అమరావతి, స్వేచ్ఛ: CID Raids In AP: ఆంధ్రాలో పలుచోట్ల డిస్టిలరీలలో సీఐడీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, విజయవాడ ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇవేగాక ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో తయారవుతున్న మద్యం బాటిలింగ్ యూనిట్ లోనూ సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రేణిగుంట సమీపంలో ఉన్న ఎస్వీఆర్ డిస్టిలరీస్ పైనా దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని పెరల్ డిస్టిలరీలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.
నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పైనా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంస్థపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీర్ల ఆధ్వర్యంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో దాదాపు 30 మంది అధికారులు పాల్గొనడం గమనార్హం.
నేడు కూడా దాడులు
కడప జిల్లాలోని ఈగల్ డిస్టిలరీ కేంద్రంలోనూ సోదాలు జరిగాయి. ఏడాదిగా ఇక్కడ పెద్ద మొత్తంలో మద్యం తయారయిందని..దానికి సంబంధించిన లెక్కలు, రికార్డులు పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ సోదాలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉండటంతో డిస్టిలరీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ దాడులలో వైసీపీ నేతలు మిధున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా జారుతున్నట్లు సమాచారం.
Also Read: Puli Seetha: రోజా.. శ్యామలకు చుక్కలు చూపిస్తున్న పులి సీత.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!
జగన్ ప్రభుత్వంలో నెంబర్-2గా చలామణి అయ్యారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రరో ఇండస్ట్రీస్ ని తన కనుసైగల్లో పెట్టుకుని జె బ్రాండ్లు పేరుతో మద్యానికి పేర్లు పెట్టి అమ్మారు. వాటికే అత్యధికంగా సప్లై ఆర్డర్లు వచ్చేలా చేశారని గతంలోనే సీఐడీ దర్యాప్తులో తేలింది.