BigTV English

Bandi Sanjay: ఇజ్జత్ కా సవాల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. బండి వ్యూహం ఇదే..!

Bandi Sanjay: ఇజ్జత్ కా సవాల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు.. బండి వ్యూహం ఇదే..!

Bandi Sanjay strategy in MLC elections 2024: కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఆ ఎన్నికలు బిజేపికి, మరి ముఖ్యంగా కేంద్ర సహాయ‌మంత్రి బండిసంజయ్‌కి అత్యంత కీలకంగా మారాయి. ఆ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఓటర్లు ఉన్న కరీంనగర్, అదిలాబాదు, నిజామాబాదు, మెదక్‌లలో బీజేపీ ఎంపీలే గెలిచారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లో జరగనున్న మొదటి ఎన్నికలు కావడంతో ఆయనతో పాటు మిగిలిన ముగ్గురు ఎంపీలకు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది.


ఉత్తర తెలంగాణ జిల్లాలో మరో‌ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం అవుతుంది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ‌ స్థానానికి మరికొద్ది నెలల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికపై ఇప్పటికే బీజేపీ ఫోకస్ పెట్టింది. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్న కరీంనగర్, అదిలాబాదు, నిజామాబాదు, మెదక్‌ పార్లమెంట్లు స్థానాల్లో బీజేపీ ఎంపీలే గెలిచారు. నాలుగు‌ ఎంపి స్థానాలలో బిజెపి విజయం సాధించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా‌ మారింది. కేంద్ర‌ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఆ ఎన్నికలపై‌ దృష్టి పెట్టారు.

ప్రస్తుతం జరుగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని‌ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇస్తామని ప్రతి‌ సమావేశంలో చెబుతున్నారు. ఎమ్మెల్సీ‌ ఎన్నికల బాధ్యతలని పూర్తిగా బండి సంజయ్ తన భుజానికి ఎత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆ సీటు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా బిజేపి అనుబంధ సంస్థలు , పట్టభధ్రుల ఓటర్ల ఎన్‌రోల్మెంట్‌పై దృష్టి సారించారు. క్యాండెట్‌తో సంబంధం లేకుండా ఓటర్ల నమోదు‌ కార్యక్రమాన్ని చెబడుతున్నారు.


Also Read: డ్రగ్స్ రహిత తెలంగాణనే లక్ష్యం.. అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ముఖ్యంగా బిజేపి అనుకూలంగా ఉన్నవారితో ఓట్లు నమోదు చేయిస్తున్నారు. కాంగ్రెస్, బీఅర్ఎస్‌కి‌ ధీటైన అభ్యర్థి‌ కోసం అన్వేషణ ‌మొదలు పెట్టారు. నాలుగు ఉమ్మడి జిల్లాలలోని ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు.  పార్టీలో సంజయ్ సీనియర్ నేత కావడంతో అయనకి ఈ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది.  ఆ క్రమంలొ ఎమ్మెల్సీపై మరింత ఫోకస్ పెట్టి‌ సంఘ్ పరివార్ నేతల అలోచనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎంపీ ఎన్నికలలో లాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడ కలిసి పని చేయడానికి‌ ఓ‌స మన్వయ కమిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేయనుంది.

స్థానిక‌సంస్థలు, ఉపాధ్యయ ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగుస్తుండడం తో ఇప్పుడు బిజేపి ఎన్నికలపై‌ నజర్ పెట్టింది. కరీంనగర్ ఎమ్మెల్సీగా పొటి చేయడానికి చాలమంది అశావాహులు ముందుకు వస్తున్నారు. బీజేపీ నేత రాణిరుద్రమ పోటీకి సిద్దం అవుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో‌ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా ‌పొటిచేశారు. ఆమెకు బండి సంజయ్ కొటరీ మెంబర్ అన్న ముద్ర ఉంది. దాంతో ఈ సారి రాణిరుద్రమ అభ్యర్థిత్వన్నే కన్ఫమ్ చేస్తారన్న టాక్ నడుస్తుంది.

మరో సీనియర్ నాయకులు‌ సుగుణకర్‌రావు బీజేపీ అభ్యర్ధిత్వం ఆశిస్తున్నారు. గతంతో పొలిస్తే బిజేపీ ఈసారి చాలా బలపడడంతో పాటు కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పార్లమెంటు స్థానాలలో బిజేపి ఎంపీలు ఉండడంతో ఈ ఎమ్మెల్సీ స్థానం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బిజేపీ తరుపున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు చెందిన వారే. ఆ లెక్కలతో ఈ స్థానం నుంచి పోటీకి ఆశావహులు కూడా పెరుగుతున్నారు.

ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ బండి సంజయ్ ఇప్పటి నుండే దృష్టి పెట్టి‌ సభ్యత్వ నమోదును పెంచాలని పార్టీ‌ క్యాడర్‌కి పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు ఇస్తామని చెప్పుతుండడంతో ఇప్పుడు అటు ఓటర్ల నమోదు, ఇటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆశావహులు బిజీ అవుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×