E-Paper
Advertisement

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?
Advertisement

Rohingya Refugees: జూన్ 29 మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం. చుట్టూ భయం వారి భవిష్యత్తంతా చీకటి. అయినా బతకాలనే ఆశతో రెండు బోట్లలో సముద్ర ప్రయాణం మొదలుపెట్టారు 530 మంది రోహింగ్యా శరణార్థులు. ఒక బోటులో 250 మంది మరో బోటులో 280 మంది. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే.

కొన్ని గంటల్లోనే..

వాళ్ల ప్లాన్ సింపుల్. ముందు థాయిలాండ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మలేషియా వెళ్లాలి. అక్కడైనా ప్రశాంతంగా బతుకుతామన్న ఆశ. కానీ కొన్ని గంటల్లోనే ఒక బోటుతో కాంటాక్ట్ పూర్తిగా కట్ అయింది. మరో బోటు కూడా కొద్ది రోజులకే సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆ బోట్ల జాడే లేదు.

విషాదానికి కారణం

Advertisement

ఆ సమయంలో బంగాళాఖాతంలో మాన్‌సూన్ తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు ఈదురుగాలులు రాకాసి అలలు. వీటికి తోడు స్మగ్లర్స్ ఉపయోగించిన పాత బోట్లు మధ్యలో ఇంజన్ ఫెయిల్యూర్ కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించడం ఇవన్నీ కలిసి ఈ భారీ విషాదానికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also read: హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

సెర్చ్ ఆపరేషన్..

Advertisement

ప్రమాదం జరిగి వారాలు గడుస్తున్నా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరగలేదు. అయితే బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు కొట్టుకొచ్చిన కొన్ని మృతదేహాలను స్థానిక మత్స్యకారులు గుర్తించారు. దీంతో రెండు బోట్లు సముద్రంలో మునిగిపోయాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

2017లో జరిగిన..

ఆ దేశంలో ఉన్న పరిస్థితులే రోహింగ్యాలను ఇంత పెద్ద రిస్క్ చేసేలా చేశాయి. 2017లో జరిగిన హింస తర్వాత లక్షలాది మంది తమ ఇళ్లు వదిలి పారిపోయారు. ఇప్పటికీ దాదాపు 12 లక్షల మంది బంగ్లాదేశ్ శిబిరాల్లోనే జీవిస్తున్నారు. మరో 6లక్షల మంది మయన్మార్‌లోనే ఉన్నారు.

వేలాది మంది..

ఇటీవల వారికి అంతర్జాతీయ సహాయం తగ్గడంతో తిండి కూడా కష్టమైంది. యువకులను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు పోతాయన్నా భయం ఒకవేళ బతికితే కొత్త జీవితం దొరుకుతుందనే ఆశతో వేలాది మంది ఇలాంటి ప్రమాదకరమైన సీ రూట్స్‌నే ఎంచుకుంటున్నారు.

Storey By: Anup Big Tv

Also read: Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×