BigTV English

Telangana: ధరణి అదే..‘ధోరణి’..

Telangana: ధరణి అదే..‘ధోరణి’..
  • ధరణి అక్రమాల ప్రక్షాళనకు నడుం బిగించిన కాంగ్రెస్ సర్కార్
  • స్పెషల్ డ్రైవ్ పేరిట దరఖాస్తుల పరిశీలన వేగవంతం
  • అధికారుల అత్యాశతో మళ్లీ మొదటికొస్తున్న వ్యవహారం
  • స్లాట్ బుకింగ్ లకు రేట్లు నిర్ణయిస్తున్న అధికారులు
  • పైసలిస్తేనే పనులు జరుగుతాయంటున్న సామాన్యులు
  • రాజకీయ నేతలు, దళారులు, వ్యాపారులకు మాత్రమే అవుతున్న పనులు
  • జిల్లా కలెక్టర్ మారినప్పుడల్లా మళ్లీ మొదటికే వస్తున్న వ్యవహారం
  • పెండింగ్ ఫైల్స్ తిప్పిపంపేస్తున్న అధికారులు

Dharani applications all are pending due to the officials corruptions


బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి అక్రమాల పుట్టగా తయారయింది. అందుకే కాంగ్రెస్ సర్కార్ ధరణి ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అయితే భూ సమస్యలు పరిష్కరించేందుకు పారదర్శకంగా ధరణి పోర్టల్‌ను తీర్చిదిద్దినా ..వివిధ దశల్లో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే దాదాపు 61,019 దరఖాస్లులు పెండింగ్ లో ఉన్నాయి. వరుస ఎన్నికలకు తోడు రెవెన్యూ అధికారుల బదిలీ, కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపక పోవడంతో దరఖాస్తుల సంఖ్య పేరుకుపోయింది. కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు.. ఫైల్స్‌ అన్నీ తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు మరోపక్క ధరణి సమస్యలను పరిష్కరించాలని సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

ప్రతి స్లాట్ బుకింగ్ కూ ఓ రేటు


వ్యవసాయ భూముల రక్షణకు తీసుకువచ్చిన ధరణి చట్టం రైతుల పాలిట శాపంగా మారింది. అయితే ఇందులో మార్పులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చట్టంలోనే కాదు దానిని అమలు చేసే అధికారుల్లో అక్రమార్కులు తయారయ్యారు. అందులోని లోసుగులను అనుకూలంగా మల్చుకొని రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు ప్రతి స్లాట్ బుకింగ్ కు ఒక రేటుగా నిర్ణయించి కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా అధికారులు దండుకుంటున్నట్లు తెలిసింది. కిందిస్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు పైసలిస్తేనే పనులు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వీణవంక రెవెన్యూ కార్యాలయంలో ఓ మహిళ అమెరికాలో ఉండగా ఆమెకు చెందిన 22 గంటల భూమిని ఫోర్జరీ చేసి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని ధరణి ఆపరేటర్ భూమి కొనుగోలు చేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు అయింది .ఈ విషయంలో తహశీసిల్దార్ తిరుమల రావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ,ధరణి ఆపరేటర్ అరుణ్ లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.ధరణి సెక్షన్లో కొన్ని జిల్లాలలో అన్ని రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో రాజకీయ నేతలు, దళారులు, వ్యాపారులకు మాత్రమే పనులు సాఫీగా సాగుతున్నాయి. సామాన్యులకు చుక్కెదురే అవుతుంది. నెలల తరబడి తిరిగినా ఫైల్ కదడం లేదు. అసలు సమస్య ఏమిటో ఎవరు చెప్పరు. ఐదు గుంటల కోసం స్లాట్ బుక్ చేస్తే చేయరాదు అంటూ కొర్రీలు పెట్టి వారి దగ్గర డబ్బులు గుంజుతారు.

అధికారులు మారితే అంతేనా..

కలెక్టర్లు లేదా ఇతర రెవెన్యూ అధికారులు మారితే చాలు.. ఫైౖల్స్‌ అన్నీ తిరిగి వెనక్కీ పంపించేస్తున్నారు. శాసన సభ ఎన్నికల సమయంలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లు మారారు. కొత్త కలెక్టర్‌ వచ్చినప్పుడల్లా ధరణి దరఖాస్తులను తిరిగి వెనక్కీ పంపించేస్తుంటారు. అలాగే రెవెన్యూ ఉన్నతాధికారులు మారినప్పుడు కూడా ఇలానే జరుగుతోంది. ఇప్పటి వరకూ కలెక్టర్లు మారినప్పుడల్లా ఫైౖల్స్‌ తిరిగి పంపిండంతో తహసీల్దారు స్థాయిలో ధరణి దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

తెలంగాణ పరిధిలో అనేక జిల్లాలలో వేలసంఖ్యలో భూ సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో ధరణి దరఖాస్తుల అమోదం, తిరస్కరణలకు సంబంధించి కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలను విభజించారు. మండలాల వారీగా స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి తహసీల్దార్లు నాలుగు రకాల మాడ్యుళ్లకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. అసైన్డ్‌ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు, తదితర సమస్యలను తహసీల్దార్లు పరిశీలించనున్నారు. మరికొన్ని సమస్యలను ఆర్డీవో పరిష్కరించనున్నారు. ధరణిలో తప్పొప్పుల సవరణ, నిషేధిత జాబితా, దస్త్రాల ఆధునికీకరణ తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను మండల, జిల్లా స్థాయిలోనే పరిష్కరించేలా అదేశాలిచ్చినా… ఫలితం లేకుండా పోతుంది.

Tags

Related News

BJP: బీజేపీపై కొండ సెటైర్లు.. ఫ్లవర్ కాదు ఫైర్

Telangana Politics: రాజకీయాలకు దూరంగా జగ్గారెడ్డి.. అసలు ఏమైంది..!

AP Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం స్కామ్.. వెనుకుంది వాళ్లేనా..

AP Politics: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు వార్నింగ్..

AP Politics: జగన్ నర్సీపట్నం టూర్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Huzurabad Politics: నా సెగ్మెంట్‌లో నీకేం పని.. బండిపై రగిలిపోతున్న ఈటల

Rajnath Singh: తోక జాడిస్తే పాక్‌ని లేపేస్తాం.. రాజ్ నాథ్ మాస్ వార్నింగ్

Devaragattu Bunny Utsavam: కొట్టుకు చావడమే సాంప్రదాయమా..! మాల మల్లేశ్వర ఏంటి కథ..

Big Stories

×