Shanmukha Movie Review : ఆది సాయి కుమార్ ఒకప్పుడు మంచి మార్కెట్ ఉన్న హీరో. కానీ కొత్త హీరోల దూకుడు వల్ల ఇతను స్లో అయ్యాడు. అందువల్ల ఇతని సినిమాలు ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా చాలా మంది జనాలకి తెలీడం లేదు. ఇక ఇప్పుడు ‘షణ్ముఖ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతోనైనా అతను ప్రేక్షకులను మెప్పించాడా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
సరైన అందుబాటులో లేని గ్రామాలూ ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. అలనాటి ఒక మారుమూల గ్రామానికి చెందిన విగాండ (చిరాగ్ జానీ). అతని భార్యకి ఆరు ముఖాలతో కురూపిగా ఉన్న పిల్లాడు జన్మిస్తాడు. దీంతో విగాండతో పాటు అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంతా షాక్ అవుతారు. తర్వాత విగాండ తన కొడుక్కి విగాండ షణ్ముఖ అనే పేరు పెడతాడు. షణ్ముఖ కూరుపి నుండి అందంగా మారడానికి ఓ ప్రయత్నం చేస్తాడు ఆ విగాండ. మాంత్రికుడి సలహాతో అతను ఆ పని చేస్తాడు. మరోపక్క కార్తీ (ఆది సాయికుమార్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్రగ్స్ మాఫియా కోసం అతను ప్రారంభించిన ఓ ఆపరేషన్లో డిపార్ట్మెంట్ ఇచ్చిన పిస్టల్ పోగొట్టుకుంటాడు. ఇక అతని గర్ల్ ఫ్రెండ్ సారా (అవికా గోర్) క్రిమినాలజీపై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. తన ఏరియాలో మాయమవుతున్న అమ్మాయిలని కనుక్కోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు అమ్మాయిలు ఎందుకు మాయమవుతున్నారు? దానికి విగాండకి సంబంధం ఏంటి? ఈ క్రమంలో కార్తీ పాత్ర ఏంటి? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
దర్శకుడు షణ్ముగన్ సప్పాని ఎంపిక చేసుకున్న పాయింట్ మంచిదే. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. 6 ముఖాలు కలిగిన కురూపి షణ్ముఖ జననం, అతన్ని అందగాడుగా చేయాలనే తండ్రి కోరిక.. నిజంగా ఇంట్రెస్టింగ్ లైన్. ఇదే మెయిన్ పాయింట్ గా కథ నడిపినా..ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. కానీ డ్రగ్స్, సోషల్ మెసేజ్ అన్నట్టు దర్శకుడు కథని వేరే వైపు డైవర్ట్ చేశాడు. అక్కడ కొంచెం తేడా కొడుకుతుంది. అయితే షణ్ముఖ మొహంలో షేడ్స్ అతని పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు క్యూరియస్ గానే అనిపిస్తాయి. ఏదేమైనా ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ కి కూడా మంచి లీడ్ ఇచ్చాడు. క్లైమాక్స్ ముఖ్యంగా చివరి 20 నిమిషాల ట్రాక్ అల్లిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్ గా కాకుండా లైటర్ వేన్లా రాసుకుంటే.. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేవారు. రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. కథకి కొన్ని విజువల్స్ కి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా కథకి తగ్గట్టుగానే బాగానే ఉన్నాయి.
ఆది సాయి కుమార్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా చేశాడు. లుక్స్, మేనరిజమ్స్ విషయంలో తన మార్క్ చూపించాడు. అవికా గ్లామర్ కి మంచి మార్కులే పడతాయి. కానీ ఇందులో ఆమె పాత్రకి పలికించిన హావా భావాలు పెద్దగా ఆకట్టుకోవు. ఆదిత్య ఓం కొంత గ్యాప్ తర్వాత మంచి పాత్ర చేశాడు. చిరాగ్ జానీ పాత్ర ఓకే. అతను కూడా బాగానే చేశాడు. నిర్మాత షణ్ముగం సప్పాని నటుడిగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక చిత్రం శీను, అరియానా గ్లోరీ, సి.వి.ఎల్ నరసింహారావు, ముక్తార్ ఖాన్ వంటి వాళ్ళు తమ పాత్రల మేరకు బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్ :
కాన్సెప్ట్
ఫస్ట్ హాఫ్
నేపధ్య సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
టిపికల్ స్క్రీన్ ప్లే
సెకండాఫ్ స్టార్టింగ్ పోర్షన్స్
మొత్తంగా ‘షణ్ముఖ’ ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్ నుండి వచ్చిన సినిమాల్లో బెటర్ మూవీ అని చెప్పొచ్చు. సెకండాఫ్ ని కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉండుంటే.. కచ్చితంగా ఇది మరింతగా ఆకట్టుకుని ఉండేది.
Shanmukha Telugu Movie Rating : 2.5/5