Nagababu on Pawab Kalyan: ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. ముగ్గురు ఎంపీల రాజీనామాలతో ఆయా స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మరో నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మూడింటికి కూటమి నేతలు ఎన్నిక కానున్నారు. కాకపోతే మూడు పార్టీల నుంచి ఒకొక్కరుగా ఉంటారా? టీడీపీ- జనసేన నేతలే ఉంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
డిసెంబర్ మూడున ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో కూటమి పార్టీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. టీడీపీ తరపున చాలామంది సీనియర్లు రేసులో ఉన్నారు. జనసేన నుంచి నాగబాబుకు దాదాపుగా టికెట్ ఖాయమైనట్టు తొలుత వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి పవన్ వెళ్లారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో నాగబాబు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ స్వార్థం తెలియని ప్రజా నాయకుడని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ ఢిల్లీకి వెళ్లారని, వ్యక్తిగత స్వార్థానికి ఆయన ఎప్పుడూ దూరమేనన్నారు. మా నాయకుడికి సేవ చేయడమే నా ఆశయమని, తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు, ఆశయాలు లేవన్నది ఆయన మాట.
రాజ్యసభ పదవిపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ నాగబాబు తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చేశారు. అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని నాగబాబు ఆశించారు. అనూహ్యంగా ఆ సీటు బీజేపీకి వెళ్లడం అక్కడి నుంచి సీఎం రమేష్ గెలవడం జరిగిపోయింది. ఈ లెక్కన జనసేన నుంచి రాజ్యసభ రేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే దానిపై ఆ పార్టీలో చిన్నపాటి చర్చ జరుగుతోంది.
మరోవైపు టీడీపీ నుంచి చాలామంది సీనియర్లు రేసులో ఉన్నారు. రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌రావు, యనమల రామకృష్ణుడు, సానా సతీష్, అశోక్ గజపతిరాజు ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ సీజేఐ ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ అధినేత చంద్రబాబు మనసులో ఏముందో?
డిసెంబర్ 10న ఉప ఎన్నికకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న పరిశీలన, ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుంది. ఒక వేళ పోటీ గనుక ఉంటే 20న పోలింగ్ జరగనుంది. లేకుంటే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మోపిదేవి, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్యలు తన పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మోపిదేవి, బీద మస్తాన్‌రావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ రాజీనామా చేసిన వారినే పెద్దల సభకు పంపిస్తారా? సీనియర్లకు చోటు కల్పిస్తారా? అనేది చూడాలి.
అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే,వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు .
అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన purpose స్వార్థ… pic.twitter.com/WMYYnRL0IY— Naga Babu Konidela (@NagaBabuOffl) November 29, 2024