E-Paper
Advertisement

Nara Lokesh: దీపక్‌రెడ్డిది తొందరపాటా..? ఇరకాటంలో పడ్డ టీడీపీ

Nara Lokesh: దీపక్‌రెడ్డిది తొందరపాటా..? ఇరకాటంలో పడ్డ టీడీపీ
Advertisement

Nara Lokesh: అధినేత.. చినబాబు కంట్లో పడి పదవులు పొందాలని టిడిపి నేతలు నిత్యం ఆరాటపడుతున్నారు.. ఆ పార్టీ అధికార ప్రతినిధులు అయితే మరో అడుగు ముందుకేసి టీవీ డిబేట్లో అధినేత వద్ద మార్కులు పడాలని శృతి మించి పరిధి దాటి మరి వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఆ వ్యాఖ్యలు వారితోపాటు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఇటీవల నేషనల్ ఛానల్లో డిబేట్లో జరిగిన వ్యవహారం.. తెలుగుదేశం పరువు దేశవ్యాప్తంగా మంట కలిపడమే కాక పార్టీకి తీరని నష్టం కలిగించిందంట.. అందుకే రాష్ట్రప్రభుత్వానికి సంబంధంలేని విషయంలో వేలు పెట్టి లేనిపోని వివాదాన్ని కొని తెచ్చుకున్నామని పార్టీ నేతలపై చంద్రబాబు ఫైర్ అయ్యారంట.. అసలింతకీ ఆ టీవీ డిబేట్‌లో ఏం జరిగింది?

లోకేశ్ విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్నారన్న దీపక్ రెడ్డి
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్నారంటూ టీడీపీ అధికార ప్రతినిధి, సీడాప్ చైర్మన్ జి.దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీశాయి. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయంపై ప్రస్తుతం తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సమస్యపై ప్రముఖ జాతీయ చానల్ రిపబ్లిక్ టీవీలో డిబేట్ జరిగింది. ఈ చర్చా కార్యక్రమానికి టీడీపీ తరఫున సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి హాజరయ్యారు. ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై ఈ చర్చ సాగింది. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న దీపక్ రెడ్డిని ప్రయాణికుల భద్రతపై స్పందించాల్సిందిగా డిబేట్ నిర్వహిస్తున్న ప్రముఖ జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి కోరారు.

Advertisement

సంక్షోభ నివారణకు లోకేష్ పనిచేస్తున్నారని దీపక్ వ్యాఖ్య
ఈ విషయంపై స్పందించిన దీపక్ రెడ్డి.. తమ పార్టీ నేత, మంత్రి నారా లోకేశ్ సంక్షోభం నివారణకు పనిచేస్తున్నారంటూ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. లోకేష్ అత్యావసరంగా వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారని దీపక్ రెడ్డి చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్నబ్ గోస్వామి.. మంత్రి నారా లోకేశ్ కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కాదు కదా? అంటూ ప్రశ్నించడంతో టీడీపీ అధికార ప్రతినిధి కంగుతినాల్సివచ్చిందనే టాక్ నడుస్తుంది.

రాజకీయంగా సంచలనం రేపిన దీపక్‌రెడ్డి వ్యాఖ్యలు
నారా లోకేశ్ ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలన్న ఉద్దేశమో లేక ఆయన కూడా ఇండిగో సంక్షోభం నివారణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి పనిచేస్తున్నారని చెప్పాలని అనుకున్నారో ఏమోకానీ.. దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. లోకేశ్ పర్యవేక్షిస్తున్నారని చెప్పిన దీపక్ రెడ్డి, ఆర్నబ్ గోస్వామి అభ్యంతరం చెప్పిన తర్వాత కూడా తాను చేసిన పొరపాటును గ్రహించలేదనే విషయాన్ని పార్టీలో కొందరు నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఇంగ్లీష్ మీడియాలో డిబేట్లకు హాజర్యయే టీడీపీ నేతల్లో దీపక్ రెడ్డి ఒకరు. విద్యావంతుడు అయిన ఆయన గతంలో కూడా ఇలా డిబేట్లకు వెళ్లి సమర్థంగా వాదన వినిపించారు.

