BigTV English

CM Revanth Reddy: రేవంతా మజాకా.. ప్రతి జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూల్

CM Revanth Reddy: రేవంతా మజాకా.. ప్రతి జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూల్

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించారు సీఎం. ట్రై కమిషనరేట్ల పరిధిలో కెమెరాలను లింక్ చేయబోతున్నారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణంపై సీఎం దిశానిర్దేశం, జనంలో నమ్మకం పెరిగేలా ప్రభుత్వాసుపత్రులకు బ్రాండింగ్ కల్పించే దిశగా ముందడుగు, జిల్లాకు 30 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ నిర్వహణ, నితిన్ గడ్కరీతో సీఎం భేటీ.. ఈ వారం కీ ఫ్యాక్టర్ గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


04-05-2025 ఆదివారం ( ఇక సర్కారీ ప్రీ ప్రైమరీ స్కూల్ )

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాలను ఎంపిక చేయనున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్చించారు. ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఈ ప్రీప్రైమరీలో ఎలాంటి విద్యాభ్యాసాలు, యాక్టివిటీస్ ఉండాలో విద్యాశాఖ అధికారులు చర్చించారు. 33 జిల్లాలకుగానూ 990 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక్కో దాంట్లో కనీసం 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. సో పేదల పిల్లలకూ నర్సరీ, LKG, UKG అందుబాటులోకి రానుంది.


05-05-2025 సోమవారం ( RRRకు అనుమతి కోసం )

రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన నేపథ్యంలో, వీలైనంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలను ఏకకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు. బేగంపేట విమానాశ్రయంలో ఈనెల 5న గడ్కరీతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి అవసరాన్ని సీఎం ఈ సందర్భంగా కేంద్రమంత్రికి వివరించారు. అంతే కాదు హైదరాబాద్ – శ్రీశైలం సెక్షన్‌లో మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్ – అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

VO: 05-05-2025 సోమవారం ( మిస్ వరల్డ్ పోటీలకు టైట్ సెక్యూరిటీ)

తెలంగాణ ఖ్యాతిని విశ్వమంతటికీ పరిచయం చేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 116 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వారికి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది విదేశీ మీడియా ప్రతినిధులు, అతిథులు రాబోతున్నారన్నారు. విదేశీ అతిథులు బస చేసే హోటళ్ల దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు.

06-05-2025 మంగళవారం ( 50 ఏళ్ల అవసరాలకు ప్లానింగ్ )

ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా.. భవిష్యత్ అవసరాలపై ఫోకస్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తాజాగా తెలంగాణలో రాబోయే 50 ఏళ్ల అవ‌స‌రాల‌కు తగ్గట్లుగా రీజినల్ రింగ్ రోడ్డు, రేడియ‌ల్ రోడ్లు, ఇత‌ర రోడ్ల నిర్మాణం, జంక్షన్లు, వాటి మధ్య లింకప్ ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ సౌత్ పార్ట్ కు సంబంధించిన అలైన్‌మెంట్‌ను ప‌రిశీలించిన ముఖ్యమంత్రి ప‌లు మార్పులు సూచించారు. ఈనెల 7న జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం RRR రోడ్లపై రివ్యూ చేశారు. ఆర్ఆర్ఆర్ సౌత్‌ కు సంబంధించిన అలైన్‌మెంట్‌కు సంబంధించి అట‌వీ ప్రాంతం, జ‌ల వ‌న‌రులు, మండ‌ల కేంద్రాలు, గ్రామాల విష‌యంలో ముందుగానే లైడార్ స‌ర్వే చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

అలైన్‌మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పొరపాట్లకు తావు ఇవ్వొదన్నారు. టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు తగ్గట్లుగా రేడియ‌ల్ రోడ్లకు రూప‌క‌ల్పన చేయాల‌న్నారు. హైద‌రాబాద్ – శ్రీ‌శైలం నేషనల్ హైవేపై ఎలివేటెడ్ కారిడార్‌, కొత్త అలైన్‌మెంట్‌కు సంబంధించి సీఎం సూచ‌న‌లు చేశారు. రాజీవ్ ర‌హ‌దారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వ‌ర‌కు కొత్త రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆల్టర్నేట్ అలైన్‌మెంట్‌ను సాధ్యమైనంత త్వర‌గా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.
ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూల‌త‌ల‌ను ప‌రిశీలించాల‌న్నారు.

VO: 06-05-2025 మంగళవారం ( తెలంగాణ-స్విట్జర్లాండ్ ఇన్వెస్ట్ మెంట్ )

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్విట్జర్లాండ్ తెలంగాణ మధ్య స్నేహపూర్వక భాగస్వామ్యం, పారిశ్రామిక సహకారం, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి.

06-05-2025 మంగళవారం ( ప్రభుత్వాసుపత్రులకు బ్రాండింగ్ )

ప్రభుత్వ హాస్పిటల్స్ పై జనంలో నమ్మకం పెంచేలా రేవంత్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్‌ చేసి వైద్య సేవల్లో మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల 6న జూబ్లీహిల్స్‌ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ఉన్నతాధికారులతో వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగేలా వాటికి ప్రచారం కల్పించడం, బోధనాసుపత్రులు, కొత్తగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు దశలవారీగా బ్రాండింగ్‌ చేయడంపై కీలకంగా మారాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నట్లుగానే ఫైర్ సేఫ్టీ, కరెంట్, సీసీ టీవీల నిఘా, సెక్యూరిటీ అవుట్‌ పోస్టుల ఏర్పాటు, రెడ్‌ అలారం, ఫ్రంట్ హెల్ప్ డెస్క్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.

