BigTV English
Advertisement

SBI Diwali Offers: ఎస్బీఐ కార్డ్ దీపావళి ఆఫర్స్ 2025.. రూ.20,000 వరకూ వోచర్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ వివరాలు!

SBI Diwali Offers: ఎస్బీఐ కార్డ్ దీపావళి ఆఫర్స్ 2025.. రూ.20,000 వరకూ వోచర్లు,  క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ వివరాలు!

SBI Diwali Offers: ఈ దీపావళి పండుగలో షాపింగ్‌కి రెడీ అవుతున్నారా..? అయితే ఈ సారి మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మీకు నిజంగా లక్కీ టికెట్ లాంటిదే. ఎందుకంటే ఎస్బీఐ కార్డ్ కంపెనీ ఈ దీపావళి సందర్భంగా కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. షాపింగ్ చేసినా, ట్రావెల్ చేసినా, గిఫ్ట్‌లు కొన్నా ప్రతీ స్వీప్‌కి రివార్డ్‌లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ ఆఫర్స్ ఏమిటి, ఎవరికి లభిస్తాయి, ఎంత వరకు సేవింగ్స్ చేయవచ్చు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.


దీపావళి స్పెషల్ స్కీమ్ వివరాలు

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎస్బీఐ కార్డ్ సంస్థ దీపావళ ధమాకా ఆఫర్ల్స్ 2025 పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని కింద యూజర్లు రూ.20,000 వరకూ వోచర్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ఉచిత ప్రవేశం, రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్స్ 2025 అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు అమల్లో ఉండనున్నాయి. అంటే దీపావళి షాపింగ్ సీజన్ మొత్తంలోనూ మీరు బాగానే లాభపడవచ్చు.


రూ.20,000 వరకూ వోచర్లు

ఎస్బీఐ కార్డ్ హోల్డర్లు ఈ సారి మినిమం ఖర్చు టార్గెట్ పూర్తి చేస్తే అమెజాన్, మింత్రా, టాటా క్లిక్, బిగ్‌బజార్, క్రోమా, షాపర్స్ స్టాప్ వంటి టాప్ బ్రాండ్ల నుండి గిఫ్ట్ వోచర్లు పొందవచ్చు. మీరు దీపావళి సీజన్‌లో రూ.2 లక్షలకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే, మొత్తం విలువ రూ.20,000 వరకు ఉన్న వోచర్లు లభిస్తాయి. ఇవి షాపింగ్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ట్రావెల్ తదితర విభాగాలపై వినియోగించుకోవచ్చు.

ఫ్రీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్

ఎస్బీఐ ప్రీమియర్ మరియు ఎలైట్ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక బెనిఫిట్‌గా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతి క్వార్టర్‌లో రెండు ఉచిత లాంజ్ యాక్సెస్‌లు పొందవచ్చు. దీని ద్వారా ట్రావెల్ సమయంలో కంఫర్ట్‌గా టైం గడపవచ్చు.

స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రీలయన్స్ డిజిటల్, అజియో వంటి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఎస్బీఐ కార్డ్‌తో షాపింగ్ చేస్తే 10% వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అదే కాకుండా కొన్ని స్టోర్లలో ఈఎంఐఎస్ పై కూడా 5% అదనపు క్యాష్‌బ్యాక్ అందిస్తున్నారు.

Also Read: Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ ఆఫర్.. సామ్‌సంగ్ వస్తువులపై ఏకంగా రూ.1,000 వరకు తగ్గింపు

ఫ్యుయల్ బెనిఫిట్స్

పెట్రోల్ బంక్‌లలో ప్రతి రూ.400 నుండి రూ.5000 వరకు లావాదేవీలపై 1% ఫ్యూయల్ సర్‌చార్జ్ వేవర్ లభిస్తుంది. ఇది కూడా సగటుగా సంవత్సరం పొడవునా రూ.2500 వరకు సేవింగ్స్ ఇస్తుంది.

