Govt Schemes: మీకు కొత్తగా వివాహం అయిందా? కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయబోతున్నారా? ముందు భవిష్యత్ ఎలా అంటూ ఆలోచనలో పడ్డారా.. అయితే ఈ స్కీమ్స్ గురించి తెలుసుకోండి. మీ లైఫ్ సాఫీగా సాగించండి. అంతేకాదు ఈ స్కీమ్స్ తో కోటీశ్వరులు కండి. ఇంతకు ఈ స్కీమ్ లు అమలు చేస్తున్నది ఎవరో కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం.
టెన్షన్ వద్దు..
పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే దంపతులకు ఆర్థిక భద్రత ఎంతో అవసరం. ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో కొత్తగా పెళ్లైన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని స్కీములు భవిష్యత్తులో ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి. ఇవి నేరుగా పెళ్లి ఖర్చులకు కాకపోయినా, లైఫ్ సెటిల్ కోసం ఉపయోగపడే పథకాలు కావడం విశేషం.
మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం..
సుకన్య సమృద్ధి యోజన అనే పథకం బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించబడిన పొదుపు పథకం. 10 ఏళ్ల లోపు అమ్మాయి పేరుతో ఖాతా తెరిచి పెళ్లి సమయంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ రేటుతో మంచి ఆదాయం పొందవచ్చు.
మీ సొంతింటి కల..
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) ద్వారా కొత్తగా పెళ్లైన దంపతులు తమ మొదటి ఇంటి కొనుగోలు కోసం గృహ రుణం తీసుకుంటే వడ్డీపై రూ.2.67 లక్షల వరకు సబ్సిడీ లభించవచ్చు. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి, పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగాల్లో ఉన్న వారు తమ EPF ఖాతా నుండి పెళ్లి కోసం కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకొనే అవకాశముంది. తమ పెళ్లికైనా, సోదరుడు, సోదరి, పిల్లల పెళ్లికైనా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు.
కొందరు దంపతులు పెళ్లి తర్వాత వ్యాపార ఆరంభానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వారికి ముద్రా యోజన పథకం ఒక వరం. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఫ్రీ లోన్ పొందవచ్చు. అలాగే మహిళలకు ప్రత్యేకంగా స్టాండ్ అప్ ఇండియా ద్వారా రూ.1 కోటి వరకు లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇలా కేంద్రం అందిస్తున్న పథకాలు పెళ్లి తరువాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడతాయి.
సరైన సమయంలో సరైన పథకాన్ని వినియోగించుకుంటే చాలు, మీ లైఫ్ సెటిల్. మరెందుకు ఆలస్యం.. కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు కదా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయండి. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్స్ మీకోసమే. ఇంకా మీకు లబ్ది కలిగించే పథకాల గురించి తెలుసుకోవాలా? అయితే స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాలను సంప్రదించండి. కేంద్రంకు తోడు రాష్ట్రాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోండి.