BigTV English
Advertisement

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

OG: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఒకవైపు హీరోగా కొనసాగుతూనే.. మరొకవైపు రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ.. అటు ప్రేక్షకులను ఇటు ప్రజలను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సుజీత్ (Sujeeth ) దర్శకత్వంలో చేసిన చిత్రం ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలు వల్ల థియేటర్లకు జనాలు పెద్దగా వెళ్లలేదని చెప్పాలి.


ఓటీటీ స్ట్రీమింగ్ కి ఓజీ..

అయితే ఇప్పుడు నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 23 నుంచి ఓజీ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటినుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తారు అనే విషయంపై ఎవరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు అక్టోబర్ 23 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది అని వార్తలు రాగా.. నెల తిరగకుండానే ఓజి ఓటీటీలోకి రాబోతోందా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ సినీ లవర్స్ మాత్రం చాలా ఎక్సైట్ గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా థియేటర్కు వెళ్ళలేని ఎంతోమంది ఓటీటీలో ఈ మూవీ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఈ వార్త అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ఓజీ సినిమా విశేషాలు..

ఓజీ సినిమా విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందించారు. మొత్తానికి అయితే థియేటర్ల నుంచి ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ALSO READ:Bigg Boss 9: ఆ కోరిక తీరలేదు.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

పవన్ కళ్యాణ్ సినిమాలు..

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ కి డీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి సినిమా ఇది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు. కానీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది అనే విషయం తెలియలేదు. కానీ ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిందని.. హీరోయిన్ నిధి అగర్వాల్ వెల్లడించింది. సుజీత్ దర్శకత్వంలో సినిమా చేసిన ఈయన.. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రీ లీలా హీరోయిన్ గా.. రాశి ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ఓజీ సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

War 2: థియేటర్లలో బొక్కబోర్లా.. ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2!

OTT Movie : 2 గంటల 11 నిమిషాల మలయాళం మూవీ… IMDbలో 9.4 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

OTT Movie : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే

OTT Movie : రాత్రికి రాత్రే యవ్వనంగా మారిపోయే భార్య… ఒక్క సిప్ తో అమరత్వం ఇచ్చే అమృతం… భర్తకు దబిడి దిబిడే

Malayalam Movies on OTT : క్రైమ్ నుంచి కామెడీ వరకు… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మలయాళం సినిమాలు ఇవే

Big Stories

×