EMI ఆఫర్స్

ఎస్బీఐ కార్డ్ యూజర్లు తమ బిల్లులు లేదా పెద్ద షాపింగ్ మొత్తాలను ఈజీ EMIలో మార్చుకోవచ్చు. ఈ దీపావళి సమయంలో కొన్ని కేటగిరీలలో జీరో ప్రాసెసింగ్ ఫీజుతో EMI ఆప్షన్ అందిస్తున్నారు. ఇది గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు కొనుగోలు చేసే వారికి బాగానే ఉపయుక్తంగా ఉంటుంది.

అదనపు రివార్డ్ పాయింట్లు

ఈ సీజన్‌లో ప్రతి రూ.100 ఖర్చుపై సాధారణంగా 2 పాయింట్లు లభిస్తే, ఇప్పుడు ఎస్బీఐ 5 రెట్లు రివార్డ్ పాయింట్లు ఇస్తోంది. ఈ పాయింట్లను తర్వాత గిఫ్ట్ వోచర్లుగా లేదా బిల్లుల చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు.

పార్టనర్ ఆఫర్స్

ఎస్బీఐ కార్డ్ అమెజాన్, మేక్‌మైట్రిప్, బుక్‌మైషో, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ వంటి కంపెనీలతో టైఅప్ చేసి అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. బుక్‌మైషోలో మూవీ టిక్కెట్లు కొనుగోలు చేస్తే బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్, స్విగ్గీలో ఆహారం ఆర్డర్ చేస్తే 15శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఆఫర్‌కి ఎలా రిజిస్టర్ కావాలి?

ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో “దివాళి ఆఫర్స్ 2025 సెక్షన్‌కి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీ ట్రాన్సాక్షన్‌లనూ ట్రాక్ చేస్తూ టార్గెట్ పూర్తి చేస్తే ఓచర్లు ఆటోమేటిక్‌గా SMS లేదా ఇమెయిల్ ద్వారా వస్తాయి.

షరతులు కూడా ఉన్నాయి

ఆఫర్ 2025 నవంబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. కొన్ని ఆఫర్లు ప్రత్యేక కార్డ్ టైపులకే వర్తిస్తాయి. EMI కన్వర్షన్ చేసుకున్న ట్రాన్సాక్షన్‌లు కొన్నింటిలో రివార్డ్ పాయింట్లకు అర్హత ఉండకపోవచ్చు. కావున, ఈ దీపావళి ఎస్బీఐ కార్డ్ వాడితే షాపింగ్‌కి లాభం, ట్రావెల్‌కి సౌకర్యం, గిఫ్ట్‌లకి అదనపు రివార్డ్ లాంటి మూడు ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయి. అందుకే ఈ పండుగ సీజన్‌లో “తెలివిగా ఖర్చు చేయండి – ప్రకాశవంతంగా జరుపుకోండి!” అన్నట్టుగా ఎస్బీఐ కార్డ్‌తో మీ షాపింగ్ ప్రారంభించండి.

Related News

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ ఆఫర్.. సామ్‌సంగ్ వస్తువులపై ఏకంగా రూ.1,000 వరకు తగ్గింపు

PMEGP Scheme: 35 శాతం సబ్సిడీతో రూ.50 లక్ష వరకు రుణం.. కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం

Flipkart vs Amazon: ఆఫర్ల హంగామాలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోరు.. ఎవరిది నిజమైన డీల్

Jio New Recharge Plan: జియో కొత్త ప్లాన్స్ షాకింగ్ వివరాలు.. రూ.448 నుండి రూ.895 వరకూ లాభాలే లాభాలు

Tata Capital: బిగ్గెస్ట్ IPO ఆఫ్ ది ఇయర్ గా టాటా క్యాపిటల్ గ్రాండ్ ఎంట్రీ..

Personal loan: పర్సనల్ లోన్ వెనుక దాగిన భయంకర నిజం! జాగ్రత్తగా లేకుంటే మీకే నష్టం

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Big Stories

×