కేటీఆర్ పీఆర్వో మహేశ్ మాణిక్య ట. తన బాస్ కేటీఆర్‌కు ఏమాత్రం తీసిపోలేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్టుగా తనూ ఏం తక్కువ తినలేదు. పోలీసులతో తోపులాటలో తనూ పోలీసుల తల్లులను దూషించేలా చెలరేగిపోయాడు. బహుశా కేటీఆర్ తరుచూ ఇలాంటి పదాలు అంతర్గతంగా తన మీటింగులలో, కార్యకర్తలు, లీడర్లతో మాట్లాడతాడేమో.. అందుకే తన బాస్‌ను ప్రసన్నం చేసుకోవాలంటే.. ఇలా అలవోకగా అలవాటైన దోరణిలో తిట్ల పురాణం అందుకున్నట్టున్నాడు.
పదేండ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఓ షాడో సీఎం. అనధికారికంగా ఆయన సీఎంగానే కొనసాగాడు. మరి అలాంటి షాడో సీఎం దగ్గరున్న పీఆర్‌వో, పీఏలు ఇంకెలా ఉంటారు. వీరూ ఓ చిన్నపాటి మంత్రులు, సీఎంలుగానే చెలామణి అయ్యారన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ పట్టించుకోలేదు. మేమే మళ్లీ.. మళ్లీ మళ్లీ మేమే.. అనే దురహంకారం నెత్తికెక్కి కూర్చున్నది కేటీఆర్‌కు, కేటీఆర్ పీఆర్వో, పీఏలకు.
అధికారం పోయిన తరువాత మొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్నారు. ఇక ఇంకో రెండేండ్లు కండ్లు మూసుకుంటే చాలు.. మళ్లీ మేమే వస్తాం.. అనే ఆశలు పెరిగిపోయి.. దీంతో పాటే సమానంగా లోపల అణిచిపెట్టుకున్నఅహంకారం కూడా కట్టలుతెంచుకున్నది కాబోలు. పోలీసులను మాక్కె.. అంటూ తల్లిని దూషించే స్థాయికి చేరుకున్నాడు పీఆర్వో మహేశ్.
అంతే కాదు..వాడి పేరు రాస్కోండ్రి.. అని కూడా పక్కనున్నోడిని పురామయిస్తున్నాడు ఆ వీడియోలో. సేమ్, కేటీయారే గుర్తొచ్చాడు కదా. కేటీఆర్ కూడా బహిరంగ వేదికల మీదే పోలీసులను, అధికారులను బెదిరించేస్తున్నాడు. మీ అంతు చూస్తా బిడ్డా! మీరు సప్త సముద్రాలు దాటిపోయినా మిమ్మల్ని వదలా.. అంటూ నేరుగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నాడు.
పింక్ బుక్కులో పేర్లన్నీ రాసుకుంటున్నాడన్నమాట. ఇప్పుడు కేటీఆర్‌కు తోడు పీఆర్వో కూడా జమయిండు. బూతలకు ఎగబడ్డాడు. పేర్లు రాసుకుంటున్నాడు. మీ అంతు చూస్తా బిడ్డా అని అధికారంలో ఉన్నట్టుగానే ఫీలయిపోతూ తిడుతున్నాడు. ఒక్కోసారి అనిపిస్తుంది.. కేటీఆర్‌కు, అతని వందిమాగధులకు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారేమోనని.
లేకపోతే జనాలకు తమను ఓడగొట్టి బాగా బుద్ది వచ్చింది.. ఇక మాకు ఓటేయడం తప్ప వారికి వేరే గత్యంతరం లేదనే ధీమా కూడా కొండలా పెరిగిపోయి ఉంటుంది. అందుకే అంత కచ్చితంగా.. రెచ్చిపోయేందుకు, తిట్లు తిట్టేందుకు, హద్దులు దాటేందుకు, అంతు చూస్తామని బెదిరించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదనిపిస్తోంది.
ఇక్కడింకో విషయం చెప్పాలి. మహేశ్‌ను పోలీసులు తిడుతున్నారని, కొడుతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు… ఆపార్టీ నేతలు. ఈ వార్తలపై, ప్రచారాలపై యావత్ జర్నలిజం సమాజం ఏమాత్రం ఉలుకూపలుకూ లేదంటేనే అర్థమైపోతుంది కేటీఆర్‌ను మించి ఆ పీఆర్వో నడిపిన అధికార సామ్రాజ్య తీరు.. దొరతనం పోకడలను అందిపుచ్చుకున్న నేపథ్యం గురించి.