Apple Bug Bounty| ఐఫోన్, ఐప్యాడ్, మెక్ బుక్ లు తయారు చేసే ఆపిల్ కంపెనీ ఎల్లప్పుడూ సైబర్ సెక్యూరిటికే అత్యధిక ప్రాధన్యం ఇచ్చింది. అందుకే తరుచూ తమ డివైజ్‌లు, సాఫ్ట్ వేర్‌లలో లోపాలు, బగ్స్ ఉంటే తెలియజేయాలని బగ్ బౌంటీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఆపిల్ తో పాటు అప్పుడప్పుడూ శాంసంగ్, గూగుల్ కంపెనీలు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అయితే తాజాగా ఆపిల్ తన బగ్ బౌంటీ ప్రొగ్రామ్ కొత్త స్థాయికి తీసుకెళ్లింది. మిగతా రైవల్ కంపెనీలకంటే అత్యధిక రివార్డ్ ప్రకటించింది. తన సైబర్ సెక్యూరిటీ రివార్డ్ ప్రోగ్రామ్‌లను అత్యంత ముఖ్యమైన సెక్యూరిటీ లోపాలను కనిపెట్టే పరిశోధకులకు, ఎథకల్ హ్యాకర్లకు ఏకంగా రెండు మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.17 కోట్లకు పైనే. ఈ కొత్త కార్యక్రమంలో టెక్ దిగ్గజం పెద్ద ఎత్తున సైబర్ దాడులకు ఉపయోగపడే లోపాలను బయటపెట్టే ఈ బహుమతి ఇస్తానని తెలిపింది.
ఉదాహరణకు.. ఆపిల్ సెక్యూరిటీ పరిశోధనలో “ఎక్స్‌ప్లాయిట్ చైన్స్”ను వివరించే వారికి $2 మిలియన్లు (సుమారు ₹17.7 కోట్లు) ఇవ్వడానికి సిద్ధం. ఈ రివార్డ్ ప్రధానంగా జీరో-క్లిక్ హ్యాక్‌లకు, అత్యాధునిక స్పైవేర్ ఇన్ఫెక్షన్‌లు కనిపెట్టే వారికి. ఇది ఆపిల్ ఇప్పటివరకు ప్రకటించిన అతి పెద్ద రివార్డ్. కంపెనీ ఈ లోపాల ద్వారా సైబర్ మోసగాళ్లు దాడులు చేయకముందే ముప్పును నియంత్రించాలని కోరుకుంటోంది.
ఆపిల్ లాక్‌డౌన్ మోడ్‌ను బైపాస్ చేసే లోపాలు కనిపెట్టే రివార్డ్‌లను పెంచింది. యాపిల్ బీటా సాఫ్ట్‌వేర్‌లో లోపాలు కనుక్కునే వారికి $1.5 మిలియన్ల వరకు ఇస్తారు. అంతేకాక, వివిధ లోపాల కోసం కొత్త బోనస్‌లతో రివార్డ్‌లు మరింత పెరుగుతాయి.
ఆపిల్ ప్రకటించినట్లు, ఇది మార్కెట్‌లో అతి పెద్ద బౌంటీ ప్రోగ్రామ్. ప్రాథమిక రివార్డ్‌తో పాటు బోనస్‌లు ఇస్తారు. పరిశోధకులు ఒక టీమ్‌గా ఏర్పడి లాక్‌డౌన్ మోడ్ బైపాస్‌లు, బీటా సాఫ్ట్‌వేర్ సమస్యలను కనిపెడితే.. మొత్తం రివార్డ్ $5 మిలియన్లు (రూ.43 కోట్లు) మించవచ్చు. ఈ పెద్ద మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ సెక్యూరిటీ నిపుణులను ఆకర్షించడానికి.
2025 నవంబర్‌లో యాపిల్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌కు మార్పులు తీసుకువస్తుంది. మార్పులు యాపిల్ సెక్యూరిటీ రీసెర్చ్ వెబ్‌సైట్‌పై ప్రచురించబడతాయి. కేటగిరీలు, రివార్డ్‌లు, బోనస్ స్ట్రక్చర్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ అప్డేట్‌లు ఆపిల్ గాడ్జెట్‌లు, సర్వీసెస్‌లో లోపాలపై దృష్టి పెడతాయి. పరిశోధకులకు తాము కనిపెట్టిన బగ్స్‌ను సమర్పించడం, రివార్డ్‌లు పొందడం గురించి కంపెనీ మార్గదర్శకాలు ఇస్తుంది.
యాపిల్ పబ్లిక్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ 2020లో ప్రారంభమైంది. అప్పటి నుండి కంపెనీ $35 మిలియన్లు (₹300 కోట్లు పైగా) సెక్యూరిటీ పరిశోధకులకు చెల్లించింది. 800 మంది పైగా పరిశోధకులు పొందారు. కొందరు క్రిటికల్ బగ్‌ల కోసం $500,000 వరకు పొందారు. ఆపిల్ ప్రకారం, ఈ బగ్ బౌంటీలు ఆపిల్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు మరింత భద్రత కల్పిస్తాయి. భారీ స్థాయిలో బహుమానాలు ప్రకటించడం ద్వారా ఆపిల్ సెక్యూర్ ప్రొడక్ట్స్ అందించడంతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే