Big Stories

Pawan Kalyan Vs Dwarampudi: పవన్ పంజా దెబ్బ.. ద్వారంపూడిలో దడ..?

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జగన్ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ప్రజల్లోకి తీసుకువెళట్టంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హవా, చేస్తున్న అక్రమాలు, అదని అనుచరులు చేస్తున్న దోపిడీ‌పై ఆయన తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. అది పెద్ద కలకలమే రేపింది. దాంతో పవన్‌ని టార్గెట్ చేసిన వైసీపీ పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డింది.

- Advertisement -

అందులో భాగంగా కాపులను జన సేనకు దూరం చేయడానికి ముద్రగడ ను తెర పైకి తీసుకొచ్చింది. రాజకీయంగా ఏ ఉపాధి లేని ముద్రగడ పద్మనాభం కూడా ప్రచారంలో పవన్‌పై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకున్నారు. తనను తాను కాపుల పెద్దగా ఊహించుకుంటూ లేనిపోని సవాళ్లు చేసి ద్వారంపడి చంద్రశేఖర్‌రెడ్డిని వెనకేసుకొచ్చి ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మిగిలిపోయారు.

Also Read: “రాష్ట్రం నీ తాత జాగీరా” : జగన్ పై మంత్రి లోకేశ్ ఆగ్రహం

ఇక ద్వారంపూడి అయితే పవర్ స్టార్‌పై సినీ స్టైల్లోనే ఛాలెంజ్‌లు విసిరారు. పవన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దాంతో అప్పట్లో అందరిలో ఒకింత గందరగోళం కనిపించింది. ద్వారంపూడి పిఠాపురంలో ముద్రగడతో కలిసి తిరుగుతుండటం. అక్కడే ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఏదో చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి

ప్రధానంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, మిగిలిన వైసిపి శాసనసభ సభ్యుల పట్ల ద్వారంపూడి వ్యవహరించిన తీరుపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. పెన్షనర్ల పెరడైజ్ గా పేరుగాంచిన కాకినాడ నగరాన్ని గంజాయికి , మత్తు పదార్థాలలకు అడ్డాగా మార్చి కాకినాడపోర్ట్ ద్వారా అక్రమ రావణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

సీన్ కట్ చేస్తే.. పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమన్న ద్వారంపూడి కాకినాడ సిటీలో 56.5వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. జనసేన దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్నిచోట్ల గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రోల్స్ నడుస్తున్నాయి. అసెంబ్లీ గేటు తాకనియ్యనన్నారు కదా. మనల్నెవడ్రా ఆపేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇపుడు ద్వారంపూడి భవిష్యత్ ఏంటన్నది హాట్ టాపిక్‌గా మారింది. జగన్ ప్రభుత్వంలో తూర్పు గోదావరి సీఎంగా చలామణి అయిన ద్వారంపూడి విషయంలో పవన్ ఎలాంటి వైఖరి అవలంభిస్తారనేది జిల్లా నేతల్లో ఉత్కంఠ రేపుతోంది.

Also Read: Minister Parthasarathi: శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్‌లో నిర్ణయించాం: మంత్రి పార్థసారథి

గత వైసిపి ప్రభుత్వ పాలన లో కాకినాడ నగరం లో జనసేన నాయకులు, జన సైనికులు, వీరమహిళలు జగన్ ప్రభుత్వవిధానాలపై పోరాటాలు చేశారు. ఆ సందర్భంగా ద్వారంపూడి అనుచరులు వారిపై దాడులకు పాల్పడ్డారు. ఆ దాడులను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించి.. జనసైనికులకు, వీర మహిళలకు భరోసా కల్పించి.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక తన ఎన్నికల ప్రచారాన్ని కూడా కాకినాడలోనే ముగించి ద్వారంపూడిని ఎంత పర్సనల్‌గా తీసుకున్నారో చెప్పకనే చెప్పారు జనసేనాని.

ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబులు తమ హయాంలో కక్ష సాధింపు చర్యలుండవని చెప్తున్నారు. అయితే అవినీతికి పాల్పడిన వారిని, తప్పు చేసిన వారిని మాత్రం విడిచి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ద్వారంపూడిపై అక్రమాలు, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్ దందాలు.. ఇలా చాలా ఆరోపణలే ఉన్నాయి. దాంతో పవన్ ద్వారంపూడి విషయంలో పవన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News