BigTV English

Baba Vanga Predictions: బాబా వంగా షాకింగ్ జోస్యం.. 2025లో ప్రపంచం అల్లకల్లోలమే..

Baba Vanga Predictions: బాబా వంగా షాకింగ్ జోస్యం.. 2025లో ప్రపంచం అల్లకల్లోలమే..

Baba Vanga Predictions: కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నామని ప్రపంచమంతా ఎదురుచూస్తుంటే.. రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది. ఇది, అలాంటి ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వంగా ఊహించిన విషయాలు. ఖండాలను మసిచేసే యుద్ధాలు, భూమిని ముంచేసే ప్రకృతి విలయం.. ఇలా రాబోయే కాలం మానవ చరిత్రలో సంచలన మార్పులకు కారణమవుతుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు బాబా వంగా! నిజానికి, 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని అన్నారు. మరి, ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా..? ప్రపంచంలో పరిణామాలు ఈ జోస్యానికి బలం చేకూరుస్తున్నాయా..?


2025లో జరిగే అత్యంత భయంకరమైన యుద్ధం కారణం

రాబోయేదంతా వినాశనమేనా..? మనుషులంతా నశించి పోతారా..? భూమి మనుగడ ఇక కష్టమైనా..? ఇప్పటి వరకూ ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా..? మరో నెల రోజుల్లో కళ్లముందుకొస్తున్న కొత్త సంవత్సరమే మన అంతానికి ఎంట్రీ పాయింటా..? ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యాన్ని వింటుంటే ఈ భయాలన్నీ నిజమేనని నమ్మాల్సి వస్తుంది. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పింది. ఆమె చెప్పిన మాటలు తేలికగా కొట్టి పారేయలేం. ఎందుకంటే, 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగ చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి.


అందుకే, రాబోయే కాలం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది. ప్రస్తుతం పెద్దగా కనిపించని కమ్యూనిజం భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలుతుందనే జోస్యం నుండి యూరప్‌లో యుద్ధాలు.. తెల్లవాళ్లకు ముస్లీం రాజుగా మారడం.. భూమి బద్దలై పోవడం వంటి భారీ షాక్ ఇచ్చే అంశాలు ఆమె ప్రిడిక్షన్‌లో ఉన్నాయి. 2025లో యూరప్‌లో భయంకరైన యుద్ధం జరుగుతుందనీ.. ఇది చాలా విధ్వంసానికి కారణం అవుతుందనీ.. ప్రపంచ నాశనానికి ఇదే మొదలని బాబా వంగా జోస్యం చెప్పారు.

2043 కల్లా ప్రపంచమంతా కమ్యూనిజం చేతుల్లోకి

బాబా వంగ బతికున్న కాలంలో ఓ ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి చెప్పింది. అలాగే, కమ్యూనిజం ప్రపంచాన్ని ఏలుతుందని అంచానా వేసింది. దీన్ని బట్టి, పుతిన్ నాయకత్వంలో కమ్యూనిజం ప్రపంచ ఆధిపత్య శక్తిగా అవతరిస్తుందని తెలుస్తుంది. ఆమె జోస్యం ప్రకారం, 2043 కల్లా ప్రపంచమంతా కమ్యూనిజం చేతుల్లోకి వెళ్తుంది. ఇది 2025లోనే ప్రారంభం అవుతుంది. దీనికి 2025లో జరిగే అత్యంత భయంకరమైన యుద్ధం కారణం అవుతుందని కూడా బాబా వంగా అంచనా వేసింది. 2025లో యూరప్‌లో ఘోరమైన యుద్ధం జరుగుతుందనీ.. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనీ… భారీ స్థాయిలో ధన, ప్రాణ నష్టం వాటిల్లుతుందని ఆమె ఊహించింది.

