Big Stories

Telangana Phone Tapping Case : అన్నీ వినేసిన అపరమేధావి.. ప్రత్యర్థులపై టాస్క్ ఫోర్స్ అటాక్స్.. సొంతపార్టీకి ఫండింగ్

Telangana Phone Tapping Case news(Latest news in Telangana): చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడుతాయి. తప్పులు ఏ రూపంలోనైనా బయటకు వస్తాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పుట్ట బద్దలైంది. అంతా సీక్రెట్ గా చేశామని వాళ్లు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అంతా ఓపెనప్ అయిపోయింది. దాయడానికి, దాచుకోవడానికి ఏమీ లేదు. అందుకే వాంగ్మూలాల్లో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. తెలంగాణలో రాజకీయంగా తిరుగు ఉండకూడదు అనుకున్నారు. బీఆర్ఎస్ ను పై స్థానంలో నిలపాలన్న టార్గెట్ తోనే పని చేశారు. తన.. మన అనే తేడా లేదు.. అందరినీ శాసించాలనుకున్నారు. కానీ ఆయన కత్తికి ఆయనే బలయ్యారు.

- Advertisement -

పగోడిని, పక్కనోడిని వదలకుండా అందరి ఫోన్లు వినేశారు అపరమేధావి కేసీఆర్. అంతేకాదు.. అలా చేస్తూనే పక్కదారిలో పార్టీ ఫండింగ్ కు కూడా తెరలేపారు. కోట్లకు కోట్లు డబ్బు కట్టలు పార్టీ అకౌంట్లో చేరేలా చేశారు. ఎందుకంటే ఇదంతా ఓ ఆర్గనైజ్డ్ గా జరిగింది. తవ్వితే లోతులన్నీ బయటపడుతున్నాయి. ట్యాపింగ్ చేయడం ప్రణీత్ రావు అండ్ కో పని. మరి వారికి టాస్క్ ఇవ్వడం మరో టీమ్ పని. ఫోన్ నెంబర్లు ఇవ్వడం, కనిపెట్టాలని చెప్పడం ఇదే కథ. సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లో ఆపరేషన్ చేపట్టాలి కదా.. అందుకు నమ్మకమైన టాస్క్ ఫోర్స్ టీమ్ తో పక్కాగా దాడులు నిర్వహించి ప్రత్యర్థి పార్టీల డబ్బులు పట్టుకోవడం ఇదే జరిగింది.

- Advertisement -

అసలు ఈ కేసులో ఎక్కడో ఉన్న ఆఫీసర్లను.. ఒక చోటకు తీసుకొచ్చి ఓ పెద్ద స్కెచ్ గీశారు కేసీఆర్. అవును.. ఈ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు గతంలో ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పని చేస్తే.. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్‌పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్‌ఐగా, భువనగిరిలో సీఐగా పని చేయగా, భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్‌ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐగా పనిచేశారు. సో ఇవన్నీ లింకులు చక్కగా కుదిరి ఓ టీమ్ మాదిరిగా ఏర్పడ్డారు. ఆ తర్వాత కథ నడిపారంటున్నారు. SIB, టాస్క్‌ఫోర్స్‌ను విచ్చలవిడిగా వాడేసి దందా సాగించారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని మునుగోడు బైపోల్ ఆకర్షించింది. ఎందుకంటే దేశంలో ఏ బైపోల్ లోనూ పెట్టని ఖర్చు ఇక్కడ పెట్టారు. అడ్డూ అదుపూ లేదు. ప్రత్యర్థి పార్టీలను ఇదే ఫోన్ ట్యాపింగ్ తో కట్టడి చేశారు. వారి డబ్బులను సీజ్ చేశారు. అనుకున్న ఫలితం రాబట్టుకున్నారు. ఇదే కాదు.. చాలా చేశారు. సెలబ్రిటీలు, వీఐపీలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా ఎందరివో ట్యాప్ చేసి సెటిల్మెంట్లు చేశారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు వసూలు చేశారు. సివిల్ తగాదాలను సెటిల్ చేశారు. ఓవైపు వాంగ్మూలాల్లో ఇంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వస్తుంటే.. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం.. అదో టాపిక్కా అని సింపుల్ గా కొట్టి పారేస్తున్నారు.

అంతా చట్టవిరుద్ధమని తెలుసు. అయినా సరే చేశామని నిందితులు ఒప్పుకుంటున్న పరిస్థితి. ఫోన్​ ట్యాపింగ్​ సమాచారం ఆధారంగా టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ డీసీపీ హోదాలోని రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి.. వివిధ కంపెనీలకు చెందిన డబ్బుతో పాటు ప్రతిపక్ష పార్టీల డబ్బును సీజ్ చేయించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలీసు తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల క్యాష్ సీజ్ చేశారు. ఇందులో ఎక్కువమొత్తం హవాలాకు సంబంధించినదే. మూడువందల కిలోల బంగారం, 1000 కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా రూట్ లో వెళ్లే వారినే ప్రణీత్‌రావు టీం టార్గెట్ గా చేసుకుందని పోలీసులు అనుమానించారు. హవాలా డబ్బు విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయరని భావించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.

ఒక్కసారి రుచి మరిగితే అంతే సంగతి. ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టి, ప్రత్యర్థి పార్టీల నాయకుల డబ్బును సీజ్ చేయించడం మెయిన్ టార్గెట్ గా పని చేశారు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి చెందినవిగా చెబుతున్న రూ.70 లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు. 2020 దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావుకు పరిచయస్తులపై నిఘా ద్వారా సిద్ధిపేటలో ఒక చిట్‌ఫండ్ కంపెనీ యజమాని నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అటు 2022 మునుగోడు బైపోల్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచయస్తులపై నిఘా పెట్టి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయాలు వెలుగుచూశాయి. అదే సమయంలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో ఈజీగా తరలించారు.

Also Read : “నేను ఉన్నాను.. నేను విన్నాను..” కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కేసీఆర్

ఇదంతా దేశ భద్రకు సంబంధించిన అంశం .. కానీ కేసీఆర్ వాటన్నింటిని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. సొంత పార్టీ నేతలను ఈ వ్యూహంతోనే కట్టడి చేశారు. ఇప్పుడు ఆయన ఉచ్చు ఆయనకే బిగుసుకునే స్టేజ్ కు వచ్చింది. సొంత పార్టీ నేతలు సైతం ఈ వ్యవహారాన్ని ఖండించలేకపోతున్నారు. ఇన్ డైరెక్ట్ గా కేసీఆర్ శిక్షకు అర్హుడనే అన్నట్టు ఉంది.. దాదాపుగా రాధాకిషన్ వాగ్మూలంలో ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియా కేసీఆర్ అనే నిందితులు చెప్పేశారు.. మరి రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్​ ట్యాపింగ్​ చేసిన కేసీఆర్ శిక్షార్హులే కదా.

మొత్తంగా కేసీఆర్ కన్నుసైగల్లో ఎంత డబ్బు చేతులు మారింది.. ఎంత డబ్బులు ఆయన జేబులో వేసుకున్నారు అనేవి బయటికి తీయనున్నారు పోలీసులు.. సో ప్రస్తుతమున్న రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ తో రాజకీయ పార్టీ పెద్దలు.. ఆ పార్టీ ప్రతినిధులు.. మరికొందరు పోలీసు అధికారులు అడ్డంగా బుక్కవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్‌ అడ్డంగా బుక్కయ్యారు. ఈ దెబ్బతో బీఆర్ఎస్ కథ కంచికి చేరడం ఖాయమనే చెప్పాలి. లెట్స్ సీ.. మున్ముందు ఏం జరుగుతుంది అనేది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News