కనపడకుండా చేసుకోవచ్చు. అందుకే చాలామంది టెలిగ్రామ్ లో చీకటి కార్యకలాపాలకు ఆకర్షితులవుతున్నారు.

టెలిగ్రామ్ యాప్ ని రష్యాకు చెందిన కంపెనీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో ఈ తరహా యాప్ ల వినియోగంలో ఇది రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్.. ఇలా అన్ని సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫామ్ లలో దీన్ని వాడుకోవచ్చు. అంటే బాగా యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇన్ స్టలేషన్ సులభం. రోజుల తరబడి వినియోగించకపోయినా దీన్ని రీయాక్టివేట్ చేసుకోవడం కూడా సులభమే. ఒక్కో ఛానెల్ లో 2 లక్షలమంది సభ్యులు ఉండటానికి అవకాశం ఉంది. అందుకే నేరగాళ్లకు ఇది అడ్డాగా మారింది. టెలిగ్రామ్ కు భారత్ లో లోకల్ ఆఫీస్ లు లేవు, టెలిగ్రామ్ యాప్ పై ఫిర్యాదు చేయాలన్నా అది కష్టం. వివిధ దేశాల్లో గ్లోబల్ సర్వర్లను నిర్వహిస్తున్న కారణంగా చట్టపరంగా దీన్ని ఎదుర్కోవడం కూడా కష్టం. ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా దీనిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ కి టెలిగ్రామ్ ప్రధాన మాధ్యమంగా మారడంతో నియంత్రణ చర్యలు చేపట్టడానికి, చట్టాలకు పదును పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడినట్టు సమాచారం.

ఇక్కడ టెలిగ్రామ్ ఒక్కటే ఫ్రాడ్, మిగతావన్నీ శుద్ధపూసలు అనుకోవడానికి వీలు లేదు. వాట్సప్ ఛానెల్స్ ద్వారా కూడా ఇటీవల చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో అసభ్య, అశ్లీల కంటెంట్ కి కొదవే లేదు. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఈజీగా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్న సందర్భంలో ఇలాంటి కంటెంట్ వారి కంట పడితే.. పసి మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వీటన్నిటినీ అరికట్టాలంటే సోషల్ మీడియాని ఫిల్టర్ చేయడం ఒక్కటే మార్గం. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ పై ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, అసలు ఆ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కి వీలు కల్పిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై నిఘా పెట్టడం కూడా జరిగితే ఈ బెట్టింగ్ భూతాన్ని కాస్తయినా నియంత్రించే అవకాశం ఉంటుంది.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×