BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాను విన్నర్ చేయనున్న సోనియా.. అభయ్, నిఖిల్‌తో కలిసి నీఛమైన ముచ్చట్లు

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాను విన్నర్ చేయనున్న సోనియా.. అభయ్, నిఖిల్‌తో కలిసి నీఛమైన ముచ్చట్లు

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 రెండోవారానికి చేరుకుంది. మొదటి వారంలో కంటెస్టెంట్స్ అంతా టీమ్స్ లాగా విడిపోవడం, వారికంటూ ప్రత్యేకంగా చీఫ్స్ ఏర్పాటు అవ్వడం.. వీటన్నింటి వల్ల కొందరు కంటెస్టెంట్స్‌లో మనస్పర్థలు మొదలయ్యాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొందరు కంటెస్టెంట్స్ ఇతర కంటెస్టెంట్స్‌పై ద్వేషం పెంచుకున్నారు. ముఖ్యంగా రోజురోజుకీ విష్ణుప్రియా, సోనియాల మధ్య మనస్పర్థలు పెరగడం మాత్రమే కాదు.. దీని వల్ల బిగ్ బాస్ హౌజ్‌లో సోనియా ఫ్యూచర్‌పై కూడా ఎఫెక్ట్ పడుతోంది. మొదటి వారమంతా తాను ఆడపులి అని చెప్పడం, నిఖిల్‌తో క్లోజ్‌గా ఉండడం వల్ల ఇప్పటికే సోనియాపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు విష్ణుప్రియాతో గొడవ వల్ల సోనియాపై ప్రేక్షకుల్లో చిరాకు కూడా వచ్చింది.


అదే హైలెట్

విష్ణుప్రియా అందరితో సరదాగా ఉండడం కొందరు ప్రేక్షకులకు నచ్చకపోయినా.. మరికొందరు మాత్రం తను చాలా ఫన్నీ అని ఫీలవ్వడం మొదలుపెట్టారు. అదే విధంగా హౌజ్‌లో కూడా చాలామందితో క్లోజ్‌గా ఉన్నట్టుగానే సోనియాతో కూడా క్లోజ్‌గా ఉండడానికి ప్రయత్నించింది విష్ణుప్రియా. కానీ సోనియా మాత్రం ఆ ర్యాపో కుదరలేదు. ‘మొదట్లో మీకు నిఖిల్ అంతగా నచ్చకపోయేవాడు, ఇప్పుడు మీరు తనతో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. ఎందుకు?’ అని విష్ణుప్రియా సరదాగా అడిగిన ప్రశ్నకు సోనియా చాలా సీరియస్ అవుతూ అడల్ట్ రేటెడ్ కామెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతే కాకుండా విష్ణుప్రియా వెళ్లి సారీ చెప్తున్నా పట్టించుకోకుండా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో విష్ణుప్రియాకు కోపం వచ్చి తాను కూడా నోరుజారింది. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ గతవారంలో హైలెట్‌గా నిలిచింది.


Also Read: నామినేషన్స్ నుండి తప్పించుకోలేని చీఫ్స్.. ఆ ఒక్కరు మాత్రం సేఫ్, ఈసారి ఆదిత్య ఓంపై అందరి ఫోకస్

సారీ చెప్తే సరిపోతుంది

వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చినప్పుడు కూడా విష్ణుప్రియాదే తప్పు అన్నట్టుగా మాట్లాడి తను హౌజ్‌లో ఫ్లాప్ అని ప్రకటించారు. దీంతో చాలామంది ప్రేక్షకులు సోనియాకు సపోర్ట్‌గా మారారు. తాజాగా జరిగిన నామినేషన్స్ తర్వాత ఒక్కసారిగా అంతా రివర్స్ అయిపోయింది. నామినేషన్స్ సమయంలో సోనియా.. విష్ణుప్రియాను నామినేట్ చేయలేదు. కానీ విష్ణుప్రియా మాత్రం తనతో జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని సోనియాను నామినేట్ చేసింది. తాను అడిగిన ప్రశ్న.. సోనియాకు నచ్చనందుకు మళ్లీ వచ్చి సారీ చెప్పానని, తనను అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తుందని అన్నందుకు కనీసం తనకు సారీ కూడా చెప్పలేదని వాపోయింది. అయినా సోనియా మాత్రం తాను ఏమీ తప్పు మాట్లాడలేదు అన్నట్టుగా వాదించడం మొదలుపెట్టింది. ఒక్క సారీ చెప్తే అయిపోయేదని ప్రేక్షకులు సైతం ఫీలయ్యారు.

ఎందుకా మాటలు

నామినేషన్స్ పూర్తయిన తర్వాత అభయ్, నిఖిల్‌తో కలిసి విష్ణుప్రియా విషయం గురించి చర్చించింది సోనియా. తను బ్లౌజ్ వేసుకుంటున్నప్పుడు విష్ణుప్రియా వచ్చిందని, తనకు అసౌకర్యంగా అనిపించి అక్కడి నుండి వెళ్లిపోదానుకున్నప్పుడు విష్ణుప్రియా సారీ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది. ఇందులో అసలు ఏం తప్పు ఉందో ప్రేక్షకులకు అర్థం కాలేదు. అంతే కాకుండా అలాంటి విషయాన్ని అభయ్, నిఖిల్‌తో తను ఎందుకు షేర్ చేసుకోవడం కూడా చాలామందికి నచ్చలేదు. అలా ఇప్పటివరకు ప్రేక్షకుల్లో విష్ణుప్రియా పట్ల పెద్దగా ఒపీనియన్ లేకపోయినా.. సోనియా చేస్తున్న పనుల వల్ల, తను మాట్లాడుతున్న మాటల వల్ల విష్ణుప్రియా టాప్ 5 స్థానానికి చేరుకునే అవకాశం ఉందని బిగ్ బాస్ నిపుణులు భావిస్తున్నారు.

Related News

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Big Stories

×