ఈ జోస్యంలో నిజం ఎంతనేది అటుంచితే… ప్రస్తుత పరిస్థితులను బట్టి.. కమ్యూనిస్ట్ దేశాలైన రష్యా, చైనాలకు అమెరికాకు మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌లో ఉంది. ఇటీవల పుతిన్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే.. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు ఇచ్చిన ఆయుధాలు రష్యా లోపల ప్రయోగిస్తే అది భయానక యుద్ధానికి దారి తీస్తుందనే సూచనలు ఉన్నాయ్. దానికి నాటో దేశాలు, అమెరికా, యూరప్ కంట్రీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా, M16 మాజీ చీఫ్ రిచర్డ్ డీర్లవ్ కూడా దీనిపై యూకే పీఎంకు సూచనలు చేశారు. పుతిన్ యూకేపై యుద్ధానికి దిగుతారని హెచ్చరించారు.

2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం

ఇక, ఐరోపాలో యుద్ధం గురించి బాబా వంగ అంచనాతో పాటు, 2043 నాటికి యూరప్ ముస్లింల పాలనలోకి వస్తుందని.. 2076 నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి వస్తుందని అంచనా వేశారు. అంటే, కమ్యూనిస్ట్ కంట్రీలుగా ఉన్న రష్యా, చైనాలు ప్రపంచాన్ని ఏలతాయనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తుంది. బాబా వంగ, 2025లో ఐరోపాలో క్రూరమైన యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించింది. ఇదే విషయాన్ని, నోస్ట్రడమస్‌గా పాపులర్ అయిన, 16వ శతాబ్దానికి చెందిన మిచెల్ డి నోస్ట్రెడామ్ కూడా చెప్పాడు. ఐరోపా భూభాగాలు క్రూరమైన యుద్ధాల్లో పాల్గొంటాయని హెచ్చరించాడు.

ఇది భారీ విధ్వంసం, భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేశాడు. అయితే, పుతిన్ ప్రారంభించిన ఉక్రెయిన్‌ యుద్ధం ఈ అంచనాలను నిజం చేస్తున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, నోస్ట్రడమస్ చెప్పిన విషయాల్లో.. “పురాతన ప్లేగు శత్రువుల కంటే ఘోరంగా నష్టాన్ని కలిగిస్తుందని” కూడా చెప్పాడు. ఇది బ్రెజిల్‌లో అగ్రిపర్వతాల బూడిద, భారీ వరదలతో సహా ఇతర విపత్తులను సూచిస్తుంది. అలాగే, 2043 నాటికి యూరప్ ముస్లీంల వశం అవుతుందనే ఊహకు, బలం చేకూరుస్తూ.. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో భాగంగా ఇరాన్‌తో పాటు కొన్ని ఇస్లామిక్ దేశాలు యూరప్‌కు వార్నింగ్‌ ఇస్తూనే ఉన్నాయి.

బాబా వంగ చెప్పిన వాటిలో దాదాపు 85% నిజమైన పరిస్థితి

ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఎక్కువ కచ్చితంగా ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేసింది బల్గేరియాకు చెందిన బాబా వంగ.. 1996లో తన 85వ ఏట చనిపోయిన బాబా వంగ.. ఇప్పుడు జరుగుతున్న చాలా పరిణామాలు ఆమె బతికున్నప్పుడే అంచనా వేసింది. చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుపానులో కళ్లు పోగొట్టుకున్న బాబా వంగ, దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలు చూసిందనీ.. ఆమె చెప్పినవి చెప్పినట్లు కచ్ఛితంగా జరుగుతున్నాయని చాలా మంది నమ్ముతారు.

దానికి తగ్గట్లే, ఆమె చెప్పిన వాటిలో దాదాపు 85 శాతం నిజంగా జరగడమే ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురిచేస్తుంది. రెండు లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగ 1989లో చెప్పిన తర్వాత.. 2001, సెప్టెంబరు 11న అమెరికా ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడి దానికి నిదర్శనంగా నిలిచింది. అలాగే 1950లో సముద్రపు అలలు భూభాగాన్ని కబళించివేస్తాయని చెప్పడం.. 2004, డిసెంబరు 26వ తేదీన ఇండోనేషియా, సుమిత్ర దీవులను సునామీ కుదిపేయడాన్ని ప్రపంచంలో అంతా చూశారు.

వేడి ప్రాంతాలు చల్లగా, చల్లటి ప్రాంతాలు వేడిగా మార్పు

ఇక, భూమిపై వచ్చే పెను వాతావరణ మార్పుల గురించి కూడా బాబా వంగ 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని, వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని, అగ్ని పర్వతాలు బుసలకొడతాయని చెప్పింది. దానికి తగ్గట్లే ప్రస్తుతం క్లైమెట్ ఛేంజ్, మనిషి మనుగడకే ప్రమాదాన్ని తెచ్చే స్థాయిలో పెరిగింది.

ఎల్ నినో, లా నినోలు గతి తప్పాయి. సముద్ర వ్యవస్థల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మంచుకొండలు కరిగి అకాల వర్షాలు, వరదలకు కారణం అవుతున్నాయి. భయంకరమైన ఎండ భూమిని కాల్చేస్తుంది. చలి తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది వచ్చిన భీకర వరదలు, వర్షాలు రికార్డు స్థాయిలో నష్టాన్ని మిగిల్చాయి. ఈ సంవత్సరం నమోదైన వేడి ఇది వరకూ ఎప్పుడూ చూడని విధంగా పాశ్చాత్య దేశాలను మాడ్చేసింది. ఇవన్నీ బాబా వంగ చెప్పినట్లే జరిగాయని కాదు గానీ, ఇలా జరుగుతుందని ఆమె ఊహించడమే ఇందులో అర్థం చేసుకోవాల్సిన అంశం.

2130 సంవత్సరంకల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలదు

ఇక, అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్-అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వంగ ముందుగానే అంచనా వేసింది. అయితే, 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికైన తర్వాత 2017 లో డోనాల్డ్ ట్ర౦ప్ అధ్యక్షుడయ్యారు. తర్వాత, జో బైడెన్… ఇప్పుడు, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల జోరు నడుస్తోంది. కానీ, ఇందులో ఓ ఆఫ్రికన్ అధ్యక్షుడవ్వడం బాబా వంగా అంచనాను నిజం చేసిందని కొందరు వాదిస్తారు. అదే సమయంలో, చెర్నోబిల్ విపత్తు, బల్గేరియా భూకంపం, రెండో ప్రపంచ యుద్ధం, యువరాణి డయానా మరణం కూడా బాబా వంగ ప్రవచనాలకు తగ్గట్లే జరిగాయి.

ఇక, బాబా వంగ చెప్పిన అంచనాల్లో.. 2130 సంవత్సరం నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించి పోతుందని, అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని ఉంది. అలాగే, 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని.. 3 వేల 797 సంవత్సరం నాటికి ఈ భూమండలమంతా నశించి పోతుందని.. 5079 సంవత్సరానికి మానవ జాతి అంతా తుడిచి పెట్టుకుపోతుందని అంచనా వేసింది. అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని కూడా బాబా వంగ జోస్యం చెప్పింది.

మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన

బాబా వంగ చెప్పిన కాలజ్ఞానంలో నిజానిజాలు పక్కనపెడితే.. సూచనలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. బాబా వంగ చెప్పిన అంచనాలను ప్రపంచంలో అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా… ఇప్పటి వరకూ కనిపించిన ఉదాహరణలే ఆమె అంచనాలను రూఢీ చేస్తున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయనడంలో మాత్రం సందేహం లేదు. అందుకే, 2025లో ఆమె చెప్పిన యుద్ధాలు, పర్యావరణ విపత్తుల నుండి భూమి నాశనమయ్యే వరకు.. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందోననే భయం పట్టుకుంది.

ఇప్పటికే, మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళన ఉన్న పరిస్థితుల్లో 2025లో యూరప్ యుద్ధం దానికి దారి తీస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. అదే ఇప్పుడు ప్రపంచ కలవరానికి కారణం అయ్యింది. ఇవి నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనను పెంచింది. ఇక, ఇవన్నీ చివరికి ఊహలగానే మిగిలిపోతాయా లేదా అన్నది భవిష్యత్తులో చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×