Hydra Demolishing: హెచ్ఎండీఏ కు చెందిన భూముల ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మియాపూర్ సర్వేనెంబర్ 100లో భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని హైడ్రా శనివారం కొనసాగించింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగర పరిధిలోని మియాపూర్‌లో.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 5 అంతస్తుల భవనం నిర్మించిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సుమారు 873 గజాల భూభాగంలో, అందులో 473 గజాలు ప్రభుత్వ భూమి గా గుర్తించడంతో, హైడ్రా అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు అమీన్పూర్‌లోని సర్వే నంబర్లు 337, 338లో ఉన్న HUDA అప్రూవ్డ్ లే అవుట్‌లో 400 గజాల 126 నెంబర్ ప్లాట్ కొనుగోలు చేశారు. అయితే ఆ ప్లాట్ పక్కనే ఉన్న మియాపూర్ సర్వే నంబర్ 101, ఇది ప్రభుత్వానికి చెందిన HMDA భూమి. 126/D, 126/part, 126/C పేర్లతో కొత్త ప్లాట్లు సృష్టించి, వాటిని వ్యక్తిగత స్వామ్యంగా చూపుతూ 5 అంతస్తుల భవనం నిర్మించారు.
2014లోనే భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఫేక్ LRS పత్రాలు సృష్టించినట్లు హైడ్రా విచారణలో బయటపడింది. LRS చెల్లింపుల కోసం చూపించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD) కూడా నకిలీదేనని గుర్తించారు. ఈ అక్రమ లావాదేవీలను గుర్తించిన తరువాత, అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.
HMDA అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, హైడ్రా ప్రత్యేక బృందం రెవెన్యూ, మున్సిపల్, HMDA అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసింది. సర్వే నంబర్ 101లోని సరిహద్దులను సరిగ్గా గుర్తించి, ప్రభుత్వ భూమిలోకి జరిగిన నిర్మాణాన్ని స్పష్టంగా గుర్తించారు. సాక్ష్యాలు, రికార్డులు, ఫీల్డ్ మ్యాపింగ్ ఆధారంగా మొత్తం 473 గజాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరిగినట్టు తేలింది.
Also Read: కాశీబుగ్గలో తొక్కిసలాట.. 9 మంది మృతి..
అన్నీ నిర్ధారించుకున్న అనంతరం, హైడ్రా అధికారులు శనివారం కూల్చివేత చర్యలు చేపట్టారు. జేసీబీలు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ బందోబస్తుతో కలిసి ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఆక్రమణ స్థలంలో ఎవరూ అడ్డంకులు సృష్టించకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా, హెచ్ఎండీఏ ఉక్కుపాదం..
మియాపూర్ సర్వే నెంబర్ 100లో అక్రమ భవనం కూల్చివేత
అమీన్ పూర్ మున్సిపాలిటీ పర్మిషన్ తో భవన నిర్మాణం
సర్వే నెంబర్ తప్పుగా చూపించి నిర్మించిన భవనాన్ని కూల్చేసిన అధికారులు pic.twitter.com/WYntwKemlH
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2025