BigTV English

Kalki 2898 AD Nag Ashwin – Elon Musk: ఒక్కసారి మా ‘బుజ్జి’ని డ్రైవ్ చేయండి సార్.. ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

Kalki 2898 AD Nag Ashwin – Elon Musk: ఒక్కసారి మా ‘బుజ్జి’ని డ్రైవ్ చేయండి సార్.. ఎలాన్ మస్క్‌కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

Kalki 2898 AD movie latest update(Celebrity news today):

యావత్ సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘బుజ్జి’ కారును ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.


అందులో ప్రభాస్ ‘బుజ్జి’తో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. ఇక డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మాస్ యాక్షన్‌ లుక్‌లో సేమ్ హాలీవుడ్ రేంజ్ మార్వెల్ హీరోలా తమ హీరో ఉన్నాడంటూ తెగ పొగిడేశారు. అయితే కల్కి సినిమాలో బుజ్జి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌ ఉంటుందని అంటున్నారు. ఇందులో ఒక రోబోటిక్‌లా ప్రభాస్‌కు మంచి క్లోజ్ ఫ్రెండ్‌లా ఉంటుందట. యుద్ద సమయాల్లో ప్రభాస్‌కు సలహాలు ఇస్తుందని అంటున్నారు.

అయితే ఈ బుజ్జి కార్‌కు నటి కీర్తి సురేష్ తన వాయిస్‌ను అందించింది. ఇక బుజ్జి పేరు చిన్నగా ఉన్నా.. దాని పాత్ర మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని ఇటీవల దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇంకా ఈ మూవీ రిలీజ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండగా.. ఆ బుజ్జి కార్‌తో పలువురు స్టార్స్ రైడ్స్ చేసి హైప్ పెంచేస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ నుంచి అక్కినేని నాగ చైతన్య బుజ్జి కారులో డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ కార్ చెన్నైలో చక్కర్లు కొడుతోంది. అక్కడ సూపర్ స్టార్ ఈ కారును డ్రైవ్ చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీని బట్టి చూస్తే మేకర్స్ దేశంలో పలు ప్రధాన నగరాల్లో బుజ్జిని తిప్పుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: ప్రభాస్ ‘బుజ్జి’పై నాగచైతన్య రైడ్.. షాక్ అయ్యానంటూ వీడియో రిలీజ్..!

ఇదిలా ఉంటే చెన్నై రోడ్లలో చక్కర్లు కొడుతున్న ఈ కార్‌ వీడియోకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్‌కు ట్యాగ్ చేశాడు. ఈ మేరకు ‘‘సర్.. మా బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువున్న బీస్ట్. పూర్తిగా మేడిన్ ఇన్ ఇండియా ఫుల్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ ఫీట్. ఇది మీరే మంచి అనుభూతిని ఇస్తుంది’’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మరి ఈ బుజ్జిని డ్రైవ్ చేసేందుకు ఎలాన్ మస్క్ వస్తాడా లేదా అనేది చూడాలి.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×