BigTV English
Advertisement

Chandrayaan-3 live updates : చంద్రయాన్-3ని ఎలా సాఫ్ట్ ల్యాండ్ చేశారంటే?.. చంద్రుడిపై అసలేం జరిగిందంటే..?

Chandrayaan-3 live updates : చంద్రయాన్-3ని ఎలా సాఫ్ట్ ల్యాండ్ చేశారంటే?.. చంద్రుడిపై అసలేం జరిగిందంటే..?
Chandrayaan 3 launch live update

Chandrayaan 3 launch live update(Today’s breaking news in India):

చంద్రయాన్‌ 3 జాబిల్లిపై సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయింది. యావత్ భారతం ఉప్పొంగింది. సాయంత్రం సరిగ్గా 5 గంటల 45 నిమిషాలకు చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రొసిజర్ స్టార్ అయింది. 6 గంటల 4 నిమిషాలకు ముగిసింది. చంద్రుడిపై చంద్రయాన్‌-3 ల్యాండ్ అయిపోయింది. చెప్పడానికి ఇంత సింపుల్‌గా ఉన్నా.. ఇది అంత ఈజీగా జరగలేదు. మొత్తం మిషన్‌లో చివరి 17 నిమిషాలు చాలా క్రూషియల్.


చివరి 17 నిమిషాల్లో ఏం జరిగిందనేది వెరీ ఇంట్రెస్టింగ్. సరైన సమయంలో.. సరైన ఎత్తులో.. ల్యాండర్‌లో ఉన్న ఇంధనాన్ని మండించి ప్రొసిజర్‌ స్టార్‌ చేశారు. ఒక్కసారి ఇంజిన్ల నుంచి థ్రస్ట్‌ మొదలై.. చంద్రుడి ఉపరితలంవైపు విక్రమ్‌ దూసుకుకపోవడం ప్రారంభమైంది. ఆ టైమ్‌లో ల్యాండర్‌ స్పీడ్‌ సెకనుకు 1.68 కిలోమీటర్లు ఉంది. అంటే గంటకు దాదాపు 6 వేల 48 కిలో మీటర్ల వేగం. మనం మాములుగా ప్రయాణించే విమానం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ. ఈ సమయంలో చంద్రుని ఉపరితలానికి దాదాపుగా అడ్డంగా ఉంది ల్యాండర్‌. దీనిని రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగింది.

ఈ 11 నిమిషాల్లో చంద్రుడి ఉపరితలానికి 6.8 కిలో మీటర్ల ఎత్తుకు చేరుకుంది విక్రమ్. ఆ తర్వాత వెంటనే ల్యాండర్‌ తన 4 ఇంజిన్లలో రెండు ఇంజిన్లను ఆఫ్‌ చేసేసింది. మరో రెండు ఇంజిన్లనే ఉపయోగించుకుని వేగాన్ని తగ్గించుకుంది. రివర్స్‌ థ్రస్ట్‌తో మరింత కిందకు వచ్చేందుకు ప్రయత్నించింది. ఇదే “ఫైన్ బ్రేకింగ్‌ ఫేజ్‌”.


ఫైన్‌ బ్రేకింగ్ దశలో ల్యాండర్‌ పొజిషన్ మారింది. ల్యాండర్ 90 డిగ్రీలు వంపు తిరుగింది. అప్పటి వరకు ఉపరితలానికి అడ్డంగా ఉన్న ల్యాండర్‌.. నిలువు పొజిషన్‌లోకి అంటే ల్యాండ్‌ కావడానికి అనుకూలంగా ఉండే కోణంలోకి వచ్చేసింది. ఈ సమయంలో కూడా ల్యాండర్‌ రెండు ఇంజిన్లు మండుతూనే ఉన్నాయి.

చంద్రయాన్‌-2లో ఇక్కడే మిస్టేక్ జరిగింది. ఫైన్‌ బ్రేకింగ్‌ ఫేజ్‌లోనే చంద్రయాన్‌-2 అదుపు తప్పింది. కానీ గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. ఈ సారి మళ్లీ అదే మిస్టేక్ జరగకుండా చర్యలు తీసుకుంది. ఈ సారి ఎలాంటి పొరపాట్లకు ఛాన్స్‌ లేకుండా ఫైన్‌ బ్రేకింగ్‌ దశను దాటేంచేశారు మన ఇస్రో సైంటిస్టులు.

ఫైన్‌ బ్రేకింగ్‌ ఫేజ్‌లో క్రమంగా ల్యాండర్‌ స్పీడ్ తగ్గుతూ వచ్చింది. సరిగ్గా చంద్రుడి ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ ఆగిపోయింది. ఇది మరింత క్రూషియల్ ఫేజ్‌ అని చెప్పాలి. ఇక్కడే విక్రమ్ సరైన ల్యాండింగ్ ప్లేస్‌ కోసం సెర్చ్ చేసింది.

ఒక్కసారి ల్యాండింగ్‌ సైట్‌ను కన్‌ఫామ్ చేసుకున్నాక.. చంద్రుడి ఉపరితలంపై 150 మీటర్ల ఎత్తులో ల్యాండర్ మరోసారి ఆగింది. తన సెన్సార్లతో స్కాన్ చేస్తూ.. కెమెరాలతో ఫోటోలు తీస్తూ.. ఏదైనా ప్రమాదం ఉందా? ల్యాండింగ్‌కు సైట్ అనుకూలమేనా? అని నిర్దారించుకుంది. అంతా ఓకే అనుకున్నాక.. రెండు ఇంజిన్లను మండిస్తూ చంద్రుడిపై క్షేమంగా ల్యాండ్ అయింది విక్రమ్‌ ల్యాండర్‌. సేఫ్‌ ల్యాండింగ్‌ తర్వాత అప్పటి వరకు భగభగ మండిన విక్రమ్ ఇంజిన్లు ఆగిపోయాయి.

ఈ ప్రక్రియలో చంద్రుడిపై దుమ్మురేపింది విక్రమ్. ఆ దుమ్ము, ధూళి మొత్తం క్లియర్ అయ్యాక.. విక్రమ్ ల్యాండర్ తలుపులు తెరుచుకుంటాయి. ఇది ల్యాండింగ్ అయిన రెండు గంటల తర్వాత జరుగుతుంది. అందులో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ మెల్లగా కిందకు దిగుతుంది. రోవర్ చంద్రుని ఉపరితలంపై చుట్టూ తిరుగుతూ.. అక్కడ ఫోటోలను తీస్తుంది. దీంతో ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టించడమే కాకుండా.. జాబిల్లి రహస్యాలను వెలుగులోకి తీసుకురానుంది. ల్యాండర్‌, రోవర్‌.. 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తాయి.

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×