Best Movies on Netflix 2024 : ఓటిటి ప్లాట్ ఫామ్ మూవీ లవర్స్ కి ఒక వేదిక అని చెప్పవచ్చు. ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ గా నెట్ ఫ్లిక్స్ గుర్తింపు తెచ్చుకుంది. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను, సినిమాలను అందించి మూవీ లవర్స్ ని అలరిస్తోంది. ఈ దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న 2024 బెస్ట్ మూవీస్ గురించి తెలుసుకుందాం.
దేవర (Devara)
కొరటాల శివ దర్శకత్వం వహించిన సెన్సేషనల్ మూవీ ‘దేవర’. ఈ మూవీ సెప్టెంబర్ 27, 2024 రిలీజ్ అయింది. ఈ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని దాదాపు 300 కోట్లు బడ్జెట్ తో నిర్మించారు. అయితే కమర్షియల్ గా 300 కోట్లకు పైగానే దేవర వసూళ్ళు సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది.
సత్యం సుందరం (Satyam Sundaram)
సూర్య జ్యోతిక నిర్మించిన ఈ మూవీకి సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. కార్తీ, అరవింద్ స్వామి, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ తమిళ్ లో ‘మెయ్యగలన్’ పేరుతో సెప్టెంబర్ 27, 2024లో రిలీజ్ అయింది. తెలుగులో ‘సత్యం సుందరం’ పేరుతో సెప్టెంబర్ 28, 2024 లో రిలీజ్ అవ్వడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కార్తీ సెంటిమెంట్ ఈ మూవీకి వర్కౌట్ అయింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ తో కలసి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.
బఘీర (Bagheera)
2024 అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో శ్రీ మురళి నటించిన ఈ మూవీకి కథని సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అందించాడు. డాక్టర్ సూరి దర్శకత్వం వహించాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ మురళి జీవించాడని చెప్పాలి. మహిళలపై జరిగే అమానుష ఘటనలను అడ్డుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రగా శ్రీ మురళి మెప్పించాడు. 2024లో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో (Netflix) నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ ఈ మూవీని చూసి మూవీ లవర్స్ రిలాక్స్ అవ్వండి.
దోపత్తి (Do Patti)
శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ మూవీ 2024 లో మంచి విజయాన్ని అందుకుంది. కృతి సనన్, కాజోల్,
షాహిద్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 25, 2024 నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. కృతి సనన్ ద్విపాత్రాభినయం చేసి తన పాత్రకు న్యాయం చేసింది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 2024 లో వచ్చిన బెస్ట్ మూవీ గా చెప్పుకోవచ్చు.