Canadian Woman in Bengaluru: వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. తన కలల భాగస్వామి జీవితంలోకి అడుగు పెట్టే అరుదైన సందర్భం. కష్ట సుఖాల్లో కలకాలం వెంట నడిచే తోడును జీవితంలో ఆహ్వానించే శుభ సందర్భం. అందుకే, ప్రతి ఒక్కరు పెళ్లిని ఉన్నతంలో ఘనంగా జరుపుకుంటారు. అయితే, పెళ్లి పేరుతో కొంత మంది చేసే హడావిడి, ప్రాణాల మీదికి తీసుకొస్తున్నది. నదుల దగ్గర, వంతెలన మీద, రైల్వే ట్రాక్ ల మీద, ప్రమాదకర ప్రదేశాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆఫర్ట్ వెడ్డింగ్ షూట్లు అంటూ హడావిడి చేస్తున్నారు. ఫోటో షూట్లతో అపశృతి జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ చూశాం. తాజా ఓ పెళ్లిలో ఫోటో షూట్ చేస్తుండగా వధువు తృటిలో ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కలర్ బాంబ్ పేలి పెళ్లికూతురుకు గాయాలు
భారత సంతతికి చెందిన విక్కీ, ప్రియా అనే జంట ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. భారత్ లో వివాహ వేడుక జరుపుకోవాలి అనుకున్నారు. సొంతూరు బెంగళూరుకు వచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. ఆ తర్వాత రిసెప్షన్ నిర్వహించాలకున్నారు. రిసెప్షన్ కు ముందు ఫోటో షూట్ చేశారు. కొత్త జంట హ్యాపీగా, జాలీగా ఫోటోలకు పోజులిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. పిక్స్ మరింత అందంగా రావాలనే ఉద్దేశంతో వెనుక కలర్ బాంబులు ఏర్పాటు చేశారు. ఫోటో కోసం పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురును పైకి ఎత్తాడు. వెంటనే పటా పటా వెనుక కలర్ బాంబులు పేలాయి. అందులో ఓ కలర్ బాంబు మిస్ ఫైర్ అయ్యింది. నేరుగా వచ్చి వధువుకు తగిలింది. ఫైర్ అవుతూ వచ్చి ఆ బాంబు తగలడంతో వధువు శరీరంతో పాటు జుట్టు కాలిపోయింది. నడుం దగ్గర మంట అంటుకుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వధువు బాధతో విలవిలలాడింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కొద్ది గంటల పాటు బెడ్ మీద ఉండిపోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ తర్వాత మళ్లీ యథావిధిగా రిసెప్షన్ లో పాల్గొన్నట్లు వెల్లడించింది.
Read Also: ప్లాట్‌ఫాంపై నిద్ర.. బట్టల షాప్‌లో పని.. చివరికి నిలోఫర్ కేఫ్‌కు యజమాని!
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. తమలా ఎవరూ ఫోటో షూట్ చేసుకోవద్దని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఫోటో షూట్ చేసుకోవాలనుకునే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియోను సుమారు 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని కొంత మంది కామెంట్స్ పెట్టారు.
Read Also: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!