07-05-2025 బుధవారం ( టైట్ సెక్యూరిటీ )

భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ లో సెక్యూరిటీ టైట్ అవుతోంది. ఏ చిన్న ఛాన్స్ కూడా తీసుకోకుండా ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. సీఎం రేవంత్ ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. ఈనెల 7న స్వయంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సిటీలో నిరంతరం నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సాగుతున్న పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచనలు చేశారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కు లింక్ చేయడంతో పాటు పర్యవేక్షణ రెగ్యులర్ గా ఉండాలన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాలతో తాజా పరిణామాలను సమీక్షించిన సీఎం ఇలాంటి సందర్భాల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

08-05-2025 గురువారం ( సైన్యానికి మద్దతుగా ర్యాలీ )

భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీకి తామున్నామని చెప్పడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అని, భారతీయ వీర జవాన్లకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సీఎం రేవంత్ ఈనెల 8న ముందుండి ర్యాలీ నిర్వహించారు. తమ శాంతి ఆకాంక్షను, చేతగాని తనంగా ఎవరైనా భావిస్తే, భారత భూ భాగంలో కాలుమోపితే ఎలా ఎదుర్కోవాలో తెలుసన్నారు.

08-05-2025 గురువారం ( హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం )

చెరువులు, సహజ వనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ప్రస్థానంలో మరో కీలక ముందడుగు పడింది. తాజాగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. అలాగే వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్పందించేందుకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుతున్నాయి. పేదోళ్ల పట్ల మానవీయ కోణం, పెద్దోళ్ల పట్ల కఠినంగా వ్యవహరించేలా ఉండాలని హైడ్రాకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 8న హైడ్రా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. హైడ్రాకు కేటాయించిన 122 వివిధ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

సహజ వనరులు, సంపద కాలగర్భంలో కలిసిపోతున్న టైంలో హైదరాబాద్ ను పునరుద్ధరించాలన్న ఆలోచనతోనే హైడ్రాను ప్రారంభించామని ఈ సందర్భంగా సీఎం వివరించారు. హైడ్రా విషయంలో ఉన్న అపోహలను తొలగించడం, ఆ శాఖపై ఉన్న సామాజిక బాధ్యతను జనానికి వివరించడం, సహా తన భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ పంచుకున్నారు. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయని, అలాంటి ఉపద్రవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్ నగరం కూడా వాటి జాబితాలో చేరుతుందన్నారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరంపై ప్రజలే అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు.

9-05-2025 శుక్రవారం ( నెక్ట్స్ లెవెల్ డెవలప్ మెంట్ )

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిక్సూచిగా మారుతున్నాయి. నెట్ జీరో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఇలాంటివి కొత్త జనరేషన్ ఐడియాస్ గా మారాయి. వీటి గురించి తాజాగా సీఎం రేవంత్…, హిందూ పేపర్ నిర్వహించిన ది హిందూ హడిల్స్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సమాధానాలిచ్చారు. పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చైనా ప్లస్ వన్.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. నెట్ జీరో సిటీ ప్రణాళికలు, ఈవీలపై పన్ను రద్దు, డ్రైపోర్టు నిర్మాణానికి ప్రయత్నాలు, 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన విషయం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తొలి ఏడాదిలోనే 59 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలోని 105 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం ఇవన్నిటిపై క్లారిఫికేషన్ ఇచ్చారు.

09-05-2025 శుక్రవారం ( దేశం కోసం విరాళం )

తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు X వేదికగా ప్రకటించారు. మన బలగాల అసమాన సేవలకు చిన్న సహకారంగా, ఒక భారతీయుడిగా తాను ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందిస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ లక్ష్యంలో భాగస్వాములు కావాలని అందరికీ పిలుపునిచ్చారు.

09-05-2025 శుక్రవారం ( ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్ కు గ్రీన్ సిగ్నల్ )

తెలంగాణ ప్రభుత్వం వైద్య సిబ్బందికి మరో గుడ్‌న్యూస్ తెలిపింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 9న నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిమ్స్ 2024 ప్రగతి నివేదికను దామోదర రాజనర్సింహకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అందజేశారు. నిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు, ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని అన్నారు. ఏడాదిలో పెద్ద సంఖ్యలో రొబొటిక్ సర్జరీలు జరిగినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో నిమ్స్ డాక్టర్లు, స్టాఫ్‌ పదేళ్ల ఆకాంక్ష నెరవేరింది. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు‌ చికిత్స చేసినందుకుగానూ వచ్చే డబ్బుల్లో 35 శాతం ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం అందజేయనుంది. 2023 కంటే 2024లో అవుట్ పేషెంట్ల సంఖ్య 12.6 శాతం పెరిగింది. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన పేషెంట్ల సంఖ్య 22.4 శాతానికి పెరిగింది.

10-05-2025 శనివారం ( అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు ) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్లాన్ చేసిన మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 110కి పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు యువతులు వచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ కు గ్లోబల్ అటెన్షన్ సాధించి పరోక్షంగా 15 వేల కోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకుంది. ముఖ్యంగా రూరల్ టూరిజానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలను అవకాశంగా మలచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గ్రామీణ, సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవాన్ని చాటిచెప్పడానికి ప్రణాళికలు రెడీ చేసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్‌ వరల్డ్‌ పోటీల ఈవెంట్‌లో రాష్ట్రంలోని గ్రామీణ పర్యాటకాన్ని హైలైట్‌ చేయనున్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కీలకమైన కార్యక్రమాలు ఈ నెల 17 నుంచి మొదలుకానున్నాయి. హైదరాబాద్ వచ్చిన పోటీదారులు ఈ వారమంతా రెండు బృందాలుగా విడిపోయి తెలంగాణలోని కీలక టూరిజం ప్రాంతాల్లో పర్యటిస్తారు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×