Drinking Water: మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువ అవసరమయ్యేది నీరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది రోజంతా బిజీగా ఉండిపోతూ నీళ్లు తాగడం మరిచిపోతున్నారు. ఇది చిన్న విషయం కాదు. నిజానికి తక్కువగా నీళ్లు తాగడం అంటే నెమ్మదిగా మన శరీరాన్ని చంపుకుంటున్నట్టే. ఎందుకంటే మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. అదే నీరు తగ్గిపోతే, ప్రతి అవయవం నెమ్మదిగా పనితీరు కోల్పోతుంది.
తలనొప్పికి నీటికి సంబంధం ఏమిటి
తలనొప్పి తరచూ వస్తుందా? మందులు వేసుకున్నా తగ్గట్లేదా? అది నీ బాడీలో నీటి స్థాయి తగ్గిందనే సూచన. నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు మెదడుకి రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దాంతో తలనొప్పి, మైకం, కళ్లకు నొప్పి లాంటివి మొదలవుతాయి. చాలా మంది దీనిని ఒత్తిడి కారణంగా అనుకుంటారు కానీ అసలు కారణం నీటి కొరతే.
రక్తం మందగించడానికి కారణం నీరు..
రోజంతా ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుందా? ఇది కూడా నీళ్లు తక్కువగా తాగడమే కారణం. నీరు శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో, శక్తిని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నీరు తగ్గితే శరీరంలో రక్తం మందగిస్తుంది. దాంతో శక్తి తగ్గిపోతుంది, మనసు నిరుత్సాహంగా మారుతుంది.
నీటితో జీర్ణక్రియకు సంబంధం ఏమిటి
కడుపు బరువుగా ఉందా? గ్యాస్, మంట, ఉబ్బరం లాంటివి తరచూ వస్తున్నాయా? నీళ్లు తక్కువగా తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. నీరు శరీరంలో వ్యర్థాలను బయటకు పంపుతుంది. నీరు లేకపోతే ఆ వ్యర్థాలు శరీరంలోనే పేరుకుపోతాయి. దాంతో కడుపు గాలి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.
సరైన నీరు లేకపోతే కిడ్నీలకు నష్టం
ఇంతకంటే ప్రమాదకరమైనది కిడ్నీలకు జరిగే నష్టం. నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీలు సరిగా పని చేయలేవు. రక్తంలో ఉన్న ఉప్పులు, విషపదార్థాలు (toxins) కిడ్నీల్లో పేరుకుపోతాయి. కొంతకాలానికి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఆ తర్వాత నిశ్శబ్దంగా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అది తెలిసే సమయానికి ఆలస్యమైపోతుంది.
Also Read: Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. కారణం స్కూల్ బ్యాగ్ ఒత్తిడేనా?
చర్మానికి నీటితో సంబంధం
చర్మం కూడా నీటి కొరతను స్పష్టంగా చూపిస్తుంది. నీళ్లు తక్కువగా తాగేవారి చర్మం పొడిగా, మసకగా, ముడతలతో కనిపిస్తుంది. వయస్సు చిన్నదైనా ముఖం పెద్దవారి లాగా కనిపిస్తుంది. ఎందుకంటే చర్మ కణాలు నీటిని కోల్పోతే లవణాలు తగ్గిపోతుంది. నీళ్లు తాగడం వల్లే చర్మం మెరుస్తూ, కాంతివంతంగా ఉంటుంది.
ఇలా చేయండి..
నీరు శరీరానికి అద్భుతమైన ఔషధం. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియ సరిచేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని ప్రతి కణం మళ్లీ జీవం పొందుతుంది.
రెండు గంటలకు ఒకసారి నీరు
ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు తప్పనిసరిగా తాగాలి. రాత్రంతా పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి రెండు గంటలకు ఒకసారి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగడం కాదు, రోజంతా కొద్దిగా తాగుతూ ఉండాలి. ఇది శరీరానికి చాలా మంచిది.
నీటితో బరువుతో సంబంధం ఏమిటి
ఒకటి గుర్తుపెట్టుకోండి మీ బరువు ఎంత ఉందో 30తో గుణించండి. మీరు 60 కిలోలైతే రోజుకు కనీసం 1800 మిల్లీ లీటర్ల నీరు తాగాలి. అంటే దాదాపు రెండు లీటర్ల వరకు. ఎండాకాలంలో లేదా ఎక్కువ పని ఉన్నప్పుడు ఈ పరిమాణాన్ని పెంచుకోవాలి.
శరీర సమస్యలకు సరైన నీరు లేకపోవడం వల్లే
నీళ్లు తాగడం అలవాటు చేసుకోని వారు, చిన్న వయస్సులోనే పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. తలనొప్పి, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, కిడ్నీ ఇబ్బందులు ఇవన్నీ నీటి కొరత వల్లే వస్తున్నాయి. కాబట్టి నీళ్లు తాగడం అంటే సాదాసీదా అలవాటు కాదు, అది మన ప్రాణానికి రక్షణ. ఇప్పటి నుంచి ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీరు తాగు, ప్రతి రెండు గంటలకు నీరు తాగే రిమైండర్ పెట్టుకో. నీ శరీరాన్ని ప్రేమించు అంటే ముందుగా నీటిని ప్రేమించు. ఎందుకంటే నువ్వు తాగే ప్రతి గ్లాస్ నీరు నీ శరీరంలోని ప్రతి కణానికి జీవం ఇస్తుంది.