Big Stories

Priyanka Gandhi : ఎన్నికల బరి నుంచి తప్పుకున్న ప్రియాంక గాంధీ.. అక్కడి నుంచి రాహుల్ పోటీ ?

Priyanka Gandhi latest news(Politics news today India): దేశంలో రెండు విడతల లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మే 7న మూడో విడత, 13న నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు దేశంలో ప్రధాన పోటీ కాంగ్రెస్ – బీజేపీల మధ్య నెలకొంది. ఇరు పార్టీలు అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొంటారని పేర్కొంటున్నాయి. రాహుల్ గాంధీ అమేథీ లేదా రాయ్ బరేలీ నుంచి పోటీచేసే యోచనలో ఉన్నారని, దీనిపై 24 గంటల్లో తుదినిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీతో సహా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పార్టీ అభ్యర్థులుగా ఉండాలని కోరారు. కానీ.. ప్రియాంకగాంధీ ప్రచారానికే పరిమితమవ్వాలని భావిస్తున్నారు.

- Advertisement -

Also Read :చిక్కుల్లో బీజేపీ, ఆ వీడియోల మాటేంటి?

చాలాకాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని భావిస్తోంది. 17 స్థానాలకు గాను.. 10 స్థానాలను కైవసం చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారంలో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రచార వేగం పెంచారు. బహిరంగ సభలు, రోడ్ షో లు నిర్వహిస్తూ.. దూసుకెళ్తున్నారు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News