ఇప్పుడు బయటికి వచ్చిన వీడియో హత్యకు ముందు తీసినట్టు కనిపిస్తోంది. బొజ్జల చెప్పినందుకే రెండుసార్లు రోడ్డు ప్రమాదంలో వినుత దంపతులను చంపడానికి చూశానని.. 2023 నవంబర్‌లో తనకు అడ్వాన్స్‌గా 2 లక్షలు ఇచ్చారన్నాడు రాయుడు. ఎన్నికల తర్వాత మరో 20 లక్షలు ఇచ్చారని వివరించారు. ప్రైవేటు వీడియోలు తీయడం తనవల్ల కాదంటే.. బొజ్జల బెదిరించారని చెప్పాడు రాయుడు. వీడియోలు ఇస్తే 60 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ చేశారన్నాడు. సోఫాలో వినుత పడుకుని ఉండగా వీడియో తీస్తూ దొరికిపోయానన్నాడు.
ఇప్పుడివన్నీ చూసిన తర్వాత వెళ్లన్ని బొజ్జలవైపే చూపిస్తున్నట్టు కనిపిస్తోంది వ్యవహారం. రాయుడు చెప్పినట్టు వినుత హత్యకు బొజ్జల సుధీర్‌రెడ్డి కుట్ర పన్నాడా..? వినుత డ్రైవర్ రాయుడికి ఎందుకు డబ్బులు ఇచ్చారు..? ఓ మహిళ ప్రైవేటు వీడియోలు తీసి ఇమ్మనడం ఏంటి..? ఆ ప్రైవేటు వీడియోలతో బొజ్జల ఏం చేయాలనుకున్నారు..? ఈ ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.
ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని.. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానన్నారు సుధీర్‌రెడ్డి. డ్రైవర్ వీడియో నమ్మేలా లేదని… చంపడానికి ముందు బెదిరించి రికార్డు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ పై పార్టీ అధిష్టానానికి వివరిస్తానన్నారు.