TS Cabinet: అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టిన కాంగ్రెస్.. మిగిలిన ఆశావహుల విషయంలో బుజ్జగింపుల పర్వం షురూ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రిపదవి ఆశించి.. పదవి రాకపోవడంతో ఆసంతృప్తిగా నేతలను నామినేటెడ్ పదవులు ఇచ్చి సంతృప్తి పరిచే విధంగా చర్యలు తీసుకుంటుంది.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో పదవి
మంత్రి పదవి ఆశించి భంగపడిన నిజామాబాద్ జిల్లా బోధన్ సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎట్టకేలకు జిల్లాకు మంత్రి స్థాయి గౌరవం దక్కిందిమాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో పదవి కట్టబెట్టింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో ఆయన మంత్రిగా పనిచేశారు. పార్టీలో సీనియర్ కావడం, జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి వస్తుందని జిల్లా నాయకులు అనుకున్నారు.సామాజిక సమీకరణల దృష్ట్యా సుదర్శనరెడ్డికి మంత్రి పదవి దక్కలేదని పార్టీ నాయకత్వం చేబుతూ వచ్చింది. ఆ క్రమంలో సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వంలో అవకాశం కల్పించేలా పార్టీ, సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యేక ఆహ్వానితుడిగా క్యాబినెట్ సమావేశాలకు..
పార్టీలో సీనియర్, మంత్రిగా పని చేసిన అనుభవం ఉండడంతో సలహాదారు హోదాలో సుదర్శన్‌రెడ్డిని నియమించారు. ప్రభుత్వం కీలకంగా భావించిన ఫ్లాగ్‌షిప్ పథకాల అమలులో ప్రభుత్వం సుదర్శన్ రెడ్డి సలహాలు తీసుకోనుంది.సుదర్శన్‌రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా తో నియమించడంతోపాటు.. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేబినెట్ సమావేశాలకు హాజరుకావచ్చని ఉత్తర్వుల్లో పేర్కోంది. జిల్లా కలెక్టర్లు, శాఖ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి హాజరవుతుతారు. ముఖ్య సలహాదారుడికి సచివాలయంలో మంత్రి స్థాయి వసతులు కల్పిస్తారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించారు. ప్రస్తుతం సుదర్శన్‌రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యే జీఓ జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితులైన సుదర్శన్ రెడ్డిఅనుభవం ప్రభుత్వానికి ఉపయోగం ఎంతో ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తోంది.
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ప్రేమ్ సాగర్‌రావు
మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు క్యాబినెట్ హోదాతో పదవిని ఇచ్చింది ప్రభుత్వం. ప్రేమ్‌సాగర్‌రావును సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మంత్రివర్గ విస్తరణలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ప్రేమ్ సాగర్ రావు ఆశించారు. మొదటి విడతలో మంత్రి పదవి రాకపోవడంతో రెండోసారైనా అవకాశం ఉంటుందని ఆశలు పెట్టుకున్నారు.
Also Read: వెంకన్న ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మతి.
మంత్రి పదవి దక్కక అసంతృప్తితో ఉన్న ప్రేమ్ సాగర్
రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి క్యాబినెట్‌లోకి చోటు దక్కింది. దాంతో అప్పటి నుంచి ప్రేమ్‌సాగర్‌రావు అసంతృప్తిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్నందుకు తనకు పదవి రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకున్నా తన నియోజకవర్గానికి తానే రాజు నంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం రోజే ప్రేమ్‌సాగర్‌కు క్యాబినెట్ హోదాతో సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగంచారు.
Story By Apparao, Bigtv