Advertisement

అయితే దీపక్‌రెడ్డిఇండిగో ఇష్యూలో గందరగోళానికి గురయ్యారనే టాక్ పార్టీలో నడుస్తుందట. లోకేష్ మానిటర్ చేస్తున్నారని చెప్పడంతో ఇష్యూ మొత్తం టీడీపీ మెడకు చుట్టుకున్నట్లైందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. అసలు నారా లోకేష్ కు ఏం సంబంధం అని ఆయన ఆలోచించలేకపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పటికి లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అయినా ఎవరి పనులు వారికి ఉంటాయి. రామ్మోహన్ నాయుడు తన శాఖను తాను నిర్వహించగల సమర్థుడు. ఎవరూ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అది కన్వే చేయాల్సిన దీపక్ రెడ్డి తడబడ్డారా..లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా అనేది మిలినియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఇండిగో విషయంలో కేంద్రంపై ప్రయాణికుల్లో వ్యతరేకత
ఫలితంగా మొత్తం అదొక్కటే అందరికీ పెద్ద ఆయుధంగా మారిందనే చర్చ నడుస్తుందట. ఆర్నాబ్ షోలో ఆయన ఇరుక్కోవడం ద్వారా.. టీడీపీ ఇబ్బంది పడింది. నిజానికి ఆయన ఇలా ఆడుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు. ఇండిగో విషయంలో కేంద్రంపై ప్రయాణికుల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో.. ఇష్యూను సాల్వ్ చేయలేకపోయారనే విషయాన్ని వ్యక్తం చేసే క్రమంలో డిబెట్‌లో పాల్గొన్న దీపక్ రెడ్డిని ప్రశ్నలు అడిగిన సందర్భంలో దీపక్ రెడ్డి చేప్పిన సమాధానం కాంట్రవర్సీగా మారడంతో టీడీపీ రాజకీయంగా సమాధానం చేప్పుకోవాల్సిన పరిస్ధితి వచ్చిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుందట.

ఆర్నబ్ ప్రశ్నలను హైలెట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా
జాతీయ మీడియా లేదా లోకల్ మీడియాపై ఆరోపణలు చేయడం.. లేదా విమర్శలు చేయడం ఎప్పటికైనా మిస్ ఫైర్ అవుతుంటాయి. రామ్మోహన్ నాయుడు ఈ సంక్షోభంలో మంచి పనితీరు కనబరిచారనేది విశ్లేషకులు చేప్పే మాట. కానీ టీడీపీ నేతలు చేసిన పని వల్ల ఆయన పనితీరు బాగో లేదన్న భావనను ఆర్నాబ్ ద్వారా బయటకు రావడమే వివాదంగా మారిందట. జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి వేసిన ప్రశ్నలను వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది. రామ్మోహన్ నాయుడును కీలు బొమ్మ చేశారనే విధంగా టీడీపీ కార్నర్ చేసేందుకు ప్రయత్నించింది. టిడిపి నేతలు ఇప్పటికైనా తమ పరిధి.. తమ విధానంపై సమగ్రంగా చర్చించుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే తప్పులేదు… లేకపోతే మీడియా చేతిలో ఆ నేతతో పాటు ఆ పార్టీ పరువు కూడా రోడ్డున పడుతుందనే విషయాన్ని నేతలు గ్రహించాలనేది విశ్లేషకులు మాట.

Also Read: ఇంద్రకీలాద్రిపై భవానీల దీక్ష విరమణ.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

అది తెలిసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారంట. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని ‘ఇండిగో విమానాల రద్దు ’ అంశంపై రిపబ్లిక్ టీవీ ఛానల్‌తో అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని ఆయన అభిప్రాయపడుతున్నారు, వివాదం పెద్దదయ్యే వరకు తన ద‌ృష్టికి తేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. అపవసరంగా చిన్న వషయాన్న పెద్దది చేశారని .. ఛానల్‌ని బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదాన్ని మరింత పెద్దది చేశారని దీపక్‌రెడ్డిని మందలించారంట. చర్చల్లో ఇండిగో అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అది కేంద్ర పరిధిలో అంశమని, వారు చూసుకుంటారని చెపితే సరిపోయేదని సీఎం సూచించారంట. మరి చూడాలి ఈ వివాదంలో మున్ముందు ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో?

Story By Rami Reddy, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×