BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: తనూజ వర్సెస్ ఆయేషా.. ఇది కదా అసలు వార్!

Bigg Boss 9 Promo: తనూజ వర్సెస్ ఆయేషా.. ఇది కదా అసలు వార్!

Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. అంటేనే గొడవలు, ప్రేమలు, ఎమోషన్స్, రొమాన్స్ ఇలా ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఈ వేదిక అతిపెద్ద ఫ్లాట్ ఫామ్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టి.. గొడవలు పెట్టుకుని బయట శత్రువులుగా మారిన విషయం తెలిసిందే. మరి కొంతమంది ఇదే హౌస్ లో ప్రేమించుకుని బయటకు వెళ్లాక పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. మరి కొంతమంది స్నేహాలు కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఎన్నో రకాల జీవితాలను అందించింది ఈ షో. ఇకపోతే ఇప్పుడు తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు 9వ సీజన్ కూడా ప్రారంభం అయింది.


ఫైర్ బ్రాండ్ గా మారిన వైల్డ్ కార్డు ఎంట్రీ..

అందులో భాగంగానే 9 మంది సెలబ్రిటీలు.. 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. మరొకవైపు ఐదు వారాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొత్తం 6 మంది హౌస్ నుండి ఎలిమినేట్ కాగా.. మరోవైపు 6 మందిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి దింపారు బిగ్ బాస్. మొన్నటి వరకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టుగా సాగిన ఈ షో ఇప్పుడు వైల్డ్ స్ట్రోమ్ వర్సెస్ హౌస్ మేట్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.ఇకపోతే ఇన్ని రోజులు భరణి శంకర్ ను నాన్న అని పిలుస్తూ.. రిలేషన్ కొనసాగించిన తనూజను ఎవరు ఏమీ అనలేకపోయారు.. కానీ ఆమె తప్పులను ఇప్పుడు హైలెట్ చేస్తూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఆయేషా ఇచ్చి పడేసింది. బిగ్ బాస్ అంటేనే సపోర్టుగా తండ్రి లేదా ఫ్రెండ్ లేదా లవర్ ఉంటే ఫైనల్ వరకు నెట్టుకు రావచ్చు అనే భ్రమలో ఉన్నారు అంటూ హాట్ బాంబు పేల్చింది ఆయేషా.

ఆయేషా వర్సెస్ తనూజ..

విషయంలోకి వెళ్తే.. తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో ఆయేషా వర్సెస్ తనూజ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ప్రోమో విషయానికి వస్తే.. ఆయేషా మాట్లాడుతూ..” మీ ఇన్ఫ్లుయెన్స్.. మీ ఫేవరిజం వల్ల ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందరికీ అన్యాయం జరుగుతోందని నాకనిపిస్తోంది. భరణి గారికి నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఎలా అనిపిస్తోందంటే.. మీ వల్ల అతని గేమ్ కూడా పాడైపోతోంది అని నాకనిపిస్తోంది. ఆల్రెడీ స్టార్ మాలో చాలా మంచి సీరియల్స్ వెళుతున్నాయి. ఇక్కడ అది అవసరం లేదు. అని తన అభిప్రాయాన్ని చెప్పగా.. తనూజ ఫైర్ అవుతూ.. ప్రతిసారి నాకు భరణి గారే వచ్చి సపోర్ట్ చేశారా.. లాస్ట్ టైం నేను కళ్యాణ్ కదా అని చెప్పబోతుండగా నీకు ఏడుపు వచ్చిన ప్రతిసారి నాన్న ఎందుకు మాట్లాడలేదు నాన్న ఎందుకు అంటూ ప్రతిసారి భరణి గారి పేరు తీయట్లేదా? అంటూ మండిపడింది ఆయేషా. అయ్యుండొచ్చు ఎవరికి వాళ్లు ఫేవరిజం ఉన్నారు కదా అని తనూజ తన వెర్షన్ వినిపించగా.. అంటే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావ్ అంటూ మళ్ళీ కౌంటర్ వేసింది ఆయేషా.


ఒక లవరో.. నాన్నో.. ఉంటే నెట్టుకురావచ్చా..

ఎందుకంటే డే వన్ నుంచి క్లోజ్ గా ఉన్నాం కాబట్టి అంటూ తనూజ చెబుతూ ఉండగా.. అవును అదే నేను చెబుతున్నాను.. మీరు చాలా క్లోజ్ గా ఉన్నారు అని ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ , ఒక నాన్నో ఉంటే చాలు ఫైనల్ వరకు నెట్టుకు వచ్చేయొచ్చు అనే లాగా ఉన్నారు.. అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకు వచ్చింది. మొత్తానికైతే ఇటు తనుజాకు అటు రీతు చౌదరికి కూడా గట్టిగానే ఇచ్చి పడేసింది ఆయేషా. ఇది చూసిన నెటిజన్స్ ఇవి కదా వ్యాలీడ్ పాయింట్స్ అంటే ఇలా ఉండాలి అంటూ ఆయేషా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

ALSO READ:Film industry: షూటింగ్ సెట్స్‌లో విషాదం… గుండెపోటుతో బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి!

Related News

Duvvada Madhuri : మాధురికి సినిమా చూపిస్తానంటున్న సంజన.. జుట్టు జుట్టు పట్టుకొని…

Bigg Boss Contestant : షూటింగ్ సెట్స్‌లో విషాదం… గుండెపోటుతో బిగ్ బాస్ కంటెస్టెంట్ మృతి!

Bigg Boss 9: ఆ కోరిక తీరలేదు.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ.. అసలు మానవత్వం ఉందట్రా మీకు?

Bigg Boss 9 Telugu: ఫైర్ బ్రాండ్ లా మాధురి.. పార్టీ మార్చిన తనూజ.. మాములుగా ఉండదు..!

Bigg Boss 9 : ఫైర్ స్ట్రోమ్ వచ్చింది, హౌస్ లో చిచ్చు పెట్టింది. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా?

Bigg Boss 9 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి? గమనించారా?

Big Stories

×